Samsung : శాంసంగ్ నుంచి ఒకేసారి రెండు అదిరిపోయే 5G ఫోన్లు..లీకైన ధర, ఫీచర్లు!

శాంసంగ్ కంపెనీకి చెందిన రెండు కొత్త హ్యాండ్‌సెట్లు బీఐఎస్ వెబ్‌సైట్‌లో SM-M476B/DS, SM-E476B/DS అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యాయి.

Samsung  : శాంసంగ్ నుంచి ఒకేసారి రెండు అదిరిపోయే 5G ఫోన్లు..లీకైన ధర, ఫీచర్లు!

Photo Credit: Samsung

Samsung Galaxy M47 could succeed the Samsung Galaxy M44 (above)

ముఖ్యాంశాలు
  • శాంసంగ్ గెలాక్సీ M47, గెలాక్సీ F70 ప్రో స్మార్ట్‌ఫోన్లు త్వరలో లాంచ్
  • బీఐఎస్ వెబ్‌సైట్‌లో SM-M476B/DS, SM-E476B/DS అనే మోడల్ నంబర్లతో లిస్ట్
  • మే 15న వీటికి బీఐఎస్ సర్టిఫికేషన్ లభించింది
ప్రకటన

Samsung  : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ , భారత మొబైల్ మార్కెట్లో మరోసారి తన జెండా పాతేందుకు సిద్ధమైంది. మిడ్-రేంజ్ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో రెండు సరికొత్త ఫోన్లను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. శాంసంగ్ అధికారికంగా ప్రకటించకముందే.. శాంసంగ్ గెలాక్సీ M47, గెలాక్సీ F70 ప్రో స్మార్ట్‌ఫోన్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఈ రెండు ఫోన్లు చాలా త్వరలోనే ఇండియాలో అడుగుపెట్టబోతున్నట్లు స్పష్టమవుతోంది.

బీఐఎస్ సైట్‌లో మోడల్ నంబర్స్ లీక్ 
శాంసంగ్ కంపెనీకి చెందిన రెండు కొత్త హ్యాండ్‌సెట్లు బీఐఎస్ వెబ్‌సైట్‌లో SM-M476B/DS, SM-E476B/DS అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యాయి. గీక్‌బెంచ్, ఐఎంఈఐ డేటాబేస్ ఆధారంగా వీటిలో మొదటి మోడల్ గెలాక్సీ M47 5G అని, రెండో మోడల్ గెలాక్సీ F70 ప్రో 5G అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ మోడల్ నంబర్ల చివరన DS అని ఉండటం చూస్తే, ఈ రెండు ఫోన్లు డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో రానున్నాయని తెలుస్తోంది. మే 15న వీటికి బీఐఎస్ సర్టిఫికేషన్ లభించింది.

bis samsung galaxy m47 Samsung Galaxy M47

Photo Credit: BIS

గెలాక్సీ M47 ఫీచర్లు ఇవే.. పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్!
ప్రముఖ టెక్ టిప్‌స్టర్ సంజూ చౌదరి అందించిన సమాచారం ప్రకారం.. గెలాక్సీ M47 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ A27 మోడల్‌ను పోలి ఉండే అవకాశం ఉంది.
డిస్‌ప్లే & ప్రాసెసర్: ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ గల 6.7-ఇంచుల ఫుల్ హెచ్‌డీ+  AMOLED స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 బేస్డ్ వన్ యూఐతో రానున్న ఈ ఫోన్‌లో కనీసం 8GB ర్యామ్ ఉంటుంది.
కెమెరా & బ్యాటరీ: వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో షూటర్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతోంది. ముందు వైపు 12MP సెల్ఫీ కెమెరాను ఇవ్వనున్నారు. ఇందులో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంటుంది.

ధర ఎంత ఉండొచ్చు? 6 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్!
ఇండియన్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M47 5G ధర దాదాపు రూ.20,000 నుంచి రూ.25,000 లోపు ఉండే అవకాశం ఉంది. అలాగే, శాంసంగ్ ఈ ఫోన్‌కు ఏకంగా 6 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఆఫర్ చేయబోతున్నట్లు టాక్. మరోవైపు, గెలాక్సీ F70 ప్రో ఫోన్ 6,000mAh భారీ బ్యాటరీ, ఎక్సినోస్ ప్రాసెసర్‌తో రూ.30 వేల బడ్జెట్ ఆసుపాసులో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని నెట్టింట లీక్స్ వినిపిస్తున్నాయి. బ్రాండెడ్ లుక్, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కోరుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్స్ కానున్నాయి.

#తాజా కథనాలు
  1. Samsung : శాంసంగ్ నుంచి ఒకేసారి రెండు అదిరిపోయే 5G ఫోన్లు..లీకైన ధర, ఫీచర్లు!
  2. WhatsApp : వాట్సాప్‌లో మైండ్ బ్లోయింగ్ ప్రైవసీ ఫీచర్.. మెసేజ్ చదవగానే మాయం
  3. Subnautica 2 : కేవలం 12 గంటల్లోనే 20 లక్షల సేల్స్‌తో గేమింగ్ ప్రపంచాన్ని వణకిస్తున్న సబ్‌నాటికా 2
  4. ChatGPT : చాట్‌జీపీటీ కొత్త రికార్డు.. నెల రోజుల్లోనే 100 కోట్ల ఫొటోలు జనరేట్ చేసిన భారతీయులు
  5. Realme 16T 5G : కింద పడినా పగలదు.. నీళ్లలో వేసినా పాడవ్వదు.. రియల్ మీ నుంచి అదిరిపోయే ఫోన్
  6. Smartphones : మీ బడ్జెట్ రూ.30 వేలా? మార్కెట్లోకి వచ్చిన 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
  7. Earbuds : మ్యూజిక్ లవర్స్‌కు పండగే.. రూ.5,000 లోపు అదిరిపోయే ఫీచర్లున్న టాప్-5 ఇయర్‌బడ్స్ ఇవే
  8. Motorola : మార్కెట్లోకి మోటోరోలా కొత్త 5G స్మార్ట్‌ఫోన్లు.. 7,000mAh బ్యాటరీతో Moto G37 Power లాంచ్
  9. Motorola : బడ్జెట్లో ధర.. 48 గంటల బ్యాటరీ లైఫ్.. మార్కెట్లోకి మోటోరోలా సరికొత్త ఇయర్‌బడ్స్
  10. Tech Layoffs : మార్క్ జుకర్‌బర్గ్ షాకింగ్ నిర్ణయం.. మెటాలో 8,000 మంది ఉద్యోగులపై వేటు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »