Photo Credit: Oppo
Oppo K12 Plus is equipped with a dual rear camera setup
చైనా మొబైల్ మార్కెట్‌లోకి ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో Oppo K12 Plus స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. Oppo నుంచి తాజాగా లాంచ్ అయిన ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో పాటు 12GB వరకు RAM, 512GB వరకు స్టోరేజీ సామర్థ్యంతో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14పై రన్ అవుతుంది. 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,400mAh బ్యాటరీని అందించారు. అలాగే, Oppo K12 Plus డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కంపెనీ హ్యాండ్‌సెట్ నాణ్యతపై ప్రచారంలో భాగంగా.. దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP54 రేటింగ్‌ను కూడా కలిగి ఉన్నట్లు వెల్లడించింది.
చైనా మార్కెట్‌లో Oppo K12 Plus ధర 8GB RAM, 256GB స్టోరేజీతో కూడిన బేస్ మోడల్ CNY 1,899 (సుమారు రూ. 22,600) నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 12GB+256GB, 12GB+512GB వేరియంట్‌ల ధర వరుసగా CNY 2,099 (దాదాపు రూ. 25,000), CNY 2,499 (దాదాపు రూ. 29,800)గా నిర్ణయించారు. ఇది బసాల్ట్ బ్లాక్, స్నో పీక్ వైట్ (చైనీస్ నుండి అనువదించబడింది) రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. కంపెనీ ప్రకటన ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో అక్టోబర్ 15న అమ్మకానికి వస్తుంది. అయితే ప్రీ-ఆర్డర్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొనుగోలుదారులు రెండో వేరియంట్ 256GB స్టోరేజ్ వేరియంట్‌ల ధరను CNY 100 (దాదాపు రూ. 1,200) వరకూ తగ్గింపును పొందవచ్చు.
Oppo K12 Plus డ్యూయల్-సిమ్ (నానో+నానో)తో Android 14-ఆధారిత ColorOS 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌పై రన్ అవుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,412 పిక్సెల్‌లు) AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌తో 8GB LPDDR4X RAMని జోడించి రూపొందించారు. వినియోగదారలు ఫోటోలు, వీడియోల కోసం Sony IMX882 సెన్సార్ (f/1.8)తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఉపయోగించవచ్చు. అలాగే, IMX355 సెన్సార్ (f/2.2)తో కూడిన 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా యూనిట్ వైడ్ యాంగిల్ షాట్‌లను హ్యాండిల్ చేస్తుంది. ముందు భాగంలో f/2.4 ఎపర్చర్‌తో 16-మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఈ Oppo K12 Plusలో 512GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజీతో వస్తుండగా, దీనిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకుఅప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇది 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, GPS, NFC కనెక్టివిటీతో పాటు ప్రాక్సెమెట్లీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్, ఈ-కంపాస్‌లకు సపోర్ట్ చేస్తుంది. 80W SuperVOOC అడాప్టర్ ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో బయోమెట్రిక్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, గృహోపకరణాలను నియంత్రించడానికి ఇన్‌ఫ్రారెడ్ (IR) ట్రాన్స్‌మిటర్ ఉన్నాయి. 162.5×75.3×8.37mm పరిమాణంతో 192గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన