భారతదేశంలో రూ.25,000 లోపు బడ్జెట్‌లో సరికొత్త మిడ్-రేంజ్ 4G స్మార్ట్‌ఫోన్లు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య భారీగా లాంచ్ కానున్నాయి. చిప్స్ కొరత వల్లే కంపెనీల ఈ కొత్త నిర్ణయం.
Photo Credit: 4G Smartphones
4G Smartphones
Smartphones : భారతదేశంలో 5G టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ 5G మొబైళ్లను లాంచ్ చేయడంపైనే పూర్తిగా దృష్టి పెట్టాయి. కానీ, ఇప్పుడు మార్కెట్లో ఊహించని మార్పు చోటు చేసుకోబోతోంది. రాబోయే మూడు నెలల్లో అంటే జూలై, సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో భారతదేశంలో సరికొత్త 4G స్మార్ట్‌ఫోన్లు భారీ ఎత్తున విడుదల కానున్నాయి. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే దసరా, దీపావళి పండుగ సీజన్ కంటే ముందే ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి పలు ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు సిద్ధమవుతున్నాయి.
ధరల పెంపునకు 4G ఫోన్లే సమాధానం
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో ఉపయోగించే మెమరీ, స్టోరేజ్ కాంపోనెంట్స్ (DRAM, NAND స్టిక్స్) కొరత విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల ముడిసరుకుల ధరలు పెరిగి, అన్ని బ్రాండ్ల 5G స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరల భారాన్ని తగ్గించి, కస్టమర్లకు బడ్జెట్ ధరలోనే శక్తివంతమైన ఫోన్లను అందించడానికి కంపెనీలు మళ్లీ 4G ప్రాసెసర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి.
రూ.25,000 లోపు మిడ్-రేంజ్ సెగ్మెంట్
ప్రముఖ లీకర్ యోగేష్ బ్రార్ అందించిన సమాచారం ప్రకారం.. రాబోయే కొత్త 4G ఫోన్లు రూ.25,000 లోపు మిడ్-రేంజ్ ధరల పరిధిలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఇటీవలి కాలంలో విడుదలైన బడ్జెట్ 4G ఫోన్ల కంటే ఇవి కాస్త ఎక్కువ ధరను కలిగి ఉన్నప్పటికీ, ఫీచర్లు, కెమెరా, డిస్‌ప్లే క్వాలిటీ విషయంలో ఇవి 5G ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. అయితే, రాబోయే ఫోన్ల పేర్లను లేదా ఏ ఏ బ్రాండ్లు ఈ ఫోన్లను తెస్తున్నాయనే వివరాలను లీకర్ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.
WhatsApp : భారతీయుడి చేతికి వాట్సాప్ పగ్గాలు.. సరికొత్త గ్లోబల్ సీఈఓగా క్రెడ్ ఫౌండర్ కునాల్ షా
రెడ్‌మీ, పోకోల ముందడుగు
ఇటీవలే షియోమీ సబ్ బ్రాండ్లయిన రెడ్‌మీ, పోకోలు భారతదేశంలో తమ కొత్త బడ్జెట్ 4G ఫోన్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్‌లో రెడ్‌మీ A7 ప్రో 4G మోడల్‌ను (4GB + 64GB) రూ.11,499 ధరతో, రెడ్‌మీ A7 4G మోడల్‌ను రూ.10,499 ధరతో విడుదల చేశారు. అలాగే పోకో కంపెనీ కూడా తమ పోకో C81 మోడల్‌ను రూ.10,999కి, పోకో C81x మోడల్‌ను రూ.9,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి తెచ్చాయి. ఈ ఫోన్ల విజయవంతమైన సేల్స్ చూశాక, ఇతర కంపెనీలు కూడా మిడ్-రేంజ్ 4G ఫోన్లను తేవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
అద్భుతమైన ఫీచర్లతో పోటీ
కేవలం పాత టెక్నాలజీతో కాకుండా, కొత్తగా రాబోయే 4G ఫోన్లు అధునాతన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్‌తో రానున్నాయి. ఉదాహరణకు, ఇటీవల వచ్చిన రెడ్‌మీ A7 ప్రో 4G ఫోన్‌లో 6.9 ఇంచుల భారీ ఎల్‌సీడీ స్క్రీన్, యూనిసోక్ T7250 ప్రాసెసర్‌తో పాటు ఏకంగా 6,300mAh సామర్థ్యం గల పవర్‌ఫుల్ బ్యాటరీని అందించారు. అలాగే మార్కెట్లోకి టెక్నో క్యామన్ స్లిమ్ వంటి ఫోన్లు మీడియాటెక్ హీలియో G200 అల్టిమేట్ ప్రాసెసర్, 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో అలరిస్తున్నాయి. కాబట్టి, 5G నెట్‌వర్క్‌తో పెద్దగా పనిలేకుండా, తక్కువ ధరలో బెస్ట్ కెమెరా, పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్ ఆశించే వారికి ఈ అప్ కమింగ్ 4G ఫోన్లు ఒక అద్భుతమైన ఆప్షన్ కాబోతున్నాయి.
ప్రకటన
ప్రకటన
OnePlus Nord CE 6
Starts from ₹27,999
Vivo X300 FE
Starts from ₹79,999
HP 303D Laser Single Function Monochrome Printer
Starts from ₹13,999
HP MFP 323DNW Laser Multi Function Monochrome Printer
Starts from ₹21,999
HP 303DW Laser Single Function Wireless Monochrome Printer
Starts from ₹15,999
Canon imageClass LBP6030W Laser Single Function Monochrome Printer
Starts from ₹12,799
Netflix Announces Unhinged, an Immersive Horror Game Starring Zoë Kravitz That You Can Play on Your TV
Firefox Now Lets You Shake Your Android Phone to Summarise Websites