Ugreen HiTune S6 Pro: సాధారణ ఇయర్‌బడ్స్ లాగా చెవి లోపలికి పెట్టకుండా, చెవి అంచులకు క్లిప్ లాగా తగిలించుకునేలా వీటిని తయారు చేశారు.
Photo Credit: Ugreen HiTune S6 Pro
Ugreen HiTune S6 Pro
Ugreen HiTune S6 Pro: ప్రముఖ ఆడియో యాక్సెసరీస్ తయారీ సంస్థ యుగ్రీన్, మార్కెట్లోకి సరికొత్త వైర్లెస్ ఇయర్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. యుగ్రీన్ హైట్యూన్ ఎస్6 ప్రో పేరుతో వచ్చిన ఈ ఇయర్‌ఫోన్స్ అధునాతన క్లిప్-ఆన్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. సాధారణ ఇయర్‌బడ్స్ లాగా చెవి లోపలికి పెట్టకుండా, చెవి అంచులకు క్లిప్ లాగా తగిలించుకునేలా వీటిని తయారు చేశారు. దీనివల్ల ఎక్కువ సమయం వాడుకున్నా సరే చెవుల నొప్పి వచ్చే సమస్య ఉండదు. ధర విషయానికి వస్తే.. యుగ్రీన్ హైట్యూన్ ఎస్6 ప్రో ఇయర్‌ఫోన్స్ ను ప్రస్తుతానికి చైనా మార్కెట్లో విడుదల చేశారు. అక్కడ దీని ధరను 199 యువాన్లుగా నిర్ణయించారు. మన భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.2,700 గా ఉంటుంది. ఈ ఇయర్‌ఫోన్స్ కేవలం స్టార్‌లైట్ సిల్వర్ అనే ఒకే ఒక ప్రీమియం కలర్ ఆప్షన్లో లభిస్తాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు దీనిని యుగ్రీన్ అధికారిక వెబ్సైట్ నుండి ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఫ్లెక్సిబుల్ టైటానియం వైర్, వాటర్ రెసిస్టెన్స్..
ఈ ఇయర్‌ఫోన్స్ తయారీలో 0.6mm మెమరీ టైటానియం వైర్‌ను ఉపయోగించారు. దీనివల్ల ఇయర్‌ఫోన్స్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటూనే, మన చెవి షేప్‌కి తగ్గట్టుగా గట్టి పట్టును ఇస్తాయి. కాబట్టి వాకింగ్, రన్నింగ్ లేదా వర్కౌట్స్ చేసే సమయంలో ఇవి చెవుల నుంచి అస్సలు జారిపడిపోవు. అంతేకాకుండా చెమట, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం దీనికి IPX5 రేటింగ్ గల వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందించింది.
సౌండ్ లీకేజ్ ఉండదు.. క్వాలిటీ ఆడియో ఎఫెక్ట్స్..
ఆడియో క్వాలిటీ కోసం యుగ్రీన్ హైట్యూన్ ఎస్6 ప్రో లో 12mm డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. ఇవి AAC, SBC ఆడియో కోడెక్‌లను సపోర్ట్ చేస్తాయి. ఇందులో ఇన్-బిల్ట్‌గా స్పెషియల్ ఆడియో ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ఇయర్‌ఫోన్స్ డైరెక్షనల్ సౌండ్ ట్రాన్స్మిషన్ మోడ్‌తో పనిచేస్తాయి. దీనివల్ల మనం వినే సౌండ్ లేదా పాటలు పక్కన ఉన్న వారికి అస్సలు వినిపించవు. తద్వారా యూజర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు.
Lenovo : ఒక్క హెడ్‌ఫోన్.. నాలుగు కనెక్షన్లు.. మొబైల్, పిసి, టాబ్లెట్లకు ఈజీగా కనెక్ట్ అయ్యే లెనోవో అరోరా
బ్లూటూత్ 6.0, ఉచిత ఏఐ అసిస్టెంట్..
కనెక్టివిటీ పరంగా ఈ ఇయర్‌ఫోన్స్ లో అత్యంత లేటెస్ట్ టెక్నాలజీ అయిన బ్లూటూత్ 6.0 సపోర్ట్‌ను ఇచ్చారు. ఇది 10 మీటర్ల రేంజ్ పరిధిలో ఎలాంటి ఆడియో డ్రాప్స్ లేకుండా చాలా ఫాస్ట్‌గా స్మార్ట్ఫోన్లకు కనెక్ట్ అవుతుంది. ఈ డివైజ్ మరో సరికొత్త హైలైట్ ఏంటంటే.. కంపెనీ దీనితో పాటు లైఫ్‌టైమ్ ఫ్రీ ఏఐ అసిస్టెంట్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. దీని సహాయంతో వాయిస్ కమాండ్స్ ద్వారా ఇయర్‌ఫోన్స్‌ను చాలా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.
ఏకంగా 48 గంటల భారీ బ్యాట్రీ బ్యాకప్..
బ్యాట్రీ పరంగా యుగ్రీన్ హైట్యూన్ ఎస్6 ప్రో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇయర్‌ఫోన్స్ విడిగా సింగిల్ ఛార్జ్‌పై 9.5 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. అదే దీని ఛార్జింగ్ కేస్ బ్యాట్రీని కూడా కలుపుకుంటే.. మొత్తంగా 48 గంటల పాటు సుదీర్ఘమైన బ్యాట్రీ బ్యాకప్ లభిస్తుంది. కేస్‌లో 580mAh పవర్ఫుల్ బ్యాట్రీని ఇచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సి పోర్ట్ సపోర్ట్ ఉంది. ఈ ఇయర్‌ఫోన్స్ కేస్ పూర్తిగా ఫుల్ ఛార్జ్ అవ్వడానికి కేవలం 1.5 గంటల సమయం మాత్రమే పడుతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Reddit to Require Users to Log in to Browse Platform, Testing to Begin Soon
Samsung Galaxy Fit 4 Features Allegedly Revealed Through Companion App Teardown