50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తోన్న Nothing Phone 3a సిరీస్
ప్రపంచవ్యాప్తంగా మార్చి 4న Nothing Phone 3a సిరీస్ లాంచ్ కానుంది. దీని అరంగేట్రానికి ముందు, ఈ బ్రిటిష్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారు (OEM) లైనప్‌లోని ప్రో మోడల్ కీలక కెమెరా స్పెసిఫికేషన్‌లను నిర్ధారించింది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందిస్తున్నారు. అలాగే, స్పెసిఫికేషన్‌లతోపాటు కెమెరా యూనిట్ లేఅవుట్ కూడా టీజ్ చేయబడింది. సాంప్రదాయ డిజైన్‌లతో పోలిస్తే ఈ కెమెరాలు అసాధారణ రీతిలో అమర్చబడినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Nothing Phone 3a సిరీస్‌కు సంబంధించిన కీలక అంశాలను చూద్దాం!