Photo Credit: CMF
CMF ఫోన్ 2 ప్రో బాక్స్‌లో ఛార్జర్‌తో వస్తుంది
ఏప్రిల్ 28న CMF ఫోన్ 2 ప్రో మోడల్ విడుదల కానున్నట్లు తెలిసిందే. ఇప్పటికే కంపెనీ ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే, లాంఛ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రాసెసర్ వివరాలను కంపెనీ వెల్లడించింది. కొత్త CMF ఫోన్ 2 ప్రో మోడల్ కూడా గత సంవత్సరం మార్కెట్‌లోకి వచ్చిన CMF ఫోన్ 1 మాదిరిగానే మిడియాటెక్ ప్రాసెసర్‌తో రానుంది. అయితే, కంపెనీ చెబుతున్నదానిని బట్టీ.. CMF ఫోన్ 1 తో చూస్తే, రాబోయే కొత్త ఫోన్ సీపీయూ స్పీడ్ పెరగడంతోపాటు మెరుగైన గ్రాఫిక్స్ పనితీరును కనబరుస్తుందట. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానుంది. అలాగే, CMF బడ్స్ 2, CMF బడ్స్ 2a, CMF బడ్స్ 2 ప్లస్‌తోపాటుగా మార్కెట్‌లోకి ఈ కొత్త హ్యాండ్‌సెట్ వస్తుంది.
Xలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్‌తో CMF ఫోన్ 2 ప్రో మోడల్ రాబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. అలాగే, మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న CMF ఫోన్ 1 మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పై రన్ అవుతోంది. CMF ఫోన్ 1 తో పోలిస్తే CMF ఫోన్ 2 ప్రో మోడల్ సుమారు పది శాతం వరకూ CPU వేగం, ఐదు శాతం వరకూ గ్రాఫిక్స్ మెరుగుదలను చూపిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
కొత్త మోడల్ ఫోన్ ప్రాసెసర్ మీడియాటెక్ ఆవర తరం ఎన్‌పీయూని ఉపయోగిస్తుంది. అలాగే, 4.8 TOPS AI పని తీరును ప్రదర్శిస్తుంది. బీజీఎంఐ గేమింగ్ కోసం 120 fps (సెకెన్‌కు ఫ్రేమ్స్), 1000 Hz టచ్ శాంప్లింగ్ రేటు, 53 శాతం నెట్‌వర్క్ బూస్ట్‌ను CMF ఫోన్ 2 ప్రో అందించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది సన్నని, తేలికైన డిజైన్‌తో వస్తున్నట్లు ఇప్పటికే టీజ్ చేయబయడింది.
ఈ ఏప్రిల్ 28న CMF ఫోన్ 2 ప్రో మార్కెట్‌లోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ దీని గత మోడల్స్ మాదిరి డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతే కాదు, నథింగ్ సహ వ్యవస్థాపకుడు అకిస్ ఎవాంజెలిడిస్ రాబోయే ఈ కొత్త ఫోన్ బాక్స్ ఛార్జర్‌తో వస్తుందని ఇటీవల వెల్లడించారు.
గత సంవత్సరం జూలైలో విడుదలైన CMF ఫోన్ 1 బేస్ 6GB + 128GB RAM స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999 తో మొదలైంది. ఇది 6.7 అంగుళాల ఫుల్-HD+ (1080x2400 పిక్సెల్స్) AMOLED LTPS డిస్‌ప్లేను 120 Hz వరకూ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అంతేకాదు, దీనికి 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ సెన్సార్, పోర్ట్రెయిట్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.
ప్రకటన
ప్రకటన