భారతదేశపు ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌లో ఎన్‌డీఎంఏ కీలక మార్పులు చేస్తోంది. ఇకపై తప్పిపోయిన వ్యక్తులను వెతకడానికి, నేరగాళ్లను పట్టుకోవడానికి ఈ మొబైల్ అలర్ట్ సహాయపడుతుంది.
Photo Credit: Emergency Alert
Emergency Alert
Emergency Alert : భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ గత కొంతకాలంగా ఎమర్జెన్సీ అలర్ట్ - సివియర్ అనే మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. పెద్ద శబ్దంతో ఫోన్ స్క్రీన్ మొత్తం ఆక్రమించే ఈ మెసేజ్‌ల వల్ల ప్రజలు తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే అప్రమత్తం అవుతున్నారు. అయితే, ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) ఈ మొబైల్ ఫోన్ బ్రాడ్‌కాస్ట్ ఎర్లీ వార్నింగ్ మెసేజ్ సిస్టమ్‌ను కేవలం విపత్తులకే పరిమితం చేయకుండా.. సమాజ రక్షణ కోసం కూడా ఉపయోగించాలని ఒక భారీ ప్లాన్ సిద్ధం చేసింది.
నవభారత్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఎన్‌డీఎంఏ తమ అలర్ట్ సిస్టమ్‌లో ఒక అద్భుతమైన ఫీచర్‌ను చేర్చబోతోంది. ఎవరైనా చిన్న పిల్లలు, మానసిక స్థితి సరిగ్గా లేని వృద్ధులు లేదా ఇతరులు తప్పిపోతే వారిని వెతకడానికి ఈ సిస్టమ్‌ను వాడుకుంటారు. ఏ ప్రాంతంలోనైనా ఒక వ్యక్తి తప్పిపోయినట్లు కేసు నమోదైతే.. ఆ చోటుకు కొన్ని కిలోమీటర్ల పరిధిలోని ప్రజల మొబైల్ ఫోన్లకు సదరు వ్యక్తి ఫోటో, వివరాలతో కూడిన ఎమర్జెన్సీ మెసేజ్ వెంటనే వెళ్తుంది. దీనివల్ల స్థానిక ప్రజలు వెంటనే అలర్ట్ అయి, ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించే అవకాశం ఉంటుంది.
ఈ సరికొత్త ఫీచర్ కేవలం మిస్సింగ్ కేసులకే కాకుండా.. దేశంలో శాంతిభద్రతలను కాపాడటంలో, నేరాలను అదుపు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించనుంది. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు, కరుడుగట్టిన నేరగాళ్లు లేదా ప్రమాదకరమైన ఉగ్రవాదులు ఏదైనా ప్రాంతంలో నక్కినట్లు సమాచారం ఉంటే.. వారి ఫోటోలను కూడా ఈ అలర్ట్ సిస్టమ్ ద్వారా ఆ పరిసర ప్రాంతాల ప్రజల మొబైల్ స్క్రీన్లపై ప్రత్యక్షమయ్యేలా చేస్తారు. దీనివల్ల ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటమే కాకుండా, నిందితులు సమాజంలో ఎక్కడా దాక్కోకుండా వెంటనే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉంటుంది.
సాధారణంగా దొంగలను లేదా తప్పిపోయిన వారిని వెతకడానికి పోలీసులు పోస్టర్లు వేయడం, పత్రికల్లో లేదా టీవీల్లో ప్రకటనలు ఇవ్వడం వంటి పాత పద్ధతులను వాడుతుంటారు. కానీ, ఈ డిజిటల్ అలర్ట్ సిస్టమ్ ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే లక్షలాది మంది ప్రజల చేతుల్లో ఉండే మొబైల్ ఫోన్లకు నేరుగా సమాచారం చేరుతుంది. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ వేగాన్ని అమాంతం పెంచుతుంది. అయితే, ఈ సరికొత్త, ఉపయోగకరమైన ఫీచర్లను మొబైల్ అలర్ట్ సిస్టమ్‌లో అధికారికంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తారనే దానిపై ఎన్‌డీఎంఏ నుంచి ఇంకా కచ్చితమైన తేదీ వెల్లడి కావాల్సి ఉంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999