మోటో G37, మోటో G37 పవర్. మే 19వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్లు భారత మార్కెట్లో అడుగుపెట్టబోతున్నాయి.
Photo Credit: Motorola
Moto G37 is confirmed to include a 5,200mAh battery
Moto G37 Power: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేస్తున్న మోటోరోలా ఇండియాలో మరో రెండు అదిరిపోయే మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అవే మోటో G37, మోటో G37 పవర్. మే 19వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్లు భారత మార్కెట్లో అడుగుపెట్టబోతున్నాయి. సోషల్ మీడియా వేదికగా మోటోరోలా ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్లు కేవలం ఫీచర్లలో మాత్రమే కాదు, పవర్‌ఫుల్ బ్యాటరీతో కూడా కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇవి విక్రయానికి రానున్నాయి.
సాధారణంగా గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన ఫోన్లు అవే ఫీచర్లతో ఇండియాకు వస్తుంటాయి. కానీ మోటోరోలా ఈసారి ఇండియన్ యూజర్ల కోసం ఒక ప్రత్యేక అప్‌డేట్ ఇచ్చింది. ఐరోపా మార్కెట్‌లో ఈ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రాగా, ఇండియాలో మాత్రం అంతకంటే పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో విడుదల కాబోతున్నాయి. దీనివల్ల గేమింగ్, మల్టీ టాస్కింగ్ చాలా స్మూత్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
మోటో G37 పవర్ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీ. ఏకంగా 7,000mAh బ్యాటరీని ఇందులో అందించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే వరుసగా మూడు రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఇక మోటో G37 మోడల్ విషయానికి వస్తే, ఇందులో 5,200mAh బ్యాటరీని అమర్చారు. ఎక్కువ సేపు ఫోన్ వాడే వారికి, ప్రయాణాలు చేసే వారికి ఈ ఫోన్లు ఒక వరం లాంటివి.
ఈ రెండు ఫోన్లు కూడా 6.67-అంగుళాల HD+ LCD ప్యానెల్‌తో రాబోతున్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల వీడియోలు చూస్తున్నప్పుడు లేదా స్క్రోల్ చేస్తున్నప్పుడు అనుభూతి చాలా బాగుంటుంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని వాడారు. ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను క్వాడ్-పిక్సెల్ టెక్నాలజీతో అందించారు. దీనివల్ల తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోలు వస్తాయి.
మోటో G37 సిరీస్ ఫోన్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16తో పనిచేస్తాయి. ఇందులో 12GB వరకు ర్యామ్ ఆప్షన్లు ఉండబోతున్నాయి. మ్యూజిక్ ప్రియుల కోసం డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియోతో కూడిన స్టీరియో స్పీకర్లను ఇచ్చారు. వీటన్నింటికీ మించి, ఈ ఫోన్లు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కలిగి ఉన్నాయి. అంటే ఈ ఫోన్లు చాలా ధృడంగా ఉండి, కింద పడినా లేదా చిన్నపాటి ప్రమాదాలు జరిగినా తట్టుకోగలవు.
యూరప్ మార్కెట్‌లో మోటో G37 పవర్ సుమారు రూ.31,000కు, మోటో G37 సుమారు రూ.27,000కు విడుదలయ్యాయి. అయితే భారత మార్కెట్లో పోటీని దృష్టిలో ఉంచుకుని మోటోరోలా వీటిని కొంత తక్కువ ధరకే లేదా అదే శ్రేణిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. మే 19న లాంచ్ రోజున దీని పూర్తి ధర, ఆఫర్ల వివరాలు వెల్లడి కానున్నాయి.
ప్రకటన
ప్రకటన