మార్చి 4న స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్న Nothing Phone 3a సిరీస్
ఈ ఏడాది మార్చి 4న Nothing Phone 3a సిరీస్ లాంఛ్ కాబోతుంది. అయితే, విడుదలకు ముందు రాబోయే స్మార్ట్ ఫోన్‌ల గురించిన కీలక అంశాలను కంపెనీ ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్‌లు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో రూపొందించినట్లు కంపెనీ సీఈఓ కార్ల్ పీ వెల్లడించారు. గతంలో వచ్చిన Nothing Phone 2a సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ల ద్వారా శక్తిని పొందింది. రాబోయే సిరీస్ గణనీయమైన CPU, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) అప్‌గ్రేడ్‌లను పొందనున్నట్లు ఈ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ స్పష్టం చేసింది. రెండోది ఆన్-డివైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాసెసింగ్‌ను మరింత మెరుగుపరుస్తుంది.