నథింగ్ ఫోన్ 3 స్పెషల్ ఫీచర్స్.. కంప్లీట్ డీటెయిల్స్ మీకోసం

ఇప్పటివరకు నథింగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఫోన్స్ మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అదే రేంజ్ లో నథింగ్ ఫోన్ 3 కూడా రానుంది. అయితే ఈ మోడల్ రెండు కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది.

నథింగ్ ఫోన్ 3 స్పెషల్ ఫీచర్స్.. కంప్లీట్ డీటెయిల్స్ మీకోసం

Photo Credit: Nothing

ఫోన్ 3 వెనుక ఉన్న సిగ్నేచర్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను ఏదీ కోల్పోదు

ముఖ్యాంశాలు
  • బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది
  • 2 డిఫరెంట్ స్టోరేజ్ ఆప్షన్స్ అవైలబుల్
  • నథింగ్ హెడ్ ఫోన్ 1 సెప్టెంబర్ 30న లాంచ్ అయ్యే ఛాన్స్
ప్రకటన

కి చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ నథింగ్ తన యూనిక్ డిజైన్ మొబైల్ ఫోన్లకి ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఇప్పటివరకు లాంచ్ చేసిన మొబైల్స్ అన్ని కూడా కస్టమర్ల నుండి మంచి రివ్యూలు పొందాయి. ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే ట్రాన్స్పరెంట్ బాడీ, ఎల్ఈడి లైట్స్, బెస్ట్ కెమెరా ఫీచర్స్ తో మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. తాజాగా ఈ కంపెనీ తమ బ్రాండ్ నుండి నథింగ్ ఫోన్ 3ని త్వరలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కు సంబంధించి లీకైన డీటెయిల్స్ కస్టమర్స్ కి ఎక్స్పెక్టేషన్స్ని పెంచేస్తున్నాయి.
ఈ నథింగ్ ఫోన్ 3 మొబైల్ ఇండియన్ మార్కెట్లో రాబోయే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నథింగ్ కంపెనీ సీఈవో కార్ల్ పీ ఈ ఫోన్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ను లీక్ చేశారు. ఈ ఫోన్ ప్రైస్ రేంజ్, కలర్ వేరియంట్స్ గురించి కొన్ని కి డీటెయిల్స్ తెలిసాయి.

ఈ నథింగ్ ఫోన్ 3 మొబైల్ 2 స్టోరేజ్ వేరియన్స్ లో అవైలబుల్ గా ఉండనుంది. 12GB + 256GB బేస్ వేరియంట్ ధర సుమారు రూ.68,000 ఉంటుందని తెలిసింది. అలాగే , 16GB + 512GB వేరియంట్ ధర సుమారు రూ.77,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 మోడల్స్ కి ఉన్నట్టే నథింగ్ ఫోన్ 3 కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్స్ ఉండనున్నాయి.

అయితే లీకైన సమాచారం ప్రకారం ఈ నథింగ్ ఫోన్ 3 మొట్టమొదటిసారి USA లో లాంచ్ అవునన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నథింగ్ కంపెనీ నుండి లాంచెను ఏ ఫోను కూడా USA లో సేల్ చేయలేదు. కేవలం టెస్టింగ్ పర్పస్, ఫీడ్ బ్యాక్ పర్పస్ కి మాత్రమే ఈ ఫోన్లు USA లో దొరికేవి.

అలాగే నథింగ్ బ్రాండ్ నుండి లాంచ్ అవునన్న మొదటి హెడ్ ఫోన్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందని తెలిపారు. దీనిని నథింగ్ హెడ్ ఫోన్ 1 గా మెన్షన్ చేశారు. ఈ హెడ్ ఫోన్ సెప్టెంబర్ 30న లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఈ హెడ్ ఫోన్స్ ధర దాదాపు రూ.25,500 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ హెడ్ ఫోన్ సోనీ WH-1000XM6 కి కాంపిటీషన్ గా తీసుకొస్తున్నారు. ప్రీమియం రేంజ్ లోనే దీని ప్రైస్ కూడా ఉండడం ఇక్కడ గమనించవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని నథింగ్ ఫోన్ 3 లాంచింగ్ టైం లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు.

అయితే ఇప్పటివరకు లీకైన ఈ నథింగ్ ఫోన్ 3 డీటెయిల్స్ చూసి ఈ ఫోన్ లాంచింగ్ కోసం నథింగ్ అభిమానులకు, కస్టమర్లు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ ఫోన్ కి సంబంధించిన కెమెరా మోడల్, డిస్ప్లే, ప్రాసెసర్, సైజ్, ఇతర స్పెసిఫికేషన్స్ ఇవి కూడా రివీల్ కాలేదు. ఫోన్ లాంచింగ్ కి ముందు ఈ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి
  2. ఈ ఫోన్‌ 4400mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 నిమిషాల్లో 50% ఛార్జ్
  3. ChatGPT said: ఆఫర్లు బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMIతో ఎఫెక్టివ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి
  4. ఈ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లతో లభ్యమవుతూ నో కాస్ట్ EMI ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో
  5. జూలై 14న ఇండియ‌న్ మార్కెట్‌లోకి Vivo X Fold 5, Vivo X200 FE
  6. స‌రికొత్త బ్యాట‌రీ అప్‌గ్రేడ్‌తో మార్కెట్‌లోకి iPhone 17 Pro Max
  7. ఇది మిడ్ రేంజ్‌ సెగ్మెంట్లో గట్టి పోటీగా జూలై 12 నుంచి అమెజాన్‌లో లభ్యం
  8. ప్రైమ్ డే 2025: ఎకో, ఫైర్ టీవీ, కిండిల్‌లపై గరిష్ఠంగా 50% డిస్కౌంట్
  9. నథింగ్ హెడ్‌ఫోన్ 1లో 1040mAh బ్యాటరీ ఉంది, 120 నిమిషాల్లో Type-C ద్వారా ఛార్జ్ అవుతుంది
  10. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన నథింగ్ OS 3.5 పై రన్ అవుతుంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »