మోటో జీ37, మోటో జీ37 పవర్ పేర్లతో జీ-సిరీస్ లైనప్‌లో వీటిని మంగళవారం లాంచ్ చేశారు.
Photo Credit: Motorola
The Moto G37 (left) and Moto G37 Power (right)
Motorola : బడ్జెట్ ధరలో మొబైల్స్ కొనే కస్టమర్లను టార్గెట్ చేస్తూ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్ మోటోరోలా భారత మార్కెట్లోకి రెండు సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. మోటో జీ37, మోటో జీ37 పవర్ పేర్లతో జీ-సిరీస్ లైనప్‌లో వీటిని మంగళవారం లాంచ్ చేశారు. ఎంట్రీ లెవల్ ధరలోనే సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్, పవర్‌ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ బ్యాకప్‌తో వచ్చిన ఈ మొబైల్స్ పూర్తి వివరాలు, బ్యాంక్ ఆఫర్లు ఇప్పుడు చూద్దాం.
రూ.14 వేల లోపే స్టార్టింగ్.. లాంచ్ ఆఫర్ల మోత
ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ల ధరలు వేరియంట్లను బట్టి ఈ కింది విధంగా ఉన్నాయి:
* Moto G37 (4GB RAM + 64GB స్టోరేజ్): దీని ఎఫెక్టివ్ లాంచ్ ధర రూ.13,999 గా ఉంది. ఇది పాంటోన్ కాప్రి, పాంటోన్ ఇంపెనెట్రబుల్ కలర్స్‌లో లభిస్తుంది.
* Moto G37 Power (4GB RAM + 128GB స్టోరేజ్): దీని ధర రూ.15,999.
* Moto G37 Power (8GB RAM + 128GB స్టోరేజ్): దీని ధర రూ.18,999. ఇవి పై రెండు కలర్స్‌తో పాటు అదనంగా 'పాంటోన్ నాటికల్ బ్లూ' రంగులోనూ లభిస్తాయి.
బ్యాంక్ ఆఫర్లు: లాంచ్ ఆఫర్ కింద ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే ఏకంగా రూ.5,500 తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఈ రెండు ఫోన్ల సేల్ మే 25, 2026 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో ప్రారంభం కానుంది.
డిస్‌ప్లే అద్భుతం.. ఆర్మీ గ్రేడ్ ప్రొటెక్షన్
ఫీచర్ల విషయానికి వస్తే, ఈ రెండు మోడల్స్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో పనిచేస్తాయి. ఇవి 6.6 ఇంచుల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం లేటెస్ట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని అందించారు. అంతేకాకుండా, ఇవి కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకునేలా MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్, ధూళి, నీటి తుంపరల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ తో వస్తున్నాయి.
మీడియాటెక్ ప్రాసెసర్.. 12GB వరకు ర్యామ్ బూస్ట్!
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది వేగవంతమైన 5G పర్ఫార్మెన్స్‌ను, స్మూత్ మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది. ఇందులో ఉండే RAM Boost ఫీచర్ ద్వారా ఫోన్ ర్యామ్‌ను వర్చువల్‌గా 12GB వరకు పెంచుకోవచ్చు. అలాగే మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకునే సదుపాయం ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు.
50MP ఏఐ కెమెరా.. జూమ్ అదరహో
ఫోటోగ్రఫీ కోసం ఈ రెండు హ్యాండ్‌సెట్లలో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో f/1.8 అపెర్చర్ కలిగిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (PDAF సపోర్ట్‌తో) ఉంది. దీనికి తోడు 2-ఇన్-1 లైట్ సెన్సార్ (ఆంబియంట్ లైట్, ఫ్లికర్ డిటెక్టర్) ఉంది. ఇది తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలను ఇస్తుంది. అలాగే గూగుల్ AI ఫీచర్లయిన మ్యాజిక్ ఎరేజర్, ఫోటో అన్‌బ్లర్ వంటివి కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.
3 రోజుల పాటు నాన్‌స్టాప్ పవర్
బ్యాటరీ విభాగంలో ఈ రెండు ఫోన్ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఉంది. బేసిక్ మోడల్ అయిన Moto G37 లో 5,200mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కాగా, ప్రీమియం మోడల్ అయిన Moto G37 Power లో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 3 రోజుల పాటు (62 గంటలు) నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఇది 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా 6W సామర్థ్యంతో రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. అంటే ఈ ఫోన్ల ద్వారా మీరు ఇతర చిన్న గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన