Motorola : బడ్జెట్లో ధర.. 48 గంటల బ్యాటరీ లైఫ్.. మార్కెట్లోకి మోటోరోలా సరికొత్త ఇయర్‌బడ్స్

భారతదేశంలో మోటో బడ్స్ 2 ధరను రూ.2,999 గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇది కేవలం లాంచ్ ఆఫర్ కింద లభించే నెట్ ఎఫెక్టివ్ ధర మాత్రమే.

Motorola : బడ్జెట్లో  ధర.. 48 గంటల బ్యాటరీ లైఫ్.. మార్కెట్లోకి మోటోరోలా సరికొత్త ఇయర్‌బడ్స్

Photo Credit: Motorola

Moto Buds 2 charging case weighs about 42g

ముఖ్యాంశాలు
  • మోటోరోలా మోటో బడ్స్ 2 ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌ రిలీజ్
  • మోటో బడ్స్ 2 ధరను రూ.2,999 గా కంపెనీ నిర్ణయించింది.
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇవి కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి.
ప్రకటన

Motorola : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా ఆడియో రంగంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకుంటూ సరికొత్త ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో బడ్స్ 2 పేరుతో మంగళవారం వీటిని అధికారికంగా లాంచ్ చేశారు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇవి కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఇయర్‌బడ్స్ ప్రీమియం లుక్ కోసం మోటోరోలా సంస్థ పాంటోన్‎తో జతకట్టి.. మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో వీటిని డిజైన్ చేసింది. అదిరిపోయే బ్యాటరీ లైఫ్, అధునాతన ఆడియో టెక్నాలజీతో తక్కువ బడ్జెట్లోనే లభించే ఈ సరికొత్త ఇయర్‌బడ్స్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

సేల్ ఎప్పటినుంచో తెలుసా?
భారతదేశంలో మోటో బడ్స్ 2 ధరను రూ.2,999 గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇది కేవలం లాంచ్ ఆఫర్ కింద లభించే నెట్ ఎఫెక్టివ్ ధర మాత్రమే. ఆఫర్ ముగిసిన తర్వాత వీటి అసలు రిటైల్ ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఇయర్‌బడ్స్ సేల్ మే 25, 2026 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లలో ప్రారంభం కానుంది. ఇవి పాంటోన్ కార్బన్, పాంటోన్ గ్రే మిస్ట్, పాంటోన్ వయొలెట్ ఐస్ అనే మూడు ట్రెండీ కలర్స్‌లో లభిస్తాయి.

డ్యూయల్ డ్రైవర్స్, 55dB నాయిస్ క్యాన్సిలేషన్ 
సౌండ్ క్వాలిటీ విషయంలో మోటోరోలా ఎక్కడా రాజీ పడలేదు. ఈ మోటో బడ్స్ 2 లో 11mm డైనమిక్ డ్రైవర్లు, 6mm మైక్రో ప్లానార్ మాగ్నెటిక్ డ్రైవర్లతో కూడిన డ్యూయల్ డ్రైవర్ సెటప్‌ను అందించారు. ఇది బేస్‎ను మరింత లోతుగా, వోకల్స్ స్పష్టంగా వినబడేలా చేస్తుంది. వీటికి తోడు హై-రెస్ ఆడియో, ఎల్‌హెచ్‌డీసీ  , ఎల్‌డీఏసీ ఆడియో కోడెక్స్, 360-డిగ్రీల స్పాషియల్ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల మ్యూజిక్ థియేటర్ ఎఫెక్ట్ ఇస్తుంది.

అంతేకాకుండా, ఇందులో 55dB వరకు డైనమిక్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్  ఫీచర్ ఉంది. ఇది చుట్టుపక్కల ఉండే ట్రాఫిక్ లేదా హోరు శబ్దాలను పూర్తిగా అణచివేస్తుంది. అలాగే ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ డిస్ట్రబెన్స్ లేకుండా ఉండటానికి ఇరువైపులా కలిపి మొత్తం 6 మైక్రోఫోన్లు, మోటో క్రిస్టల్‌టాక్ AI సాంకేతికతను జోడించారు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 48 గంటల నాన్‌స్టాప్ బ్యాకప్ 
బ్యాటరీ పరంగా ఈ ఇయర్‌బడ్స్ లాంగ్ లాస్టింగ్ పవర్‌ను ఇస్తాయి. ప్రతి ఇయర్‌బడ్‌లోనూ 62mAh బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 11 గంటల పాటు నిరంతరాయంగా ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. ఇక 520mAh సామర్థ్యం గల ఛార్జింగ్ కేస్‌తో కలిపి వాడుకుంటే ఏకంగా 48 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. పైగా ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, 3 గంటల పాటు పాటలు వినొచ్చు.

బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. స్మార్ట్ ఫీచర్లు ఎన్నో!
ఈ సరికొత్త ఇయర్‌బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ 6.0 వెర్షన్‌తో వస్తున్నాయి. దీనివల్ల కనెక్టివిటీ చాలా వేగంగా ఉంటుంది. ఇందులో డ్యూయల్ కనెక్షన్, ఆటో స్విచ్చింగ్ ఫీచర్లు ఉన్నాయి. అంటే ఒకే సమయంలో ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసి.. అవసరాన్ని బట్టి ఎటువంటి మాన్యువల్ స్విచ్చింగ్ లేకుండా వాడుకోవచ్చు. ఇయర్‌బడ్స్ చెవిలో నుంచి తీయగానే మ్యూజిక్ ఆగిపోయే స్మార్ట్ వేర్ డిటెక్షన్ కూడా ఉంది. ధూళి, నీటి తుంపరల నుంచి రక్షణ కోసం ఇవి IP54 రేటింగ్ ను కలిగి ఉన్నాయి. మోటో స్మార్ట్‌ఫోన్లతో వాడేటప్పుడు ఇందులో ప్రత్యేక Moto AI వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా లభిస్తుంది.

#తాజా కథనాలు
  1. Motorola : మార్కెట్లోకి మోటోరోలా కొత్త 5G స్మార్ట్‌ఫోన్లు.. 7,000mAh బ్యాటరీతో Moto G37 Power లాంచ్
  2. Motorola : బడ్జెట్లో ధర.. 48 గంటల బ్యాటరీ లైఫ్.. మార్కెట్లోకి మోటోరోలా సరికొత్త ఇయర్‌బడ్స్
  3. Tech Layoffs : మార్క్ జుకర్‌బర్గ్ షాకింగ్ నిర్ణయం.. మెటాలో 8,000 మంది ఉద్యోగులపై వేటు
  4. EPFO : ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. బాస్ సంతకం లేకుండానే పీఎఫ్ డబ్బులు మీ అకౌంట్‌లోకి.. ఎలాగో తెలుసా?
  5. Smartphone Price : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రియల్‌మీ, వన్‌ప్లస్, పోకో ఫోన్ల ధరలు భారీగా పెంపు
  6. Amazon : మీ నార్మల్ టీవీ కూడా సూపర్ స్మార్ట్ అయిపోద్ది.. అమెజాన్ సరికొత్త ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ లాంచ్
  7. YouTube : యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. మీ ఫేస్‌తో డీప్‌ఫేక్ వీడియోలు చేస్తే ఇక దొరికేట్లే
  8. ChatGPT : చాట్ జీపీటీలో సరికొత్త విప్లవం.. ఇక మీ అకౌంట్లోని పైసా పైసా లెక్క చెప్పే చెప్పేస్తుంది
  9. Motorola Edge 70 Pro+ : మోటో నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్.. అదిరిపోయే కెమెరా, లగ్జరీ లుక్స్
  10. Aadhaar : ఆధార్ కొత్త యాప్ వచ్చేసింది.. ఫేస్ లాక్, క్యూఆర్ షేరింగ్ వంటి అదిరిపోయే ఫీచర్లు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »