బోట్ స్టార్మ్ కాల్ 4, బోట్ అల్టిమా వోగ్ 2 పేరుతో ఈ మోడళ్లు మార్కెట్లోకి అడుగుపెట్టాయి.
Photo Credit: Boat
Boat Storm Call 4 features a 1.96-inch HD display
boAt : భారతీయ వేరబుల్ మార్కెట్లో నంబర్ వన్ బ్రాండ్‌గా దూసుకుపోతున్న బోట్ సంస్థ సరికొత్త విప్లవాత్మక ఆవిష్కరణతో ముందుకొచ్చింది. స్మార్ట్‌వాచ్‌లు వాడే ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే అతిపెద్ద సమస్య.. వాటికి ఉండే ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పిన్స్ లేదా క్లిప్‌లు. అవి ఎక్కడైనా పోయినా లేదా పాడైనా వాచ్ ఛార్జ్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఈ సమస్యకు శాశ్వతంగా బై-బై చెబుతూ.. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డైరెక్ట్ యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్ చేసే రెండు సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను బోట్ కంపెనీ లాంచ్ చేసింది. బోట్ స్టార్మ్ కాల్ 4, బోట్ అల్టిమా వోగ్ 2 పేరుతో ఈ మోడళ్లు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అంటే ఇకపై మీరు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌కు వాడే టైప్-సి కేబుల్‌తోనే ఎలాంటి అదనపు కనెక్టర్ లేకుండా ఈ వాచ్‌లను ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.
బోట్ సంస్థ ఈ నయా టెక్నాలజీ వాచ్‌లను సామాన్యుడి బడ్జెట్‌కు అందుబాటులో ఉండే ధరల్లోనే విడుదల చేసింది. ఇందులో బేసిక్ మోడల్ అయిన బోట్ స్టార్మ్ కాల్ 4 ధరను కేవలం రూ.1,599గా నిర్ణయించారు. ఇది యాక్టివ్ బ్లాక్, నేవీ బ్లూ, స్టీల్ బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీని ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కాగా దీని అధికారిక విక్రయాలు జూన్ 12, 2026 నుంచి షురూ కానున్నాయి. మరోవైపు, ప్రీమియం లుక్‌తో వచ్చే బోట్ అల్టిమా వోగ్ 2 ధరను రూ.2,799గా కంపెనీ నిర్ణయించింది.
డిజైన్, డిస్ప్లే పరంగా ఈ రెండు వాచ్‌లు యూజర్లకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. రెండింటిలోనూ 1.96-ఇంచుల లార్జ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేను అమర్చారు. అయితే, తక్కువ ధరలో వచ్చే స్టార్మ్ కాల్ 4 మోడల్‌లో 240×282 పిక్సెల్స్ రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్‌నెస్ గల హెచ్‌డీ స్క్రీన్, మెనూ స్క్రోలింగ్ కోసం వర్కింగ్ క్రౌన్ బటన్‌ను ఇచ్చారు. కాగా, ప్రీమియం మోడల్ అయిన అల్టిమా వోగ్ 2 లో ఎండలో కూడా చాలా స్పష్టంగా కనిపించేలా 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ గల అమోలెడ్ డిస్ప్లేను, స్టైలిష్ మెటాలిక్ ఫ్రేమ్ డిజైన్‌ను అందించడం విశేషం.
బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఈ వాచ్‌లు కొండలాంటి పవర్‌ను ఇస్తాయి. స్టార్మ్ కాల్ 4 లో 300mAh బ్యాటరీ ఉంది, ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 12 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే అల్టిమా వోగ్ 2 మోడల్ 10 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. హెల్త్ ఫీచర్ల విషయానికొస్తే.. రెండింటిలోనూ గుండె వేగాన్ని కొలిచే హార్ట్ రేట్ మానిటర్, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని చూపే SpO2 సెన్సార్, స్లీప్ అనాలిసిస్, స్ట్రెస్ లెవెల్స్ ట్రాకింగ్ వంటి అడ్వాన్స్డ్ సెన్సార్లు ఉన్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా ఫీమేల్ వెల్నెస్ ట్రాకింగ్ కూడా ఇందులో ఇచ్చారు.
ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు కేవలం టైమ్ చూడటానికే కాదు, మీ రోజువారీ పనులను సులభం చేయడానికి ఎన్నో స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇందులో బిల్ట్-ఇన్ మైక్, స్పీకర్ ఉన్నాయి, దీనివల్ల మీ ఫోన్ జేబులో ఉన్నా కూడా వాచ్ ద్వారానే బ్లూటూత్ కాలింగ్ మాట్లాడవచ్చు. ఆపద సమయంలో కాపాడుకోవడానికి ఇందులో ఎమర్జెన్సీ SOS ఫీచర్‌ను కూడా చేర్చారు. ఫిట్‌నెస్ ప్రియుల కోసం ఇందులో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్, 100కి పైగా డిఫరెంట్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. వీటికి IP68 రేటింగ్ ఉంది, కాబట్టి వర్షంలో తడిసినా, జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు చెమట పట్టినా ఈ వాచ్‌లు అస్సలు పాడవ్వవు. వీటి ద్వారా ఫోన్ లోని మ్యూజిక్, కెమెరాను కూడా కంట్రోల్ చేయవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Bee Frontier, Bee Eclipse AI Devices Launched: Price, Specifications