ఈ ఐటెల్ ఏస్ 3 హీరా ఫోన్ అతిపెద్ద ప్రత్యేకత దీనిలోని టైప్-సి ఛార్జింగ్ పోర్ట్.
Photo Credit: Itel
Itel Ace 3 Heera
itel Ace 3 Heera : భారత మార్కెట్లో బడ్జెట్ ఫీచర్ ఫోన్ల సెగ్మెంట్లో సుపరిచితమైన ఐటెల్ సంస్థ తన నూతన మోడల్ ఐటెల్ ఏస్ 3 హీరాను అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 949 గా నిర్ణయించారు. వినియోగదారులను ఆకట్టుకునేలా బ్లూ, పర్పుల్, బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రీటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటే మార్చి కొత్తది ఇచ్చేలా ఏడాది విడిభాగాల మార్పిడి ఆఫర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.
సరికొత్త మైలురాయి.. టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్
ఈ ఐటెల్ ఏస్ 3 హీరా ఫోన్ అతిపెద్ద ప్రత్యేకత దీనిలోని టైప్-సి ఛార్జింగ్ పోర్ట్. ఈ మోడల్ లాంచ్‌తో తన పూర్తి ఫీచర్ ఫోన్ల పోర్ట్‌ఫోలియోను టైప్-సి ఛార్జింగ్ పరిజ్ఞానంతో అందుబాటులోకి తెచ్చినట్లయిందని కంపెనీ ప్రకటించింది. దీనివల్ల వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్ రెండింటినీ వేర్వేరు వైర్లు లేకుండా ఒకే టైప్-సి ఛార్జింగ్ కేబుల్‌తో ఛార్జ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
ఎఐ బ్యాటరీ ఆప్టిమైజేషన్‌తో సుదీర్ఘ బ్యాటరీ లైఫ్
ఈ కొత్త ఫీచర్ ఫోన్‌లో 1000mAh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు AI Battery Optimization, Super Battery Mode సపోర్ట్ ఇచ్చారు. ఈ టెక్నాలజీ బ్యాటరీ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించి, ఛార్జింగ్ చాలా తక్కువగా ఉన్న సమయంలో కూడా ఫోన్‌ను ఎక్కువ సమయం పనిచేసేలా చూస్తుంది. దీనివల్ల ప్రయాణాలు చేసే వారికి బ్యాటరీ బ్యాకప్ సమస్యలు ఎదురవ్వవు.
Apple : భారత్‌లో ఆపిల్ సరికొత్త రికార్డు.. తొలిసారిగా 10 బిలియన్ డాలర్ల మార్కు దాటిన విక్రయాలు
ఎండ్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్
కనెక్టివిటీ, వినోదం కోసం ఈ ఫోన్‌లో బ్లూటూత్ సౌకర్యం కలదు. ముఖ్యంగా ఇందులో అందించిన వైర్‌లెస్ ఎఫ్‌ఎం రేడియోను ప్లగ్-ఇన్ ఇయర్ ఫోన్లు లేకుండానే నేరుగా వినవచ్చు. అంతేకాకుండా పాటలు లేదా ఎఫ్‌ఎమ్ ప్రోగ్రామ్‌లను రికార్డ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇక వ్యక్తిగత, వ్యాపార సంభాషణల సేఫ్టీ కోసం ఇందులో ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను కూడా చేర్చారు.
32GB ఎక్స్‌పాండబుల్ మెమొరీ, కింగ్ టాకర్ అసిస్టెంట్
ఐటెల్ ఏస్ 3 హీరా ఫోన్‌లో మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా మెమొరీని 32GB వరకు పెంచుకునే సదుపాయం ఉంది. మెమొరీ కార్డ్‌లోని పాటలను నేరుగా రింగ్‌టోన్‌గా సెట్ చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండే వ్యక్తులకు ఫోటోలు లేదా ఐకాన్‌లను కూడా జత చేయవచ్చు. ఇందులో ఇంగ్లీష్, హిందీ భాషలకు సపోర్టు ఇచ్చే కింగ్ టాకర్ వాయిస్ అసిస్టెంట్ ఇచ్చారు. ఫోన్‌లో గరిష్టంగా 200 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Flipkart Freedom Sale: Nothing Phone 4a Series, Reno 15 Series, More to Be Offered at a Discount
HP OmniPad 12 Goes on Sale in India With Snapdragon Chip, Detachable Keyboard