Honor X70 Pro Max Launched: బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు.. చైనాలో అఫీషియల్‌గా హానర్ X70 ప్రో మాక్స్ లాంచ్!

Honor X70 Pro Max launched: మొబైల్ రంగంలోనే అత్యధికంగా ఏకంగా 6,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

Honor X70 Pro Max Launched: బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు.. చైనాలో అఫీషియల్‌గా హానర్ X70 ప్రో మాక్స్ లాంచ్!

Photo Credit: Honor

Honor X70 Pro Max

ముఖ్యాంశాలు
  • చైనాలో అఫీషియల్‌గా లాంచ్ అయిన Honor X70 Pro Max
  • కళ్లపై ఒత్తిడి పడకుండా ప్రత్యేక ఐ ప్రొటెక్షన్
  • 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఏకంగా 8,560mAh ‘చింఘై లేక్’ బ్యాటరీ
ప్రకటన

Honor X70 Pro Max Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ తన ఎక్స్ సిరీస్‌ను మరింత బలోపేతం చేస్తూ చైనాలో అధికారికంగా హానర్ X70 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ అద్భుతమైన డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ బ్యాకప్‌తో మిడ్-రేంజ్ బడ్జెట్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంది. గ్లోబల్ మార్కెట్లలో, ఇండియాలో దీని లభ్యతకు సంబంధించిన వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.

ధర విషయానికి వస్తే హానర్ X70 ప్రో మాక్స్ కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టని బడ్జెట్‌లోనే లభిస్తోంది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 8GB రామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 1,999 (మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.28,000)గా ఉంది. అలాగే టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8GB రామ్ + 512GB స్టోరేజ్ మోడల్ ధర CNY 2,399 (మన కరెన్సీలో సుమారు రూ.33,600) గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఫాంటమ్ పర్పుల్, సన్‌బర్స్ట్ గోల్డ్, బాంబూ గ్రీన్, ఫాంటమ్ నైట్ బ్లాక్ వంటి నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ఫీచర్లు టెక్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో 1200x2640 పిక్సెల్స్ రెజల్యూషన్ కలిగిన 6.79 ఇంచుల భారీ అమోలెడ్  స్క్రీన్‌ను అందించారు. ఇది మొబైల్ రంగంలోనే అత్యధికంగా ఏకంగా 6,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీనివల్ల ఎంతటి తీవ్రమైన ఎండలోనైనా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనితో పాటు కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండటానికి ఏఐ డిఫోకస్ ఐ ప్రొటెక్షన్, నేచురల్ లైట్ ఐ ప్రొటెక్షన్, ఏఐ స్లీప్ ఎయిడ్ డిస్‌ప్లే, హార్డ్‌వేర్-లెవల్ లో బ్లూ లైట్ వంటి అధునాతన ఐ-కేర్ ఫీచర్లను ఇందులో చేర్చారు.

పర్ఫామెన్స్ విషయానికి వస్తే హానర్ ఎక్కడా రాజీ పడలేదు. ఈ కారు లాంటి పవర్‌ఫుల్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ఎన్‌హ్యాన్స్‌డ్ ఎడిషన్ చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్‌ను చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీనివల్ల యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా ఫాస్ట్ గా మరియు క్లీన్ గా ఉంటుంది.

OTT Movies: ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈ వీకెండ్ డిఫరెంట్ జోనర్లలో ఐదు సరికొత్త సినిమాలు, సిరీస్‌లు

ఈ ఫోన్ లో అందరినీ ఆశ్చర్యపరిచే ప్రధాన ఫీచర్ దీని బ్యాటరీ లైఫ్. హానర్ X70 ప్రో మాక్స్ లో ఏకంగా 8,560mAh సామర్థ్యం గల చింఘై లేక్  లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీని అమర్చారు. ఈ భారీ బ్యాటరీని సూపర్ ఫాస్ట్‌గా ఛార్జ్ చేయడానికి వీలుగా 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగదారులకు రెండు నుండి మూడు రోజుల పాటు నిరంతరాయంగా పవర్ బ్యాకప్ లభిస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి ఈ బ్యాటరీ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో f/1.8 అపెర్చర్, ఈఐఎస్  స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో f/2.0 అపెర్చర్, 2D ఫేషియల్ రికగ్నిషన్ సపోర్ట్ ఉన్న 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ సిమ్ 5G, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 196 గ్రాములు, మందం కేవలం 7.76 మిమీ మాత్రమే. అన్నింటికంటే ముఖ్యంగా ఫోన్‌కు ధూళి, నీటి నుంచి అత్యుత్తమ రక్షణ కల్పించడానికి IP66 + IP68 + IP69 + IP69K లాంటి నాలుగు రకాల కఠినమైన సేఫ్టీ రేటింగ్స్ ఇవ్వడం విశేషం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »