Honor Robot Phone Pre-orders Opens in China: ఈ రోబోటిక్ ఫోన్‌ను ప్రీ-బుకింగ్ చేసుకోవాలనుకునే యూజర్లు 1000 యువాన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
Photo Credit: Honor
Honor Robot Phone
Honor Robot Phone Pre-Orders Opens in China: గ్లోబల్ టెక్ మార్కెట్లో తనదైన శైలిలో వినూత్న స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసే ప్రముఖ హానర్ కంపెనీ, తన ఎంతో ప్రతిష్టాత్మకమైన హానర్ రోబో ఫోన్ ప్రీ-ఆర్డర్‌లను అధికారికంగా ప్రారంభించింది. ఈ ఆసక్తికరమైన రోబోటిక్ కెమెరా ఫోన్ ఈ ఏడాది ఆగస్టు నెలలో కమర్షియల్‌గా మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం చైనాలోని హానర్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో దీని బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకునే కస్టమర్లకు కంపెనీ అనేక ప్రత్యేక ప్రయోజనాలను, ఆఫర్‌లను అందిస్తోంది.
ఆగస్టులో కమర్షియల్ లాంచ్..
ఈ రోబోటిక్ ఫోన్‌ను ప్రీ-బుకింగ్ చేసుకోవాలనుకునే యూజర్లు 1000 యువాన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి జీవితకాల ఉచిత YOYO AI SVIP మెంబర్‌షిప్ లభిస్తుంది. దీనితో పాటు ఒక సంవత్సరం పాటు ఉచిత గింబల్ రీప్లేస్‌మెంట్ సర్వీస్, స్టాండర్డ్ యాక్సెసరీలు, 24 నెలల పాటు వడ్డీ లేని సులభ ఈఎంఐ ఆప్షన్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. యూజర్లకు ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే లక్ష్యంతో హానర్ ఈ ఫోన్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దింది.
ఫోన్ టాప్‌లో రొబోటిక్ గింబల్ కెమెరా..
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని కెమెరా డిజైన్. MWC 2026 ఈవెంట్‌లో మొదటిసారి ప్రదర్శించిన ఈ ఫోన్ పైభాగంలో ప్రత్యేకమైన రొబోటిక్ గింబల్ అమర్చబడింది. ఇది నాలుగు డిగ్రీల ఫ్రీడమ్ కలిగిన టైటానియం అలాయ్ రోబోటిక్ గింబల్. సాధారణ వినియోగంలో ఉన్నప్పుడు ఈ కెమెరా మాడ్యూల్ ఫోన్ బాడీ లోపల దాగి ఉంటుంది. అయితే కెమెరా యాప్‌ను ఆన్ చేయగానే కేవలం 0.8 సెకన్ల వ్యవధిలోనే ఇది బయటకు వస్తుంది. ఇది 360 డిగ్రీల ట్రాకింగ్, ఇంటెలిజెంట్ కెమెరా మూవ్‌మెంట్, CIPA 5.5-లెవెల్ మెకానికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ చేస్తుంది.
Social Media Ban : పిల్లలకు సోషల్ మీడియా బంద్?.. 16 ఏళ్ల లోపు వారికి ఆంక్షలపై కేంద్ర ప్రభుత్వం యోచన
200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, పెరిస్కోప్ లెన్స్..
కెమెరా సామర్థ్యం విషయానికి వస్తే, హానర్ రోబో ఫోన్ లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (f/1.6 అపర్చర్)ను ఇచ్చారు. దీనికి తోడు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, ఏకంగా 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అందించినట్లు తెలుస్తోంది. రోబోటిక్ గింబల్ కదలికల వల్ల ప్రొఫెషనల్ కెమెరాల తరహాలో అత్యంత స్థిరమైన వీడియోలు, ట్రాకింగ్ షాట్‌లను ఈ ఫోన్ ద్వారా సులభంగా తీయవచ్చు.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, 120W ఫాస్ట్ ఛార్జింగ్..
ఇతర స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే, ఈ హానర్ రోబో ఫోన్ 1.5K రిజల్యూషన్ సపోర్ట్‌తో 6.3 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ అంచులు చాలా సన్నగా ఉంటాయి. ఇందులో అత్యంత వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రొసెసర్‌ను వాడినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుండటంతో తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ప్రీ-ఆర్డర్లు మొదలవ్వడంతో త్వరలోనే దీని పూర్తి ధర, ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999