Honor X7e Plus 5G Launched with 8100mAh Battery: ఈ ఫోన్ అత్యంత ప్రధానమైన, ప్రత్యేకమైన ఫీచర్ దీని బ్యాటరీనే. ఇందులో ఏకంగా 8100mAh సామర్థ్యం గల భారీ జంబో బ్యాటరీని అమర్చారు
Photo Credit: Honor
Honor X7e Plus 5G
Honor X7e Plus 5G launched with 8100mAh Battery: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ అంతర్జాతీయ మార్కెట్లోకి ఎంతో పవర్‌ఫుల్ ఫీచర్లతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. హానర్ X7e ప్లస్ 5G పేరుతో లాంచ్ అయిన ఈ మోడల్, బ్యాటరీ లైఫ్, బిల్డ్ క్వాలిటీ విషయంలో స్మార్ట్‌ఫోన్ రంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోంది. ఆకట్టుకునే డిజైన్, స్మూత్ పెర్ఫార్మెన్స్, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను కస్టమర్లకు పరిచయం చేశారు.
చార్జింగ్ పెట్టే పనికి కొన్ని రోజుల పాటు స్వస్తి..
ఈ ఫోన్ అత్యంత ప్రధానమైన, ప్రత్యేకమైన ఫీచర్ దీని బ్యాటరీనే. ఇందులో ఏకంగా 8100mAh సామర్థ్యం గల భారీ జంబో బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు వేగంగా ఛార్జ్ కావడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజులకు పైగా బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి, గేమింగ్, వీడియోలు ఎక్కువగా చూసేవారికి ఈ ఫోన్ అద్భుతమైన ఆప్షన్‌గా నిలవనుంది.
పవర్ ఫుల్ IP68, IP69, IP69K రేటింగ్స్‌తో రక్షణ..
ఫోన్ పటిష్టత పరంగా హానర్ ఏ మాత్రం రాజీపడలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ నీరు, దుమ్ము, కఠినమైన వాతావరణ పరిస్థితుల నుంచి దెబ్బతినకుండా ఉండేందుకు ఏకంగా IP68, IP69, అత్యున్నత స్థాయి IP69K రేటింగ్‌లతో వస్తుంది. అంతేకాకుండా ఇది క్రష్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. అంటే ఫోన్ అనుకోకుండా కిందపడినా లేదా బరువు పడినా సులభంగా పగిలిపోకుండా ఉండేలా దీని బాడీని రూపొందించారు. ఫోన్ బరువు 216.5 గ్రాములుగానూ, మందం కేవలం 8.3mm గానూ ఉంటుంది.
స్మూత్ గేమింగ్, ఆండ్రాయిడ్ 16 మ్యాజిక్ OS 10 సపోర్ట్..
స్పీడ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజ్ అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. మల్టీ టాస్కింగ్, యాప్స్ వేగంగా పనిచేయడం, యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత సులభతరం చేసేలా సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దారు.
JBL Vienna Speaker : మ్యూజిక్ ప్లే అవుతుంటే గాల్లో తేలాడే పాటల లిరిక్స్.. స్పీకర్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్
50 మెగాపిక్సెల్ AI కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్..
హానర్ X7e ప్లస్ 5G డివైజ్ 6.87 అంగుళాల HD+ TFT LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1592 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండి స్మూత్ విజువల్స్ అందిస్తుంది. కళ్లకు అలసట కలగకుండా ఐ కాంఫర్ట్ మోడ్ ఇచ్చారు. కెమెరా విభాగంలో వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు సెకండరీ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో ఏఐ మెమరీ, సర్కిల్ టు సెర్చ్, ఏఐ ఇరేజర్, ఏఐ సమ్మరీ వంటి పలు స్మార్ట్ AI ఫీచర్లను జోడించారు.
సరసమైన ధరకే అధునాతన స్పెసిఫికేషన్లు..
హానర్ తన కొత్త X7e ప్లస్ 5G ఫోన్‌ను ప్రస్తుతం ఖతార్ దేశంలో లాంచ్ చేసింది. అక్కడ దీని 6GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర QAR 999 (భారత కరెన్సీలో దాదాపు రూ.26,000)గా నిర్ణయించారు. ఈ ఫోన్ హానర్ అధికారిక వెబ్‌సైట్‌లో డెసర్ట్ గోల్డ్, వెల్వెట్ బ్లాక్, మీటియోర్ సిల్వర్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. త్వరలోనే భారత్ సహా ఇతర గ్లోబల్ మార్కెట్లలో ఇది లాంచ్ కానుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999