Photo Credit: Nothing
నథింగ్ ఫోన్ 3a ప్రో అనేది కంపెనీ లైనప్‌లో హై-ఎండ్ మోడల్.
బార్సిలోనాలో మార్చి 4న జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో కంపెనీ Nothing Phone 3a సిరీస్‌ను లాంఛ్ చేసింది. ఈ సిరీస్‌లో Nothing Phone 3a ప్రో, Nothing Phone 3a అనే రెండు మోడల్స్ ఉన్నాయి. మార్చి 11 నుండి మన దేశంలో వీటి అమ్మకాలు ప్రారంభమయ్యే ముందు, ఫ్లిప్‌కార్ట్ గ్యారెంటీడ్ ఎక్స్‌ఛేంజ్ వాల్యూ (GEV) ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. దీని ద్వారా కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను Nothing Phone 3a ప్రో లేదా Nothing Phone 3a కోసం ట్రేడ్ చేసేందుకు, వారి డివైజ్‌లకు బెస్ట్ వాల్యూను పొందేందుకు అవకాశం ఉంటుంది.
ఈ GEV ప్రోగ్రామ్ వినియోగదారులు తమ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లకు గరిష్ట ట్రేడ్-ఇన్ వాల్యూ పొందేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే, డివైజ్ కండిషన్ ఆధారంగా తగ్గింపులు లేకుండా ఫుల్ ఎక్స్‌ఛేంజ్ వాల్యూను అందిస్తుంది. Nothing Phone 3a సిరీస్ కోసం పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసే ప్రక్రియ అలాగే ఉంటుంది. కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్‌లోకి లాగిన్ అయిన తర్వాత, వారు కొనుగోలు చేయాలనుకుంటున్న మోడల్‌ను ఎంపిక చేసుకోవచ్చు. వారి పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ వాల్యూను తనిఖీ చేయొచ్చు. అయితే, ఫ్లిప్‌కార్ట్ సిబ్బంది డెలివరీ సమయంలో ఎక్స్‌ఛేంజ్ చేయాల్సిన ఫోన్ వాల్యేషన్‌ను నిర్వహిస్తున్నప్పటికీ, GEV ప్రోగ్రామ్ విషయంలో అలా ఉండదు.
డెలివరీ సమయంలో ఎలాంటి వాల్యేషన్స్ లేదా తగ్గింపులు లేకుండా, చెక్అవుట్ సమయంలో హామీ ఇవ్వబడిన ఎక్స్‌ఛేంజ్ వాల్యూ కస్టమర్లకు లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. సజావుగా ఎక్స్‌ఛేంజ్‌ను నిర్ధారించడానికి, డెలివరీ సిబ్బంది స్మార్ట్‌ఫోన్ మేకింగ్, మోడల్‌ను నిర్ధారించడానికి డయాగ్నస్టిక్స్ యాప్‌ను వినియోగిస్తారు. అయితే, దీనికి ఒక ఎలిజిబులిటీ క్రైటీరియా ఉంది. GEV ప్రోగ్రామ్ 2020 తర్వాత విడుదలైన Android స్మార్ట్‌ఫోన్‌లకు, 2018 తర్వాత లాంఛ్ అయిన iPhone మోడళ్లకు మాత్రమే వర్తిస్తుందని Flipkart వెల్లడించింది.
భారత్‌లో Nothing Phone 3a ధర 8GB + 128GB కాన్ఫిగరేషన్ రూ. 24,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 26,999గా ఉంది. ఈ ఫోన్ 12GB + 256GB కాన్ఫిగరేషన్‌లో కూడా లభిస్తున్నప్పటికీ, ఈ మోడల్ ఇండియా కాకుండా ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది నలుపు, నీలం, తెలుపు రంగులలో అందుబాటులో ఉంటుంది.
Nothing Phone 3a ప్రో ధర 8GB + 128GB వేరియంట్ రూ. 29,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, దీని 256GB స్టోరేజ్ వేరియంట్ 8GB, 12GB RAM ఆప్షన్‌లతో అటాచ్ చేయబడింది. వీటి ధర వరుసగా రూ. 31,999, రూ. 33,999గా ఉన్నాయి. ఈ ఫోన్ నలుపు, బూడిద రంగు షేడ్స్‌లో లభిస్తుంది. మొత్తంగా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న GEV ప్రోగ్రామ్ ద్వారా సేల్ బాగుండే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన