భార‌త్‌లోనే Nothing Phone 3 త‌యారీ.. బ‌హిర్గ‌త‌మైన డిజైన్ ఎలా ఉందంటే

ఈ Nothing Phone 3ని స‌రికొత్త‌గా భార‌త్‌లోనే త‌యారు చేయ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. ఫోన్ డిజైన్ రెండ‌ర్ బ‌య‌ట‌కు రావ‌డంతో దీని డిజైన్‌పై కొంత స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్ల‌యింది.

భార‌త్‌లోనే Nothing Phone 3 త‌యారీ.. బ‌హిర్గ‌త‌మైన డిజైన్ ఎలా ఉందంటే

నథింగ్ ఫోన్ 2 (చిత్రంలో) లాగా కాకుండా, నథింగ్ ఫోన్ 3 గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉండే అవకాశం లేదు

ముఖ్యాంశాలు
  • Nothing Phone 3కు గ‌తంలో వ‌చ్చిన మోడ‌ల్స్ మాదిరిగానే transparent ప్యానెల్
  • ఇది హై ఎండ్ స్పెసిఫికేష‌న్స్‌తో రావ‌చ్చ‌ని అంచ‌నా
  • ఈ హ్యాండ్ సెట్ ధ‌ర GBP 800 ( సుమారు రూ. 93,000) వ‌ర‌కూ ఉంటుంది
ప్రకటన

Nothing Phone 3 కి సంబంధించిన కీల‌క అప్‌డేట్ వ‌చ్చేసింది. దీనిని మ‌న దేశంతోపాటు గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో లాంఛ్ చేసేందుకు కంపెనీ స‌న్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ ను కంపెనీ టీజ్ చేసింది. అంతే కాదు, దీని గ్లిఫ్ ఇంట‌ర్‌ఫేస్ లేకుండా రానున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అలాగే, Nothing Phone 2 మాదిరిగా రాబోయే ఈ Nothing Phone 3ని స‌రికొత్త‌గా భార‌త్‌లోనే త‌యారు చేయ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. తాజాగా ఈ ఫోన్ డిజైన్ రెండ‌ర్ బ‌య‌ట‌కు రావ‌డంతో దీని డిజైన్‌పై కొంత స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్ల‌యింది.జూలై 1న రానుందికొత్త ,Nothing Phone 3 కు చెందిన వెనుక ప్యానెల్‌లోని కొంత భాగం క‌నిపించేలా X వేదిక‌గా కంపెనీ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. దీనిని ప‌రిశీస్తే.. ఈ హ్యాండ్ సెట్ కుడివైపు దిగువ భాగంలో మోడ‌ల్ నంబ‌ర్ A024 ఉన్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. అలాగే, రాబోయే Nothing Phone 3 భార‌త్‌తోపాటు గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో జూలై 1న అడుగుపెట్ట‌నుంది. దీనిపై మార్కెట్ వ‌ర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

మ‌న దేశంలోనే త‌యారీ

కంపెనీ త‌మ అధికారిక‌ X ఖాతాలో మ‌రో విష‌యాన్ని కూడా స్ప‌ష్టం చేసింది. త్వ‌ర‌లో రానున్న ఈ Nothing Phone 3 మ‌న దేశంలోనే త‌యారు చేయ‌బ‌డుతుంద‌ని చెప్పుకొచ్చింది. అలాగే, ఇండియాలోని Nothing ఫ్యాక్ట‌రీని మ‌ళ్లీ విజిట్ చేయాల‌ని ఉందంటూ కంపెనీ కో ఫౌండ‌ర్ అకిస్ ఎవాంజెలిడిస్ X వేదిక‌గా రాసుకొచ్చారు. అంతే కాదు, చెన్నైలోని కంపెనీ ప్లాంట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అసెంబుల్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ ప్లాంట్‌లో ఐదు వంద‌ల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.

గ్లిఫ్ ఇంట‌ర్‌ఫేస్ లేకుండా

ఈ Nothing Phone 3 కు సంబంధించి ఒక్కొక్క అంశం బ‌య‌ట‌కు వ‌స్తున్న ఈ స‌మ‌యంలో తాజాగా ఓ జ‌ర్న‌లిస్ట్ రాబోయే ఫోన్ కు చెందిన రెండ‌ర్‌ను బ‌హిర్గ‌తం చేశారు. అలాగే, దీనిలో హ్యాండ్ సెట్ వెనుక ప్యాన‌ల్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గ‌తంలో వ‌చ్చిన మోడ‌ల్స్ మాదిరిగానే transparent ప్యానెల్ దీనిలో చూడొచ్చు. అయితే, ఇది గ్లిఫ్ ఇంట‌ర్‌ఫేస్ లేకుండా వ‌స్తోంది. ఈ ఇమేజ్‌లో ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కూడా స్ప‌ష్టంగా చూడొచ్చు. గ‌త మోడ‌ల్స్‌తో పోల్చితే ఇది మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.

ఈ హ్యాండ్ సెట్ ధ‌ర

రాబోయే Nothing Phone 3 గ‌తంలో వ‌చ్చిన నివేదిక‌ల బ‌ట్టీ, స్నాప్‌డ్రాగ‌న్ 8 సిరీస్ ప్రాసెస‌ర్‌, డైమెన్సిటీ 9400 ప్రాసెస‌ర్‌తో రూపొందించ‌వ‌చ్చు. అలాగే, ఇది హై ఎండ్ స్పెసిఫికేష‌న్స్‌తో రావ‌చ్చ‌ని అంచ‌నా. ఈ హ్యాండ్ సెట్ ధ‌ర GBP 800 ( సుమారు రూ. 93,000) వ‌ర‌కూ ఉంటుంద‌ని కంపెనీ సీఈఓ కార్ల్ పీ వెల్ల‌డించారు. దీనిని బట్టీ ఈ ఫోన్ Samsung Galaxy S25, iPhone 16 లాంటి ఖ‌రీదైన మోడ‌ల్స్‌తో పోటి ప‌డ‌నున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. అత్యంత స‌న్న‌ని డిజైన్‌తో జూన్ 20 మ‌న దేశీయ మార్కెట్‌లోకి Vivo Y400 Pro 5G
  2. ఆక‌ట్టుకునే ఏఐ ఇమేజింగ్ ఫీచ‌ర్స్‌తో.. త‌క్కువ ధ‌ర‌కే Realme Narzo 80 Lite 5G
  3. భార‌త్‌లోనే Nothing Phone 3 త‌యారీ.. బ‌హిర్గ‌త‌మైన డిజైన్ ఎలా ఉందంటే
  4. ఇండియాలో విడుద‌ల‌కు ముందే Oppo K13x 5G కి చెందిన కీల‌క వివ‌రాలు బ‌హిర్గ‌తం
  5. Huawei నుంచి ఒకేసారి నాలుగు మోడ‌ల్స్‌.. ధ‌ర‌తోపాటు స్పెసిఫికేష‌న్స్ ఇవే
  6. Oppo K13x 5G డిజైన్‌తోపాటు క‌ల‌ర్ ఆప్ష‌న్ ఇవే.. పూర్తి వివ‌రాలు మీకోసం
  7. Realme GT 7, GT 7T ఫోన్‌ల‌పై డిస్కౌంట్.. త్వ‌ర‌ప‌డండి, ఈ ఆఫ‌ర్ జూన్ 14 వ‌ర‌కే
  8. Motorola Edge 60 మోడ‌ల్‌ భార‌త్‌లో లాంఛ్‌.. ధ‌ర ఎంతంటే
  9. ఒప్పో K13X 5G ప్రైస్ ఏ రేంజ్ లో ఉంటుందంటే... బెస్ట్ బడ్జెట్ ఫోన్ అనే చెప్పవచ్చు
  10. అదిరిపోయే ఫీచర్స్ తో వస్తున్న వివో X ఫోల్డ్ 5...ప్రైస్ ఎంతో తెలుసా
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »