Mobile Comparison : టెక్నో పోవా 8 వర్సెస్ వీవో T5 ప్రో వర్సెస్ రియల్‌మి 15 ప్రో.. రూ.30 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?

టెక్నో పోవా 8 ప్రారంభ వేరియంట్ (6GB+128GB) ధర రూ.29,999 కాగా, 8GB+128GB మోడల్ ధర రూ.31,999 గా ఉంది.

Mobile Comparison : టెక్నో పోవా 8 వర్సెస్ వీవో T5 ప్రో వర్సెస్ రియల్‌మి 15 ప్రో.. రూ.30 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Photo Credit: Tecno Pova 8 vs Vivo T5 Pro 5G vs Realme 15 Pro 5G

Tecno Pova 8 vs Vivo T5 Pro 5G vs Realme 15 Pro 5G

ముఖ్యాంశాలు
  • భారీ బ్యాటరీలతో మార్కెట్లోకి వచ్చిన మొబైల్స్
  • రియల్‌మిలో 6500 నిట్స్ బ్రైట్‌నెస్
  • వీవోలో పవర్‌ఫుల్ కెమెరా.. టెక్నోలో ఏకంగా 8000mAh బ్యాటరీ!
ప్రకటన

Mobile Comparison : భారతీయ ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా టెక్నో కంపెనీ తమ సరికొత్త పవర్‌ఫుల్ మోడల్ టెక్నో పోవా 8ను లాంచ్ చేయడంతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాపులర్ ఫోన్లయిన వీవో T5 ప్రో 5G, రియల్‌మి 15 ప్రో 5Gలతో ఈ ఫోన్ నేరుగా తలపడుతోంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు కూడా విభిన్నమైన ఫీచర్లు, వినూత్నమైన డిజైన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

మొదటగా ధరల విషయానికి వస్తే.. టెక్నో పోవా 8 ప్రారంభ వేరియంట్ (6GB+128GB) ధర రూ.29,999 కాగా, 8GB+128GB మోడల్ ధర రూ.31,999 గా ఉంది. వీవో T5 ప్రో 5G విషయానికి వస్తే 8GB+128GB మోడల్ ధర రూ.32,999, 8GB+256GB మోడల్ ధర రూ.36,999గా నిర్ణయించారు. కాగా రియల్‌మి 15 ప్రో 5G లో కస్టమర్లకు ఎక్కువ స్టోరేజ్ లభిస్తుంది, దీని 8GB+256GB మోడల్ ధర రూ.30,999, టాప్-ఎండ్ 12GB+256GB మోడల్ ధర రూ.32,999గా ఉంది. బడ్జెట్, ఎక్కువ స్టోరేజ్ పరంగా రియల్‌మి కాస్త లాభదాయకంగా కనిపిస్తోంది.

డిస్‌ప్లే విభాగంలో మూడు కంపెనీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. టెక్నో పోవా 8 లో 144Hz రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్న 6.76 ఇంచుల ఫుల్ HD+ IPS డిస్‌ప్లే ఇచ్చారు. వీవో T5 ప్రో లో 144Hz రిఫ్రెష్ రేట్ , 1600 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగిన 6.83 ఇంచుల అమోలెడ్ స్క్రీన్‌ను అమర్చారు. అయితే అందరికంటే భిన్నంగా రియల్‌మి 15 ప్రో 5G లో 6.8 ఇంచుల ఫుల్ HD+ 4D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది ఏకంగా 144Hz రిఫ్రెష్ రేట్, రికార్డు స్థాయి 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ క్లియర్ గా కనిపించడంలో రియల్‌మి టాప్ అని చెప్పొచ్చు.

స్పీడ్ మరియు పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్లలో పవర్‌ఫుల్ చిప్‌సెట్లను వాడారు. టెక్నో పోవా 8 లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను అమర్చారు. కాగా వీవో T5 ప్రో 5G క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రియల్‌మి 15 ప్రో 5G లో ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. టెక్నో, వీవో ఫోన్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఓఎస్‌పై నడుస్తుండగా, రియల్‌మి ఫోన్ మాత్రం ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి యూఐ 6.0 పై పనిచేస్తుంది.

WhatsApp : భారతీయుడి చేతికి వాట్సాప్ పగ్గాలు.. సరికొత్త గ్లోబల్ సీఈఓగా క్రెడ్ ఫౌండర్ కునాల్ షా

ఫొటోగ్రఫీ లవర్స్ కోసం రియల్‌మి, వీవోలు అదిరిపోయే కెమెరాలను జోడించాయి. టెక్నో పోవా 8 లో కేవలం 50MP ప్రైమరీ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా మాత్రమే ఉన్నాయి. వీవో T5 ప్రో లో OIS సపోర్ట్ ఉన్న 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32MP కెమెరా ఇచ్చారు. కానీ కెమెరా రేసులో రియల్‌మి చాలా ముందుకు వెళ్ళింది. రియల్‌మి 15 ప్రో లో వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరాతో పాటు అదనంగా మరో 50MP ఆల్ట్రావైడ్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం కూడా ఏకంగా 50MP ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం.

ఈ మూడు ఫోన్ల అతిపెద్ద హైలైట్ వాటి బ్యాటరీ సామర్థ్యమే అని చెప్పాలి. సాధారణ ఫోన్లలా కాకుండా వీటిలో పవర్‌హౌస్ లాంటి బ్యాటరీలను అందించారు. రియల్‌మి 15 ప్రో 5G లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న 7000mAh బ్యాటరీని ఇచ్చారు. టెక్నో పోవా 8 లో 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో ఏకంగా 8000mAh బ్యాటరీని చేర్చారు. వీటన్నింటికంటే ఒకడుగు ముందుకు వేసి, వీవో T5 ప్రో 5G లో 90W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే భారీ 9020mAh బ్యాటరీని అందించడం విశేషం. బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా వీవో అందరికంటే చాలా ముందు వరుసలో నిలిచింది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Ai+ Nova : భారత మార్కెట్లోకి Ai+ నుంచి రెండు సరికొత్త 5G ఫోన్లు.. తక్కువ ధరలోనే నోవా సిరీస్ హల్చల్
  2. Mobile Comparison : టెక్నో పోవా 8 వర్సెస్ వీవో T5 ప్రో వర్సెస్ రియల్‌మి 15 ప్రో.. రూ.30 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?
  3. Coolpad : మార్కెట్లోకి కూల్‌ప్యాడ్ కొత్త బడ్జెట్ ఫోన్.. ఐఫోన్ లాంటి అదిరిపోయే డిజైన్‌తో కూల్ 80 లాంచ్
  4. Magnetic Cooling : ఇకపై గ్యాస్ అక్కర్లేదు.. కంప్రెసర్ అవసరం లేదు.. అయస్కాంతంతో పనిచేసే ఏసీలు, ఫ్రిజ్‌లు
  5. Smartphones : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రివర్స్ ట్రెండ్.. సరికొత్త మిడ్-రేంజ్ 4G ఫోన్ల రీ-ఎంట్రీ
  6. Kunal Shah : ఫిలాసఫీ స్టూడెంట్ నుంచి వాట్సాప్ హెడ్ వరకు.. అసలు ఎవరీ కునాల్ షా ?
  7. WhatsApp : భారతీయుడి చేతికి వాట్సాప్ పగ్గాలు.. సరికొత్త గ్లోబల్ సీఈఓగా క్రెడ్ ఫౌండర్ కునాల్ షా
  8. Emergency Alert : తప్పిపోయిన పిల్లలు, వృద్ధుల సమాచారం క్షణాల్లో మీ మొబైల్‌కు.. ఫోటోలతో సహా రానున్న మెసేజ్‌లు
  9. Samsung Galaxy S26 Ultra 5g: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్.. ఏకంగా రూ.25,000 తగ్గిన గెలాక్సీ S26 అల్ట్రా ధర
  10. Ugreen HiTune S6 Pro: చెవుల నుంచి అస్సలు జారిపోవు..48 గంటల బ్యాట్రీ లైఫ్‌తో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్!
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »