Vlogging Smartphones : యూట్యూబర్లు, వ్లాగర్లకు పండగే.. వీడియో షూటింగ్‌కు అదిరిపోయే టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

చైనీస్ బ్రాండ్లు వివో, ఒప్పో, షావోమి కూడా లీకా, జైస్ వంటి లెన్స్‌లతో మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. మీరు కూడా మంచి వ్లాగింగ్ ఫోన్ కోసం చూస్తుంటే, భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫోన్ల పూర్తి వివరాలు, వాటి ధరల గురించి తెలుసుకుందాం.

Vlogging Smartphones : యూట్యూబర్లు, వ్లాగర్లకు పండగే.. వీడియో షూటింగ్‌కు అదిరిపోయే టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Vivo X300 Ultra has a triple rear camera unit including a 200-megapixel primary camera

ముఖ్యాంశాలు
  • కంటెంట్ క్రియేటర్లకు ఎప్పటికీ మొదటి ప్రాధాన్యత యాపిల్ ఐఫోనే
  • ఐఫోన్ 17 ప్రో మాక్స్ వీడియోగ్రఫీకి ఒక అద్భుతమైన ఎంపిక
  • నైట్ లైట్ లో అదిరిపోయే వీడియోల కోసం శామ్‌సంగ్ గెలాక్సీ S26 Ultra
ప్రకటన

Vlogging Smartphones : ప్రస్తుత డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేషన్, వ్లాగింగ్ అనేవి కేవలం కాలక్షేపం సరదాలు మాత్రమే కాదు.. ఒక పూర్తిస్థాయి కెరీర్‌గా మారిపోయాయి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్స్ కోసం ప్రతిరోజూ లక్షలాది మంది వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ వీడియో షూటింగ్ కోసం భారీ కెమెరాలు కొనే పనిలేకుండా.. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లే సినిమా రేంజ్ అవుట్‌పుట్‌ను ఇస్తున్నాయి. ఒకప్పుడు ఫోటోగ్రఫీ, వీడియోల కోసం కేవలం యాపిల్ ఐఫోన్ లేదా శామ్‌సంగ్ మోడళ్లను మాత్రమే బెస్ట్ అనుకునేవారు. కానీ ఇప్పుడు చైనీస్ బ్రాండ్లు వివో, ఒప్పో, షావోమి కూడా లీకా, జైస్ వంటి లెన్స్‌లతో మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. మీరు కూడా మంచి వ్లాగింగ్ ఫోన్ కోసం చూస్తుంటే, భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫోన్ల పూర్తి వివరాలు, వాటి ధరల గురించి తెలుసుకుందాం.

iPhone 17 Pro Max.. 
కంటెంట్ క్రియేటర్లకు ఎప్పటికీ మొదటి ప్రాధాన్యత యాపిల్ ఐఫోనే. ఈ సిరీస్‌లో టాప్ ఎండ్ మోడల్ అయిన ఐఫోన్ 17 ప్రో మాక్స్ వీడియోగ్రఫీకి ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో 48ఎంపీ మెయిన్ కెమెరా, 48ఎంపీ అల్ట్రావైడ్, 4X ఆప్టికల్ జూమ్ గల 48ఎంపీ టెలిఫోటో కెమెరాలతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ వ్లాగ్స్ కోసం ముందు భాగంలో ఆటోఫోకస్ గల 18ఎంపీ కెమెరాను ఇచ్చారు. 6.9-ఇంచుల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ అమోలెడ్ డిస్ప్లే, ఏ19 ప్రో చిప్, ఆపిల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు దీని ప్రత్యేకత. సింగిల్ ఛార్జ్‌పై 37 గంటల వీడియో ప్లేబ్యాక్ ఇచ్చే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1,49,900 (256GB) కాగా, టాప్ వేరియంట్ 2TB మోడల్ ధర రూ.2,29,900 గా ఉంది.
 

iphone 17 pro max review back panel

Samsung Galaxy S26 Ultra..  
దూరంగా ఉండే వస్తువులను స్పష్టంగా షూట్ చేయడానికి, నైట్ లైట్ లో అదిరిపోయే వీడియోల కోసం శామ్‌సంగ్ గెలాక్సీ S26 Ultra కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఇందులో ఏకంగా 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు, 5x ఆప్టికల్ జూమ్ గల 50ఎంపీ పెరిస్కోప్, 50ఎంపీ అల్ట్రావైడ్, 10ఎంపీ టెలిఫోటో కెమెరాల క్వాడ్ సెటప్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, గెలాక్సీ ఏఐ (Galaxy AI) ఎడిటింగ్ ఫీచర్లు, గొరిల్లా ఆర్మర్ 2 ప్రొటెక్షన్ గల 6.9-ఇంచుల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ దీని సొంతం. ఇండియాలో దీని బేస్ వేరియంట్ (12GB+256GB) ధర రూ.1,39,999 కాగా, హై-ఎండ్ మోడల్ (16GB+1TB) ధర రూ.1,89,999గా నిర్ణయించారు.


 

vivo x300 ultra fi6

  Vivo X300 Ultra..  
సినిమాటిక్ కలర్స్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని ఇష్టపడే క్రియేటర్ల కోసం  Zeiss ట్యూన్ చేసిన కెమెరాలతో వివో X300 Ultra మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 200ఎంపీ మెయిన్ కెమెరా, 3.7x ఆప్టికల్ జూమ్, 105x డిజిటల్ జూమ్ సపోర్ట్ గల 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉండటం విశేషం. ముందు భాగంలో 50ఎంపీ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, 6600mAh భారీ బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్ గల 6.82-ఇంచుల 2K అమోలెడ్ స్క్రీన్ దీని ఫీచర్లు. భారత మార్కెట్లో దీని ఏకైక వేరియంట్ (16GB+512GB) ధర రూ.1,59,999. అదనంగా రూ.27,999కి వివో జైస్ టెలిఫోటో ఎక్స్‌టెండర్ జెన్ 2 కూడా లభిస్తుంది.

Find X9 Pro.. 
భారీ ల్యాండ్‌స్కేప్ వీడియోలు తీసే వారికి, రోజంతా షూటింగ్స్ చేసే వ్లాగర్లకు  ఒప్పో ఫైండ్ X9 ప్రో ఒక వరం లాంటిది. ఎందుకంటే ఇందులో ఏకంగా 7,500mAh కొండలాంటి సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చారు. కెమెరాల విషయానికొస్తే.. 50ఎంపీ సోనీ LYT-828 మెయిన్ సెన్సార్, 50ఎంపీ అల్ట్రావైడ్, 200ఎంపీ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, 16జీబీ ర్యామ్, 80W ఫాస్ట్ ఛార్జింగ్ గల ఈ ఫోన్ 16GB+512GB సింగిల్ వేరియంట్ ధర ఇండియాలో కేవలం రూ. 1,09,999 గా ఉంది. తక్కువ బడ్జెట్ లో టాప్ ఎండ్ కెమెరా, బ్యాటరీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
 

 

boAt : గ్యాడ్జెట్ మార్కెట్లో బోట్ సంచలనం.. ఇండియాలోనే ఫస్ట్ టైం డైరెక్ట్ టైప్-సి ఛార్జింగ్ స్మార్ట్‌వాచ్‌లు

oppo find x9 pro design overall gadgets 360

 
  Xiaomi 17 Ultra.. 
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేసే వారికి లీకా మ్యాజిక్‌తో కూడిన షావోమి 17 ఆల్ట్రా ఒక అద్భుతమైన డివైజ్. ఇందులో 1-ఇంచ్ సైజ్ గల లైట్ ఫ్యూజన్ 1050L 50ఎంపీ మెయిన్ కెమెరా ఉంది. దీనివల్ల లో-లైట్లో కూడా పగటిపూట తీసినంత అద్భుతంగా వీడియోలు వస్తాయి. దీనితో పాటు 120x డిజిటల్ జూమ్ గల 200ఎంపీ టెలిఫోటో కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ దీని ప్రత్యేకతలు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ, 3,500 నిట్స్ బ్రైట్‌నెస్ గల 6.9-ఇంచుల స్క్రీన్‌తో వచ్చే ఈ ఫోన్ (16GB+512GB) ధర భారతదేశంలో రూ.1,39,999గా ఉంది.

 

xiaomi 17 ultra review8

 

#తాజా కథనాలు
  1. Xiaomi 17T : ఐఫోన్‌లకే చెమటలు పట్టించేలా షావోమి ప్లాన్.. 7,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్
  2. Motorola : జూన్ 4న మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ గ్రాండ్ ఎంట్రీ.. లీకైన మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు!
  3. Meta Subscribed : ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు ఇకపై ఫ్రీగా వాడుకునే రోజులు ఖతం.. బాదుడు షురూ!
  4. Airtel : ఇక నో సిగ్నల్ టెన్షన్..ఇండియాలోనే మొదటిసారి ఎయిర్‌టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్
  5. Vlogging Smartphones : యూట్యూబర్లు, వ్లాగర్లకు పండగే.. వీడియో షూటింగ్‌కు అదిరిపోయే టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
  6. boAt : గ్యాడ్జెట్ మార్కెట్లో బోట్ సంచలనం.. ఇండియాలోనే ఫస్ట్ టైం డైరెక్ట్ టైప్-సి ఛార్జింగ్ స్మార్ట్‌వాచ్‌లు
  7. OTT Movie : కులాల గొడవలు, ఊరి పెద్దల అక్రమాలు.. వీటి వెనుక నిజాలు తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే !
  8. OTT Movie : మతిస్థిమితం కోల్పోయిన నిత్య.. ఏ మగాడిని చూసినా ఆ మొహమే ఎందుకు కనిపిస్తోంది?
  9. Asus : ఒకే చోట రెండు 16-ఇంచ్ 3K డిస్‌ప్లేలు.. గేమర్ల కోసం అసూస్ తెస్తోన్న వింత డివైజ్
  10. Xiaomi : రెడ్‌మి ప్రియులకు డబుల్ ధమాకా.. ఆ రెండు స్మార్ట్‌ఫోన్ల వెనుక దాగున్న అసలు ట్విస్ట్ ఇదే!
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »