ChatGPT : చాట్‌జీపీటీ కొత్త రికార్డు.. నెల రోజుల్లోనే 100 కోట్ల ఫొటోలు జనరేట్ చేసిన భారతీయులు

చాట్‌జీపీటీలో ఇటీవల ప్రవేశపెట్టిన చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 ఫీచర్‌కు మన దేశంలో విపరీతమైన క్రేజ్ లభించింది.

ChatGPT : చాట్‌జీపీటీ కొత్త రికార్డు.. నెల రోజుల్లోనే 100 కోట్ల ఫొటోలు జనరేట్ చేసిన భారతీయులు

Photo Credit: OpenAI

The top trends for Indian ChatGPT users were Mini me world, Cinematic portrait, and Chibi sticker pack

ముఖ్యాంశాలు
  • చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 ఫీచర్‌కు మన దేశంలో విపరీతమైన క్రేజ్ లభించింది.
  • నెల రోజులు కూడా గడవకముందే భారతీయులు 100కోట్లకు పైగా ఫోటోలు క్రియేట్
  • 2.0 వెర్షన్ మరింత స్పష్టమైన, హై-క్వాలిటీ చిత్రాలను అందిస్తోంది.
ప్రకటన

ChatGPT : ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  సంస్థ ఓపెన్ఏఐ, భారత మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. చాట్‌జీపీటీలో ఇటీవల ప్రవేశపెట్టిన  చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 ఫీచర్‌కు మన దేశంలో విపరీతమైన క్రేజ్ లభించింది. ఏప్రిల్ 21న ఈ ఫీచర్ లాంచ్ అవ్వగా.. కేవలం నెల రోజులు కూడా గడవకముందే భారతీయ యూజర్లు ఈ ఏఐ టూల్ సహాయంతో ఏకంగా 100 కోట్లకు పైగా అద్భుతమైన చిత్రాలను సృష్టించారు. గూగుల్ నానో బనానా మోడల్స్‌కు గట్టి పోటీనిస్తూ చాట్‌జీపీటీ ఇమేజ్ టూల్ దూసుకుపోతోంది.

ఈ అసాధారణ మైలురాయిపై ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ స్పందిస్తూ.. "భారతదేశంలో అప్పుడే 100 కోట్లకు పైగా ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి.. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది" అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను అత్యధికంగా వాడుతున్న దేశాల్లో భారతదేశమే మొదటి స్థానంలో ఉందని ఓపెన్ఏఐ ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. పాత వెర్షన్‌తో పోలిస్తే ఈ సరికొత్త ఇమేజెస్ 2.0 వెర్షన్ మరింత స్పష్టమైన, హై-క్వాలిటీ చిత్రాలను అందిస్తోంది.

భారతీయ యూజర్లు ఎక్కువగా ఇష్టపడిన కొన్ని క్రేజీ ప్రాంప్ట్స్ వివరాలను కూడా కంపెనీ షేర్ చేసింది. ఇందులో ముఖ్యంగా సాంప్రదాయ భారతీయ దుస్తులు, స్టూడియో లైటింగ్‌తో కూడిన సినీమ్యాటిక్ పోర్ట్రెయిట్ కొలాజ్ ట్రెండ్ సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే యూజర్ల నిజమైన చుట్టుపక్కల వాతావరణంలో వారిని త్రీడీ యానిమేషన్ క్యారెక్టర్లుగా మార్చే  మినీ మీ వరల్డ్ ఫీచర్‌ను కూడా లక్షలాది మంది వాడేశారు. ఇవే కాకుండా ఫొటోలలో లైటింగ్ సరిచేయడం, పాత ఫొటోలను కొత్తగా మార్చడం, ఆనిమే, మంగా కామిక్స్ స్ట్రిప్స్ క్రియేట్ చేయడం వంటి వాటి కోసం భారతీయులు చాట్‌జీపీటీని తెగ వాడేస్తున్నారు.

ఈ కొత్త చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 మోడల్‌లో ఓపెన్ఏఐ అనేక సాంకేతిక మార్పులను చేసింది. గతంలో ఏఐ ఇమేజ్ జనరేటర్లు ఫొటోలపై అక్షరాలను సరిగ్గా ప్రింట్ చేయలేకపోయేవి. కానీ ఈ కొత్త వెర్షన్ చిత్రాలలో టెక్స్ట్‌ను వంద శాతం ఖచ్చితత్వంతో డిజైన్ చేయగలదు. యూజర్లు ఎంత పెద్ద ప్రాంప్ట్ ఇచ్చినప్పటికీ, అందులోని ప్రతి లేయర్‌ను అర్థం చేసుకుని ఫొటోను సృష్టిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సరికొత్త ఏఐ మోడల్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, బెంగాలీ, చైనీస్,  జపనీస్ వంటి అనేక ప్రాంతీయ భాషల వాయిస్ లేదా టెక్స్ట్ కమాండ్స్ సపోర్ట్‌తో పనిచేస్తుంది.

#తాజా కథనాలు
  1. Samsung : శాంసంగ్ నుంచి ఒకేసారి రెండు అదిరిపోయే 5G ఫోన్లు..లీకైన ధర, ఫీచర్లు!
  2. WhatsApp : వాట్సాప్‌లో మైండ్ బ్లోయింగ్ ప్రైవసీ ఫీచర్.. మెసేజ్ చదవగానే మాయం
  3. Subnautica 2 : కేవలం 12 గంటల్లోనే 20 లక్షల సేల్స్‌తో గేమింగ్ ప్రపంచాన్ని వణకిస్తున్న సబ్‌నాటికా 2
  4. ChatGPT : చాట్‌జీపీటీ కొత్త రికార్డు.. నెల రోజుల్లోనే 100 కోట్ల ఫొటోలు జనరేట్ చేసిన భారతీయులు
  5. Realme 16T 5G : కింద పడినా పగలదు.. నీళ్లలో వేసినా పాడవ్వదు.. రియల్ మీ నుంచి అదిరిపోయే ఫోన్
  6. Smartphones : మీ బడ్జెట్ రూ.30 వేలా? మార్కెట్లోకి వచ్చిన 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
  7. Earbuds : మ్యూజిక్ లవర్స్‌కు పండగే.. రూ.5,000 లోపు అదిరిపోయే ఫీచర్లున్న టాప్-5 ఇయర్‌బడ్స్ ఇవే
  8. Motorola : మార్కెట్లోకి మోటోరోలా కొత్త 5G స్మార్ట్‌ఫోన్లు.. 7,000mAh బ్యాటరీతో Moto G37 Power లాంచ్
  9. Motorola : బడ్జెట్లో ధర.. 48 గంటల బ్యాటరీ లైఫ్.. మార్కెట్లోకి మోటోరోలా సరికొత్త ఇయర్‌బడ్స్
  10. Tech Layoffs : మార్క్ జుకర్‌బర్గ్ షాకింగ్ నిర్ణయం.. మెటాలో 8,000 మంది ఉద్యోగులపై వేటు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »