Realme 16T 5G : కింద పడినా పగలదు.. నీళ్లలో వేసినా పాడవ్వదు.. రియల్ మీ నుంచి అదిరిపోయే ఫోన్

చీకట్లో కూడా ముఖం స్పష్టంగా కనిపించేలా ఇందులో AI పోర్ట్రెయిట్ గ్లో ఫీచర్‌ను ఇచ్చారు.

Realme 16T 5G : కింద పడినా పగలదు.. నీళ్లలో వేసినా పాడవ్వదు.. రియల్ మీ నుంచి అదిరిపోయే ఫోన్

Photo Credit: Realme

Realme 16T 5G is claimed to meet IP69 Pro dust and splash resistance rating

ముఖ్యాంశాలు
  • రియల్‌మి 16T 5G ఫోన్‌ను మే 22న ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతోంది
  • ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వెబ్‌సైట్లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో లభ్యం
  • 144Hz రిఫ్రెష్ రేట్ గల స్క్రీన్, ఏకంగా 2,100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అంది
ప్రకటన

 Realme 16T 5G : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి, భారత మొబైల్ ప్రియుల కోసం మరో అద్భుతాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమైంది. తన పాపులర్ 16 సిరీస్‌లో సరికొత్త రియల్‌మి 16T 5G ఫోన్‌ను మే 22న ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతోంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ యొక్క కెమెరా ఫీచర్లు, అదిరిపోయే బ్యాటరీ లైఫ్, డిస్‌ప్లే వివరాలను కంపెనీ అధికారికంగా లీక్ చేసింది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి అధికారిక వెబ్‌సైట్లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ విక్రయానికి రానుంది. ధర, సేల్స్ వివరాలు ఈ వారంలోనే తేలనున్నాయి.

సోనీ 50ఎంపీ కెమెరా.. వెనకాల సెల్ఫీ మిర్రర్ మ్యాజిక్ 
ఈ ఫోన్‌లో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం 50-మెగాపిక్సెల్ సోనీ IMX852 సెన్సార్ ను అమర్చారు. ఇది లుమాకలర్ ఇమేజ్ ఇంజన్ సహాయంతో పనిచేస్తుంది, దీనివల్ల ఫొటోల్లో స్కిన్ టోన్, బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ చాలా రియలిస్టిక్‌గా వస్తాయి. చీకట్లో కూడా ముఖం స్పష్టంగా కనిపించేలా ఇందులో AI పోర్ట్రెయిట్ గ్లో ఫీచర్‌ను ఇచ్చారు. అన్నింటికంటే క్రేజీ ఫీచర్ ఏంటంటే.. ఈ ఫోన్ వెనుక భాగంలో సెల్ఫీ మిర్రర్ ఉంటుంది. దీని ద్వారా యూజర్లు వెనుక వైపు ఉన్న మెయిన్ కెమెరాతోనే తమ ముఖాన్ని చూసుకుంటూ హై-క్వాలిటీ సెల్ఫీలు దిగొచ్చు. కేవలం 10 సెకన్లలో ఫొటోలను షార్ట్ వీడియోలుగా మార్చే AI ఇన్‌స్టంట్ క్లిప్ టూల్ కూడా ఇందులో ఉంది.

144Hz డిస్‌ప్లే.. ఐపీ69 ప్రో రేటింగ్‌తో మిలిటరీ గ్రేడ్ రక్షణ 
డిస్‌ప్లే పరంగా ఈ ఫోన్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ గల స్క్రీన్, ఏకంగా 2,100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించారు. అంటే ఎండలో వెళ్లినా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ధ్వని కోసం ఇందులో 400 శాతం ఆల్ట్రా వాల్యూమ్ మోడ్ ఇచ్చారు. ఇక ఫోన్ గట్టిదనం విషయానికి వస్తే, దీనికి IP69 Pro రేటింగ్ ఇచ్చారు. అంటే నీళ్లలో పడినా, పూర్తిగా దూళిలో ఉన్నా ఫోన్‌కు ఏమీ కాదు. పైగా ఇది మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తోంది, కాబట్టి కింద పడినా పగిలిపోయే ఛాన్స్ చాలా తక్కువ.

8,000mAh బ్యాటరీ బాహుబలి.. ఏడేళ్ల పాటు హెల్తీ పర్ఫార్మెన్స్ 
ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దీనిలో ఉన్న 8,000mAh భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల పాటు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ ఏకంగా 7 సంవత్సరాల పాటు ఎలాంటి కంప్లైంట్ లేకుండా సూపర్ హెల్త్‌తో పనిచేస్తుందని, అలాగే ఫోన్ 6 ఏళ్ల పాటు సరికొత్త ఫోన్ లాగే స్మూత్‌గా రన్ అవుతుందని రియల్‌మి గ్యారెంటీ ఇస్తోంది.

పవర్‌ఫుల్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్.. 
గీక్‌బెంచ్ లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవ్వనుంది. ఇందులో కనీసం 8GB ర్యామ్ ఉండబోతోంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానున్న ఈ హ్యాండ్‌సెట్ స్టార్‌లైట్ బ్లాక్, స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌లైట్ రెడ్ అనే మూడు అదిరిపోయే రంగుల్లో లభించనుంది. తక్కువ బడ్జెట్‌లో కొండంత బ్యాటరీ, మిలిటరీ రక్షణ కోరుకునే వారికి ఇది పక్కా ఛాయిస్.

#తాజా కథనాలు
  1. Samsung : శాంసంగ్ నుంచి ఒకేసారి రెండు అదిరిపోయే 5G ఫోన్లు..లీకైన ధర, ఫీచర్లు!
  2. WhatsApp : వాట్సాప్‌లో మైండ్ బ్లోయింగ్ ప్రైవసీ ఫీచర్.. మెసేజ్ చదవగానే మాయం
  3. Subnautica 2 : కేవలం 12 గంటల్లోనే 20 లక్షల సేల్స్‌తో గేమింగ్ ప్రపంచాన్ని వణకిస్తున్న సబ్‌నాటికా 2
  4. ChatGPT : చాట్‌జీపీటీ కొత్త రికార్డు.. నెల రోజుల్లోనే 100 కోట్ల ఫొటోలు జనరేట్ చేసిన భారతీయులు
  5. Realme 16T 5G : కింద పడినా పగలదు.. నీళ్లలో వేసినా పాడవ్వదు.. రియల్ మీ నుంచి అదిరిపోయే ఫోన్
  6. Smartphones : మీ బడ్జెట్ రూ.30 వేలా? మార్కెట్లోకి వచ్చిన 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
  7. Earbuds : మ్యూజిక్ లవర్స్‌కు పండగే.. రూ.5,000 లోపు అదిరిపోయే ఫీచర్లున్న టాప్-5 ఇయర్‌బడ్స్ ఇవే
  8. Motorola : మార్కెట్లోకి మోటోరోలా కొత్త 5G స్మార్ట్‌ఫోన్లు.. 7,000mAh బ్యాటరీతో Moto G37 Power లాంచ్
  9. Motorola : బడ్జెట్లో ధర.. 48 గంటల బ్యాటరీ లైఫ్.. మార్కెట్లోకి మోటోరోలా సరికొత్త ఇయర్‌బడ్స్
  10. Tech Layoffs : మార్క్ జుకర్‌బర్గ్ షాకింగ్ నిర్ణయం.. మెటాలో 8,000 మంది ఉద్యోగులపై వేటు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »