ఈ సరికొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటాతో పాటు ఐఫోన్ (iOS) బీటా వెర్షన్ 26.19.10.72 వాడుతున్న కొంతమంది టెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది
Photo Credit: WhatsApp
The feature was previously spotted in beta versions of WhatsApp for Android
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్, తన యూజర్ల చాటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ప్రైవేట్‌గా మార్చడానికి ఒక సూపర్ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఇప్పటివరకు వాట్సాప్‌లో ఉన్న డిసప్పియరింగ్ మెసేజ్ ఫీచర్.. మనం మెసేజ్ పంపిన సమయం ఆధారంగా మాత్రమే డిలీట్ అయ్యేది. కానీ, ఇప్పుడు సరికొత్తగా ఆఫ్టర్ రీడింగ్ అనే సరికొత్త ప్రైవసీ టైమర్‌ను వాట్సాప్ పరిచయం చేస్తోంది. దీని ద్వారా అవతలి వ్యక్తి మనం పంపిన మెసేజ్‌ను ఓపెన్ చేసి చదివిన తర్వాతే కౌంట్‌డౌన్ స్టార్ట్ అయి మెసేజ్ డిలీట్ అవుతుంది.
ఐఫోన్, ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు లభ్యం
ప్రముఖ వాట్సాప్ అప్‌డేట్స్ ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం.. ఈ సరికొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటాతో పాటు ఐఫోన్ (iOS) బీటా వెర్షన్ 26.19.10.72 వాడుతున్న కొంతమంది టెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. ఆపిల్ టెస్ట్‌ఫ్లైట్ ప్రోగ్రామ్ ద్వారా ఐఓఎస్ యూజర్లు దీన్ని చెక్ చేయవచ్చు. త్వరలోనే సాధారణ యాప్ స్టోర్ యూజర్లకు కూడా ఇది రోల్ అవుట్ కానుంది.
ఎలా పనిచేస్తుంది ఈ ఆఫ్టర్ రీడింగ్ మ్యాజిక్?
ప్రస్తుతం వాట్సాప్‌లో మెసేజ్ పంపిన తర్వాత 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజులకు డిలీట్ అయ్యే ఆప్షన్లు ఉన్నాయి. అయితే కొత్తగా రాబోతున్న ఆఫ్టర్ రీడింగ్ ఫీచర్‌లో యూజర్లు మూడు రకాల టైమర్లను సెట్ చేసుకోవచ్చు:
* 5 నిమిషాలు (5 Minutes)
* 1 గంట (1 Hour)
* 12 గంటలు (12 Hours)
![]()
ఉదాహరణకు: మీరు ఒక మెసేజ్‌ను 5 నిమిషాల ఆఫ్టర్ రీడింగ్ టైమర్‌తో పంపారనుకుందాం. అవతలి వ్యక్తి ఆ మెసేజ్‌ను ఎన్ని గంటల తర్వాత ఓపెన్ చేసినా.. వారు ఓపెన్ చేసిన నిమిషం నుండి సరిగ్గా 5 నిమిషాల కౌంట్‌డౌన్ స్టార్ట్ అయి చాట్ నుంచి ఆ మెసేజ్ మాయమైపోతుంది. ఒకవేళ అవతలి వ్యక్తి 24 గంటల వరకు ఆ మెసేజ్‌ను అస్సలు ఓపెన్ చేయకపోతే.. ప్రైవసీ భద్రత కోసం వాట్సాప్ ఆ అన్‌రీడ్ మెసేజ్‌ను 24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ చేసేస్తుంది.
సెలెక్టెడ్ చాట్స్‌కు మాత్రమే..
ఈ సరికొత్త ఫీచర్ పూర్తిగా ఐచ్ఛికం. అంటే యూజర్లు తమకు నచ్చిన నిర్దిష్ట చాట్స్‌కు మాత్రమే దీన్ని మ్యాన్యువల్‌గా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్ చేయనంత వరకు పాత పద్ధతిలోనే మెసేజ్‌లు ఉంటాయి. పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, సీక్రెట్ అడ్రస్‌లు లేదా పర్సనల్ విషయాలను షేర్ చేసుకునే వారికి ఈ ఫీచర్ ఒక కవచంలా పనిచేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ ఫీచర్ రాబోయే కొద్ది వారాల్లో యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Samsung Gallery Adds Google Photos Integration Ahead of OneDrive Sync Ending: How It Works
BenQ Showcases New iScreenBar and ScreenBar Max Desk Lighting Systems at InfoComm 2026