Subnautica 2 : కేవలం 12 గంటల్లోనే 20 లక్షల సేల్స్‌తో గేమింగ్ ప్రపంచాన్ని వణకిస్తున్న సబ్‌నాటికా 2

Subnautica 2 launched in early access on PC and Xbox Series S/X on May 14.

Subnautica 2 : కేవలం 12 గంటల్లోనే  20 లక్షల సేల్స్‌తో గేమింగ్ ప్రపంచాన్ని వణకిస్తున్న సబ్‌నాటికా 2

Photo Credit: Unknown Worlds

Subnautica 2 is now available in early access

ముఖ్యాంశాలు
  • అండర్ వాటర్ సర్వైవల్ గేమ్ సబ్‌నాటికా 2 మార్కెట్లోకి తుఫాన్ లా వచ్చింది
  • కేవలం 12 గంటల వ్యవధిలోనే ఏకంగా 20 లక్షల (2 Million) కాపీలు సేల్
  • మొదటి సబ్‌నాటికా గేమ్ సాధించిన రికార్డుల కంటే ఇది దాదాపు 9 రెట్లు ఎక్కువ
ప్రకటన

Subnautica 2 : ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రసిద్ధ అండర్ వాటర్ సర్వైవల్ గేమ్ సబ్‌నాటికా 2 మార్కెట్లోకి తుఫాన్ లా దూసుకొచ్చింది. అనేక న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసులను దాటుకుని మే 14న పిసి, ఎక్స్‌బాక్స్ (Xbox Series S/X) ప్లాట్‌ఫారమ్‌లపై ఈ గేమ్  ఎర్లీ యాక్సెస్ లో విడుదలైంది. రిలీజ్ అయిన కేవలం 12 గంటల వ్యవధిలోనే ఏకంగా 20 లక్షల (2 Million) కాపీలు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించినట్లు గేమ్ డెవలపర్ 'అన్‌నోన్ వరల్డ్స్ ఎంటర్‌టైన్‌మెంట్' అధికారికంగా ప్రకటించింది.

రూ.2100 కోట్ల బోనస్ వివాదం..  
ఈ గేమ్ ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం వెనుక ఒక పెద్ద లీగల్ డ్రామానే ఉంది. ఈ గేమ్‌ను డెవలప్ చేసిన అన్‌నోన్ వరల్డ్స్ కంపెనీకి, దాని మాతృ సంస్థ (పబ్లిషర్) క్రాఫ్టన్ కు మధ్య గత కొంతకాలంగా తీవ్ర వివాదం నడుస్తోంది. 2025 ముగిసేలోపు డెవలప్‌మెంట్ టీమ్ కొన్ని టార్గెట్లను రీచ్ అయితే క్రాఫ్టన్ సంస్థ వారికి $250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2100 కోట్లు) బోనస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బోనస్ ఇవ్వడం ఇష్టం లేక క్రాఫ్టన్ యాజమాన్యం తెలివిగా గేమ్‌ను ఆలస్యం చేయడమే కాకుండా, అన్‌నోన్ వరల్డ్స్ సీఈఓ టెడ్ గిల్‌తో పాటు సహ వ్యవస్థాపకులను కంపెనీ నుండి తొలగించింది. దీనిపై మాజీ మేనేజ్‌మెంట్ కోర్టుకెళ్లగా.. జడ్జి క్రాఫ్టన్ చర్యలను తప్పుబడుతూ టెడ్ గిల్‌ను తిరిగి సీఈఓగా నియమించాలని సంచలన తీర్పునిచ్చారు.

స్టీమ్‌లో రికార్డు స్థాయి ప్లేయర్స్.. 
ఈ వివాదాలన్నీ గేమ్‌కు విపరీతమైన పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. ప్రముఖ గేమింగ్ ప్లాట్‌ఫారమ్  స్టీమ్‎లో విడుదలైన కొద్ది గంటల్లోనే ఒకే సమయంలో ఏకంగా 4,67,582 మంది లైవ్ ప్లేయర్స్ ఈ గేమ్‌ను ఆడుతూ కనిపించారు. అన్ని ప్లాట్‌ఫారమ్‌లు కలిపితే ఈ కౌంట్ 6.5 లక్షలు దాటిపోయింది. 2018లో వచ్చిన మొదటి సబ్‌నాటికా గేమ్ సాధించిన రికార్డుల కంటే ఇది దాదాపు 9 రెట్లు ఎక్కువ కావడం విశేషం. అన్‌రియల్ ఇంజన్ 5 టెక్నాలజీతో, ఫోర్-ప్లేయర్ కో-ఆప్  ఆప్షన్‌తో వచ్చిన ఈ ఓషియానిక్ అడ్వెంచర్ గేమ్ గేమర్లను ఎంతగానో అలరిస్తోంది.

#తాజా కథనాలు
  1. Samsung : శాంసంగ్ నుంచి ఒకేసారి రెండు అదిరిపోయే 5G ఫోన్లు..లీకైన ధర, ఫీచర్లు!
  2. WhatsApp : వాట్సాప్‌లో మైండ్ బ్లోయింగ్ ప్రైవసీ ఫీచర్.. మెసేజ్ చదవగానే మాయం
  3. Subnautica 2 : కేవలం 12 గంటల్లోనే 20 లక్షల సేల్స్‌తో గేమింగ్ ప్రపంచాన్ని వణకిస్తున్న సబ్‌నాటికా 2
  4. ChatGPT : చాట్‌జీపీటీ కొత్త రికార్డు.. నెల రోజుల్లోనే 100 కోట్ల ఫొటోలు జనరేట్ చేసిన భారతీయులు
  5. Realme 16T 5G : కింద పడినా పగలదు.. నీళ్లలో వేసినా పాడవ్వదు.. రియల్ మీ నుంచి అదిరిపోయే ఫోన్
  6. Smartphones : మీ బడ్జెట్ రూ.30 వేలా? మార్కెట్లోకి వచ్చిన 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
  7. Earbuds : మ్యూజిక్ లవర్స్‌కు పండగే.. రూ.5,000 లోపు అదిరిపోయే ఫీచర్లున్న టాప్-5 ఇయర్‌బడ్స్ ఇవే
  8. Motorola : మార్కెట్లోకి మోటోరోలా కొత్త 5G స్మార్ట్‌ఫోన్లు.. 7,000mAh బ్యాటరీతో Moto G37 Power లాంచ్
  9. Motorola : బడ్జెట్లో ధర.. 48 గంటల బ్యాటరీ లైఫ్.. మార్కెట్లోకి మోటోరోలా సరికొత్త ఇయర్‌బడ్స్
  10. Tech Layoffs : మార్క్ జుకర్‌బర్గ్ షాకింగ్ నిర్ణయం.. మెటాలో 8,000 మంది ఉద్యోగులపై వేటు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »