Huawei Launching Pura 90s Pro and Pro Max: హువావే పురా 90s ప్రో మోడల్ 12 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర మలేషియా కరెన్సీలో MYR 3,699 (మన కరెన్సీలో సుమారు రూ.87,200)గా ఉంది.
Photo Credit: Huawei
Huawei Pura 90s Pro
Huawei Launching Pura 90s Pro and Pro Max: అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన మార్క్ క్రియేట్ చేస్తున్న చైనా టెక్ దిగ్గజం హువావే గ్లోబల్ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను ఆవిష్కరించింది. తన పాపులర్ ప్రీమియం లైనప్‌లో భాగంగా హువావే పురా 90s Pro, హువావే పురా 90s ప్రొ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను అంతర్జాతీయ వేదికపై అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సరికొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో హువావే తన సొంత టెక్నాలజీతో రూపొందించిన పవర్‌ఫుల్ కిరిన్ 9030S చిప్‌సెట్‌ను అమర్చింది. దుమ్ము, నీటి నుంచి ఫోన్ పాడవకుండా ఉండేలా ఈ మొబైళ్లకు అత్యంత కఠినమైన ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను అందించడం విశేషం.
హువావే పురా 90s ప్రో, ప్రో మాక్స్ ధరలు ఎంత..?
ధరల విషయానికి వస్తే, హువావే పురా 90s ప్రో మోడల్ 12 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర మలేషియా కరెన్సీలో MYR 3,699 (మన కరెన్సీలో సుమారు రూ.87,200)గా ఉంది. అలాగే దీని 12 GB + 512 GB స్టోరేజ్ వేరియంట్ ధర MYR 3,999 (సుమారు రూ.94,200)గా నిర్ణయించారు. ఇక అల్ట్రా ప్రీమియం మోడల్ అయిన పురా 90s ప్రో మాక్స్ 12 GB + 512 GB వేరియంట్ ధర MYR 4,899 (సుమారు రూ.1,15,400)గా ఉంది. పురా 90s ప్రో మోడల్ గువా సోడా, ఆరెంజ్ సోడా, కోకోనట్ వైట్, మల్బెర్రీ బ్లాక్ కలర్లలో లభిస్తుండగా, ప్రో మాక్స్ మోడల్ బ్లష్ గోల్డ్, ఆరెంజ్ ఓషన్, బ్లేజ్ పర్పుల్, గ్రాఫైట్ బ్లాక్ రంగులలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మలేషియాలో వీటి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం కాగా, రాబోయే నెలల్లో మిగతా అంతర్జాతీయ మార్కెట్లలో ఇవి విడుదల కానున్నాయి.
భారీ ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు..
హువావే పురా 90s ప్రో స్మార్ట్‌ఫోన్ లో 6.6 ఇంచుల ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 2760x1256 పిక్సెల్స్ రెజల్యూషన్, 1Hz-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 460ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. అదే సమయంలో ప్రో మాక్స్ వేరియంట్ లో మరింత పెద్దదైన 6.9 ఇంచుల ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 2880x1308 పిక్సెల్స్ రెజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. పర్ఫార్మెన్స్ కోసం ఈ రెండు ఫోన్లలోనూ హువావే సంస్థకు చెందిన శక్తివంతమైన ఆక్టాకోర్ Kirin 9030S ప్రాసెసర్‌ను వాడారు. ఇవి సరికొత్త EMUI 16 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతాయి.
సెలియా ఏఐ అసిస్టెంట్‌తో మీ పనులన్నీ మరింత సులభం..
ఈ సరికొత్త ఫోన్లలో హువావే తన లేటెస్ట్ ఈఎంయూఐ 16 సాఫ్ట్‌వేర్‌తో పాటు సరికొత్త సెలియా ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టింది. రోజువారీ పనులను చాలా సులభంగా నిర్వహించేందుకు ఈ ఏఐ టూల్ కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మీ ట్రిప్ ప్లానింగ్, కొత్త టూరిస్ట్ ప్రదేశాల సూచనలు, రైడ్ బుకింగ్ చేయడం, మీ డైలీ షెడ్యూల్స్ నిర్వహించడం, ముఖ్యమైన పనుల రిమైండర్లు సెట్ చేయడం, అలాగే వాయిస్ కాల్స్, సిస్టమ్ సెట్టింగ్స్ వంటి అనేక పనులను కేవలం మీ వాయిస్ కమాండ్స్ ద్వారా క్షణాల్లో చేసి పెడుతుంది.
Xiaomi : ఒక్కో ఫోటో ప్రింట్‌కు రూపాయిన్నర ఖర్చు మాత్రమే.. మార్కెట్లోని షావోమీ కొత్త ప్రింటర్
యాపిల్, శామ్‌సంగ్‌లకు గట్టి పోటీ..
కెమెరా పరంగా హువావే పురా 90s ప్రో మాక్స్ ఒక ఊహించని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీని వెనుక భాగంలో ఏకంగా 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను జత చేశారు. దీనితో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 40 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఇక స్టాండర్డ్ ప్రో మోడల్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12.5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మాక్రో టెలిఫోటో కెమెరాలను అమర్చారు. ఈ రెండు ఫోన్లలో కూడా సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరాను అందించారు. సెక్యూరిటీ కోసం డిస్‌ప్లే కింద వేగవంతమైన ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు.
100W సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సరికొత్త పవర్ హౌస్..
ఎక్కువ సమయం పాటు ఫోన్ వాడే వారి కోసం హువావే రెండు ఫోన్లలోనూ శక్తివంతమైన 6,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీలను అందించింది. అయితే ఛార్జింగ్ స్పీడ్ లో మాత్రం కొద్దిపాటి తేడాలు ఉన్నాయి. హువావే పురా 90s ప్రో మోడల్ 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుండగా.. హై-ఎండ్ మోడల్ అయిన పురా 90s ప్రో మాక్స్ ఏకంగా 100W వైర్డ్ సూపర్‌ఛార్జ్, 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ల బరువు విషయానికి వస్తే ప్రో మోడల్ సుమారు 213.5 గ్రాములు, ప్రో మాక్స్ మోడల్ 230.5 గ్రాముల బరువును కలిగి ఉంటాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains