వన్‌ప్లస్, రెడ్‌మి, మోటోరోలా, వివో, రియల్‌మి వంటి అగ్రశ్రేణి బ్రాండ్లు సరికొత్త హార్డ్‌వేర్, మోడ్రన్ ఫీచర్లతో కొత్త ఫోన్లను రంగంలోకి దించాయి.
OnePlus Nord CE 6 is priced at Rs. 29,999
Smartphones : ప్రస్తుతం భారతదేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో మొబైల్ ఫోన్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ తమ హ్యాండ్‌సెట్ల ధరలను రూ.1,000 నుంచి రూ.6,000 వరకు పెంచేసాయి. అయినప్పటికీ, మిడ్‌సైజ్ మొబైల్ ప్రియుల కోసం రూ.30,000 బడ్జెట్ సెగ్మెంట్ లో ఇప్పటికీ అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్, రెడ్‌మి, మోటోరోలా, వివో, రియల్‌మి వంటి అగ్రశ్రేణి బ్రాండ్లు సరికొత్త హార్డ్‌వేర్, మోడ్రన్ ఫీచర్లతో కొత్త ఫోన్లను రంగంలోకి దించాయి. 50-మెగాపిక్సెల్ కెమెరాలు, అమోలెడ్ డిస్‌ప్లేలు, పవర్‌ఫుల్ ప్రాసెసర్లతో మార్కెట్లో దుమ్మురేపుతున్న టాప్-5 మొబైల్స్ వివరాలు, వాటి ధరల లిస్ట్ మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ ఇస్తున్నాము.
1. వన్‌ప్లస్ నార్డ్ CE 6
మల్టీటాస్కింగ్ ఇష్టపడే వారికి వన్‌ప్లస్ నార్డ్ CE 6 ఒక పవర్‌ఫుల్ ఆప్షన్. ఇందులో 6.78-ఇంచుల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు, ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 పై పనిచేసే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను అమర్చారు.
కెమెరా & బ్యాటరీ: దీని వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ప్రధాన హైలైట్ దీనిలో ఉన్న 8,000mAh భారీ బ్యాటరీ. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP69K రేటింగ్స్ ఉన్నాయి.
ధర: దీని బేస్ వేరియంట్ (8GB + 128GB) ధర రూ.29,999 కాగా, 256GB మోడల్ ధర రూ.32,999 గా ఉంది.
![]()
2. రెడ్‌మి నోట్ 15 SE 5G
లుక్ పరంగా స్టైలిష్‌గా ఉంటూ, డైలీ యూసేజ్‌లో నమ్మకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ కావాలనుకుంటే రెడ్‌మి నోట్ 15 SE 5G బెస్ట్ ఛాయిస్. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ గల 6.77-ఇంచుల అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు, ఇది 3,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్ హైపర్‌ఓఎస్ 3 పై రన్ అవుతుంది.
కెమెరా & బ్యాటరీ: వెనుక 50MP ప్రైమరీ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్, ముందు వైపు 20MP సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఇందులో 5,800mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
ధర: దీని 6GB + 128GB మోడల్ ధర రూ.24,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే టాప్ ఎండ్ వేరియంట్ (8GB + 256GB) ధర రూ.27,999 గా నిర్ణయించారు.
3. మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్
కస్టమర్ కోరుకునే అన్ని రకాల అడ్వాన్స్‌డ్ ఫీచర్లు మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌లో లభిస్తాయి. ఇందులో 6.78-ఇంచుల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను 144Hz రిఫ్రెష్ రేట్, ఏకంగా 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్ హలో యూఐ పై పనిచేస్తుంది. దీనికి 3 ఓఎస్ అప్‌గ్రేడ్స్ లభిస్తాయి.
కెమెరా & బ్యాటరీ: ఇందులో 50MP సోనీ లైటియా (LYTIA 710) మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలను ఇచ్చారు. సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. ఇందులో 7,000mAh బ్యాటరీ, 68W టర్బోపవర్ ఛార్జింగ్ ఉన్నాయి.
ధర: దీని 8GB + 128GB వేరియంట్ ధర రూ.26,999 కాగా, 12GB + 256GB వేరియంట్ ధర రూ.32,999 గా ఉంది.
![]()
4. వివో T5x 5G
రూ.20 వేల బడ్జెట్ ఆసుపాసులో ఉండి, అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్లలో వివో T5x 5G ముందంజలో ఉంది. ఇందులో 6.76-ఇంచుల ఫుల్-హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఇచ్చారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఆరిజిన్ ఓఎస్ 6 తో వస్తుంది.
కెమెరా & బ్యాటరీ: వెనుక 50MP సోనీ IMX852 మెయిన్ కెమెరా, ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీనిలో 7,200mAh బ్యాటరీ, 44W వైర్డ్ ఛార్జింగ్ ఇచ్చారు. IP68/IP69 రేటింగ్‌తో ఈ ఫోన్ వస్తుంది.
ధర: దీని బేస్ వేరియంట్ (6GB + 128GB) కేవలం రూ.18,999 లకే లభిస్తుంది. 8GB + 256GB వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది.
5. రియల్‌మి P4 పవర్
ఫోన్ ఛార్జింగ్ టెన్షన్ అస్సలు వద్దు అనుకునే వారి కోసం రియల్‌మి P4 పవర్ ఒక బ్రహ్మాండమైన ఫోన్. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనిలో ఉన్న 10,001mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 27W రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6.8-ఇంచుల 1.5K డిస్‌ప్లే (144Hz రిఫ్రెష్ రేట్, 6,500 నిట్స్ బ్రైట్‌నెస్) ఉంది. ఇది 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆల్ట్రా చిప్‌సెట్‌తో వస్తుంది.
కెమెరా: వెనుక 50MP సోనీ IMX882 కెమెరా + 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ముందు 16MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.
ధర: దీని 8GB + 128GB మోడల్ ధర రూ.25,999 కాగా, హై ఎండ్ వేరియంట్ (12GB + 256GB) ధర రూ.30,999 గా ఉంది.
![]()
The Realme P4 Power 5G is equipped with a 4nm octa-core MediaTek Dimensity 7400 Ultra SoC. The handset carries up to 12GB of LPDDR4x RAM and up to 256GB of UFS 3.1 onboard storage. The rear camera setup includes a 50-megapixel Sony IMX882 main sensor and an 8-megapixel ultrawide shooter. For selfies and video chats, there is a 16-megapixel front-facing camera. It has IP66 + IP68 + IP69 ratings for dust and water resistance.
The 8GB RAM + 128GB storage model of Realme P4 Power is sold for Rs. 25,999 in India. The 8GB + 256GB and 12GB + 256GB RAM and storage models are priced at Rs. 27,999 and Rs. 30,999, respectively. The Realme phone is available in TransOrange, TransSilver, and TransBlue colours.
ప్రకటన
ప్రకటన
Lenovo Legion 5 15IAX11 With 15.3-Inch OLED Display, Up to Intel Core Ultra 9 CPU Listed Online