రాబోయే నథింగ్ ఫ్లాగ్‌షిప్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌కు బదులుగా కొత్త గ్లిఫ్ మ్యాట్రిక్స్‌ను కలిగి ఉంటుంది
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ Nothing తమ రాబోయే మోడల్ Nothing Phone 3ని మన దేశీయ మార్కెట్‌లో జూలై 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదే రోజున గ్లోబల్ మార్కెట్‌లలోనూ కూడా అడుగుపెట్టనుంది. అయితే, విడుదలకు ముందే దీని స్పెసిఫికేషన్స్ బహిర్గతం అయ్యాయి. ఓ టిప్‌స్టర్ టీక్ చేసిన విషయాలను బట్టీ, ఇది 50 మెగాపిక్సెల్ లెన్స్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. అలాగే, 6.7 అంగుళాల ఎల్‌టీపీఓ OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీనికి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5150mAh బ్యాటరీని అందించారు.ఎక్కువ కాలం సాఫ్ట్‌వేర్ సపోర్ట్,Nothing ఇండియా ప్రెసిడెంట్ అకిస్ ఎవాంజెలిడిస్ చెప్పిన దాని ప్రకారం, Nothing Phone 3 కు ఐదు సంవత్సరాల వరకూ ఆండ్రాయిడ్ ఓఎస్ ఆప్‌డేట్‌లు, ఏడు సంవత్సరాల వరకూ సెక్యూరిటీ ప్యాచ్‌లతో సపోర్ట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే, గతంలో ఇచ్చిన దానితో పోల్చితే ఈ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఎక్కువ కాలమనే చెప్పాలి. Nothing Phone 2 కు మూడు సంవత్సరాల ఓఎస్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ సపోర్ట్‌ను కంపెనీ అందించింది.
Nothing Phone 3 మోడల్‌లో కెమెరా విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను @gadget_bits అనే టిప్‌స్టర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌కు అందించిన ట్రిపుల్ కెమెరా యూనిట్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అలాగే, 50 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తోపాటు 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌ను అందించారు. అంతే కాదు, ఇందులోనే వీడియోకాల్స్, సెల్ఫీలకు ప్రత్యేకంగా 50 మెగాపిక్సెల్ ముందు కెమెరాతో డిజైన్ చేశారు.
ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Nothing ఓఎస్ 3.5తో రన్ అయ్యే ఈ Nothing Phone 3 హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఎల్‌టీపీఓ OLEDను కలిగి ఉంది. ఈ మొబైల్‌కు ఇది ప్రత్యేక ఆకర్షణగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో ఎన్ఎఫ్‌సీ, ఈ సిమ్ స్లాట్‌లను అందించినట్లు కనిపిస్తోంది. అలాగే, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు, వైర్‌లెస్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కెపాసిటీని కలిగి ఉంటుందని అంచనా.
రాబోయే Nothing Phone 3 మోడల్‌కు అందించిన ప్రాసెసర్‌పై మార్కెట్ వర్గాలలో పెద్ద చర్చ జరుగుతోంది. దీనికి స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌ను అమర్చారు. దీంతో గతంలో వచ్చిన Nothing Phone 2 తో పోల్చి చూసినప్పుడు సీపీయూ పనితీరులో ఈ కొత్త మోడల్ 36 శాతం వరకూ మెరుగైన పని తీరును కలిగి ఉంటుందని చెబుతున్నారు. అలాగే, జీపీయూ, ఎన్‌పీయూ పనితీరులోనూ కూడా వరుసగా 88 శాతం, 60 శాతం మెరుగుదల కనిపిస్తుందని గట్టిగా చెబుతున్నారు.
ప్రకటన
ప్రకటన