Photo Credit: Oppo
Oppo Find X8 Ultra పేరుతో Oppo Find X8 సిరీస్ నుంచి ఓ సరికొత్త మోడల్ పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సిరిస్ నుంచి గత నెలలోనే Find X8, Find X8 Pro అనే రెండు మోడల్స్ ఇండియాతోపాటు గ్లోబల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ లైనప్‌లో చేరబోతున్నట్లు అంచనా వేస్తున్న Oppo Find X8 Ultra అరంగేట్రానికి ముందే ఓ టిప్‌స్టర్ ద్వారా దీని కీలక స్పెసిఫికేషన్‌లను లీక్ అయ్యాయి. ఫోన్ 6.82-అంగుళాల 2K డిస్‌ప్లే, X-యాక్సిస్ హాప్టిక్ మోటార్, IP69 రేటింగ్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో రూపొందించే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ ఏడాది జనవరిలో విడుదలైన Find X7 Ultraకి కొనసాగింపుగా ఇది రానున్నట్లు భావిస్తున్నారు.
ప్రముఖ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం Weiboలోని ఓ పోస్ట్‌లో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Oppo Find X8 Ultra మోడల్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లను బహిర్గతం చేసింది. ఈ పోస్ట్ ఆధారంగా చూస్తే.. హ్యాండ్‌సెట్ 2K రిజల్యూషన్‌తో 6.82-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ స్క్రీన్‌తో అందుబాటులోకి వస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అలాగే, ఇది డిస్‌ప్లే కింద అందించబడిన అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటిని నియంత్రించేందుకు IP68+IP69 రేటింగ్‌ను కలిగి ఉండనుంది. అలాగే, Find X8 Ultra మోడల్ అధిక పీడన ద్రవాలను తట్టుకోగలదని కూడా ఈ రేటింగ్ సూచిస్తోంది. Oppo కంపెనీ 80W లేదా 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,000mAh సామర్థ్యం గల బ్యాటరీతో ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు టిప్‌స్టర్ వెల్లడించింది. అంతేకాదు, Oppo Find X8 Ultra ఇతర ముఖ్యమైన ఫీచర్లల X-యాక్సిస్ వైబ్రేషన్ మోటార్, Oppo ఇమేజింగ్ టెక్నాలజీ వంటివి కీలకమైనవిగా చెప్పొచ్చు.
గతంలో లీక్ అయిన అంశాలను పరిశీలిస్తే.. Oppo Find X8 Ultra మోడల్ ఫోన్ Huawei Mate 70 సిరీస్‌కు సమానమైన స్పెక్ట్రల్ రెడ్ మాపుల్ ప్రైమరీ కలర్ కెమెరాతో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, దీని కెమెరా సిస్టమ్ 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తోపాటు మరో 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో 60 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో రానున్నట్లు అంచనా.
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ తెలిపింది. అలాగే, Qualcomm న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. ఇది Oppo Find N5తో పాటు Q1 2025లో పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి విషయాలు తెలియాలంటే మాత్రం.. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.
ప్రకటన
ప్రకటన