Photo Credit: Honor
స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ఇతర పరికరాల కోసం చైనాలో Honor MagicOS 9.0 అప్‌డేట్‌ను లాంచ్ చేశారు. ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రూపొందించబడింది. అలాగే, ఆపిల్ డైనమిక్ ఐలాండ్, న్యూ అండ్ నాచురల్ యానిమేషన్ ఇంజిన్, ఫేస్ స్వాప్ డిటెక్షన్, అప్‌గ్రేడ్ చేసిన టర్బో X సిస్టమ్‌పై Honor సొంతంగా తీసుకున్న స్మార్ట్ క్యాప్సూల్ వంటి ఫీచర్లను ఇది అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని మోనిటర్ చేయడంతోపాటు AI నోట్స్, AI ట్రాన్సిలేషన్ వంటి అనేక AI సంబంధిత ఫీచర్లను బండిల్ చేస్తుంది.
నవంబర్ 2024 - మ్యాజిక్ V3, మ్యాజిక్ Vs 3, మ్యాజిక్ V2 సిరీస్, మ్యాజిక్ 6 సిరీస్,
డిసెంబర్ 2024 - మ్యాజిక్ Vs 2, మ్యాజిక్ V ఫ్లిప్, మ్యాజిక్ 4 సిరీస్, హానర్ 200 సిరీస్,
జనవరి 2025 - మ్యాజిక్ Vs సిరీస్, మ్యాజిక్ V, హానర్ 100 సిరీస్, హానర్ 90 జిటి,
ఫిబ్రవరి 2025 - హానర్ 90 సిరీస్, హానర్ 80 సిరీస్
మార్చి 2025 - హానర్ X60 సిరీస్, X50
Honor MagicOS 9.0 అప్‌డేట్ 20కి పైగా లాక్ స్క్రీన్ స్టైల్స్‌ను 3D, అనిమే ఎలిమెంట్స్ నుండి ఎంపిక చేసుకునే అవకాశముంది. వాతావరణం, ఫేస్ స్వాప్ డిటెక్షన్ లేదా మెడికల్ అపాయింట్‌మెంట్‌ల గురించి హెచ్చరికలిచ్చే స్మార్ట్ క్యాప్సూల్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. Honor మరింత స్పష్టమైన యానిమేషన్ ఇంజిన్‌ను పరిచయం చేసింది. హోమ్ స్క్రీన్ లేఅవుట్‌ను మార్చేటప్పుడు, యాప్‌ల మధ్య మారేటప్పుడు లేదా లాక్ స్క్రీన్‌పై సమాచారాన్ని చూసేటప్పుడు మరింత వేగవంతగా పనిచేస్తుంది. రెండరింగ్ సమయంలో 11 శాతం పవర్ వినియోగాన్ని తగ్గించేలా టర్బో X ఇంజిన్ అప్‌గ్రేడ్ చేయబడింది.
MagicOS 9.0లో AI అనేది ప్రధాన భాగంగా ఉంది. ఇది వీడియో కాల్‌లు లేదా ఇతర పరస్పర ఆన్‌లైన్ వినియోగం సమయంలో డీప్‌ఫేక్‌ల నుండి వినియోగదారులను రక్షించడానికి రూపొందించబడిన ఫేస్ స్వాప్ డిటెక్షన్ ఫీచర్‌ను అందిస్తుంది. YOYO ఏజెంట్‌తో Honor AI అసిస్టెంట్ నోటిఫికేషన్‌లను నిర్వహించడం, డ్రింక్స్ ఆర్డర్ చేయడం, ధరలను పోల్చి చూసుకోవడం వంటి కొత్త ఫీచర్స్‌ను పొందవచ్చు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్, లార్జ్ ఇమేజ్ మోడల్, లార్జ్ వాయిస్ మోడల్, మల్టీ మోడల్ వంటి మోడల్స్‌ను కలిగి ఉన్న మ్యాజిక్ మోడల్ ఫ్యామిలీని ప్రభావితం చేస్తుందని కంపెనీ చెబుతోంది.
మ్యాజిక్ ఎడిటర్ ద్వారా ఇమేజ్‌ల నుండి అవసరం లేని వస్తువులను తీసివేయవచ్చు. ఫిల్టర్‌లతో మెరుగుపరచడంతోపాటు పాత ఫోటోలను కూడా పునరుద్ధరించగలదు. రోజువారీ పనుల కోసం.. స్మార్ట్ ఫిట్‌నెస్ కోచ్‌ని అందిస్తుంది. అలాగే, కొత్త ట్రావెల్ అసిస్టెంట్‌తోపాటు డ్యూయల్-డివైస్ మెసేజింగ్, హోమ్ కార్ ఇంటిగ్రేషన్, క్రాస్-డివైస్ సెక్యూరిటీ, ఎనీడోర్ అని పిలువబడే సర్కిల్-టు-సెర్చ్-వంటి విజువల్ లుక్అప్ ఫీచర్స్ ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన