Photo Credit: Honor
Honor కంపెనీ నుండి సరికొత్త గేమింగ్-ఫోకస్డ్ ఆఫర్‌గా Honor GT ఫోన్‌ను చైనాలో విడుదలైంది. ఈ కొత్త Honor స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే, దీనిని 16GB RAMతో గరిష్టంగా 1TB వరకు స్టోరేజీతో రూపొందిచారు. Honor GT హ్యాండ్‌సెట్ 5,300mAh బ్యాటరీతో 100W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
చైనాలో ఈ Honor GT స్మార్ట్ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 2,199 (దాదాపు రూ. 25,000)గా నిర్ణయించారు. అలాగే, 12GB + 512GB, 16GB + 256GB, 16GB + 512GB RAM, స్టోరేజ్ మోడళ్ల ధరలు వరుసగా CNY 2,399 (దాదాపు రూ. 29,000), CNY 2,899 (దాదాపు రూ. 32,000)గా ఉన్నాయి. వీటితోపాటు 16GB RAM +1 TB స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ మోడల్ ధర CNY 3,299 (దాదాపు రూ. 38,000)గా ఉంది. అరోరా గ్రీన్, ఐస్ వైట్, ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
Honor GT డ్యూయల్-సిమ్ (నానో)తో Android 15 ఆధారంగా MagicOS 9.0పై రన్ అవుతుంది. ఇది 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,200x2,664 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను 3,840Hz PWM వాల్యూతో గరిష్టంగా 1,200నిట్స్ బ్రైట్‌నెస్ స్థాయిలో ఉంటుంది. ఒయాసిస్ ఐ ప్రొటెక్షన్ గేమింగ్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది Adreno 750 GPUతో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌పై రన్ అవుతోంది.
Honor GT ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ మాక్రో షూటర్, ఆటోఫోకస్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 16-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం అందించారు. ఇది 5,300mAh బ్యాటరీతో 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 15 నిమిషాల్లో బ్యాటరీని సున్నా నుండి 60 శాతానికి ఛార్జ్ చేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
కనెక్టివిటీ ఆప్షన్స్‌లో బ్లూటూత్ 5.3, GPS, Beidou, GLONASS, గెలీలియో, NFC, OTG, Wi-Fi 802.11 a/b/g/n/ac/ax/be, USB టైప్-సి పోర్టులు ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, IR సెన్సార్, గ్రావిటీ సెన్సార్, గైరోస్కోప్, లీనియర్ మోటార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను అందించారు. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తోపాటు దుమ్ము, స్ప్లాష్ నియంత్రణ కోసం IP65-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఫోన్ 161x74.2x7.7mm పరిమాణంతో 196 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన