Photo Credit: Huawei
హువావే పురా 80 ప్రో+ గ్లేజ్ బ్లాక్, గ్లేజ్ గ్రీన్, గ్లేజ్ రెడ్ మరియు గ్లేజ్ వైట్ షేడ్స్‌లో వస్తుంది
ప్రముఖ చైనా టెక్ దిగ్గజం Huawei మొబైల్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ కంపెనీ నుంచి Huawei Pura 80 సిరీస్ నుంచి ఏకంగా నాలుగు కొత్త ఫోన్ మోడల్స్‌ను చైనా మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇందులో Pura 80, Pura 80 Pro, Pura 80 Pro+, Pura 80 Ultra వేరియంట్‌లు ఉన్నాయి. చాలా వరకూ గతంలో Huawei నుంచి వచ్చిన Huawei 70 సిరీస్ మాదిరిగానే ఈ కొత్త సిరీస్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా, Pura 80 వేరియంట్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమారాతోపాటు 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌ను అందించారు.Pura 80 స్పెసిఫికేషన్స్,కొత్త Huawei Pura 80 సిరీస్‌కు చెందిన ప్రాసెసర్‌కు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. Pura 80 స్పెసిఫికేషన్స్ చూస్తే, 6.6 అంగుళాల డిస్‌ప్లేతో రూపొందించబడింది. ఇది 66W వైర్డ్, 50W వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5600mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 1.5 మెగాపిక్సెల్ రెడ్ మాపుల్ స్పెక్ట్రల్ సెన్సార్‌తో రూపొందించారు.
6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్‌టీపీఓ OLEDను Pura 80 Ultra వేరియంట్‌కు అందించారు. HarmonyOS 5.1 తో 100W వైర్డ్, 80W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,700mAh బ్యాటరీతో దీనిని రూపొందించారు. ఈ వేరియంట్‌లో స్విచ్ చేయగలిగే టెలిఫోటో కెమెరా సిస్టమ్‌ను అందించారు. ఇది 3.7x, 9.4x ఆప్టికల్ జూమ్‌తో రెండు టెలిఫోటో లెన్స్‌లను వినియోగిస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 40 మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ షూటర్, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రూపొందించారు.
డిస్‌ప్లేతోపాటు ఓఎస్, ఛార్జింగ్ ఫీచర్స్, బ్యాటరీ సామర్థ్యం Pura 80 Ultra వేరియంట్ మాదిరిగానే Pura 80 ప్రో, ప్రో+ లలో కూడా అందించారు. స్విచ్ చేయగలిగే లెన్స్ సెటప్ కాకుండా, 4x వరకూ ఆప్టికల్ జూమ్ సామర్థ్యం కలిగిన 48 మెగాపిక్సెల్ మాక్రో టెలిఫోటో షూటర్ ఉంది. ఇవి బీడౌ, టియాంటాంగ్ సిస్టమ్‌లతో డ్యూయల్ శాటిలైట్ కమ్యూనికేషన్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ కనెక్టివిటీ ఆప్షన్ 80 Ultra వేరియంట్‌లోనూ అందించారు.
Pura 80 వేరియంట్ ధర ఇప్పటి వరకూ వెల్లడికాలేదు. ura 80 Ultra ధర చైనాలో 16జీబీ + 512జీబీ CNY 9,999( సుమారు రూ. 1,18,900)గా కంపెనీ నిర్ణయించింది. Pura 80 Pro+ 16జీబీ+ 512జీబీ ఆప్షన్ ధర CNY 7,99( సుమారు. రూ. 95,100)గా ఉంది. Pura 80 Pro 12జీబీ+ 256జీబీ ధర CNY 6,499( సుమారు రూ. 77,300)గా ఉంది. చైనాలో Huawei VMall ద్వారా Pro తోపాటు Pro+, Ultra వేరియంట్‌లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన