Best Phone Under Rs.30,000: రూ.30 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్? మోటో G77 పవర్, వన్‌ప్లస్ నార్డ్, ఐకూ Z10R ల మధ్య అసలైన ఫైట్!

Moto G77 Power Vs OnePlus Nord CE 6 Lite vs iQOO Z10R 5G: Moto G77 Power ఫోన్ 6.72 ఇంచుల Full HD+ LCD స్క్రీన్‌తో వస్తుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 1,050 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

Best Phone Under Rs.30,000: రూ.30 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్? మోటో G77 పవర్, వన్‌ప్లస్ నార్డ్, ఐకూ Z10R ల మధ్య అసలైన ఫైట్!

Moto G77 Power, OnePlus Nord CE 6 Lite iQOO Z10R 5G का कंपैरिजन

ముఖ్యాంశాలు
  • మోటో G77 పవర్, వన్‌ప్లస్ నార్డ్, ఐకూ Z10R ల మధ్య అసలైన ఫైట్
  • 144Hz రీఫ్రెష్ రేట్‌తో వన్‌ప్లస్ నార్డ్ సీ 6 లైట్ గట్టి పోటీ
  • బ్యాటరీ పవర్‌లో మోటో, వన్‌ప్లస్ హవా
ప్రకటన

Moto G77 Power Vs OnePlus Nord CE 6 Lite vs iQOO Z10R 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ.30,000 లోపు బడ్జెట్ సెగ్మెంట్‌కు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ ధర పరిధిలో ఎన్నో రకాల బ్రాండెడ్ ఫోన్లు పోటీ పడుతున్నాయి. ఇటీవల మోటోరోలా కంపెనీ విడుదల చేసిన  Moto G77 Power భారీ బ్యాటరీ ఫీచర్‌తో ఈ కేటగిరీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే మార్కెట్లో దీనికి గట్టి పోటీ ఇస్తూ అప్పటికే వన్‌ప్లస్ నుంచి OnePlus Nord CE 6 Lite, అలాగే ఐకూ బ్రాండ్ నుంచి iQOO Z10R 5G మోడళ్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. వన్‌ప్లస్ తన పవర్‌ఫుల్ అపెక్స్ చిప్‌సెట్‌తో దూసుకుపోతుంటే, ఐకూ ఫోన్ ఆల్‌రౌండర్ ఫీచర్లతో నిలిచింది. ఈ నేపథ్యంలో కొత్త ఫోన్ కొనాలనుకునే వారి కోసం ఈ మూడు పాపులర్ ఫోన్ల మధ్య ఉన్న స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధరల తేడాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

డిస్‌ప్లే, స్క్రీన్ క్వాలిటీ..

స్క్రీన్ విషయానికి వస్తే ఈ మూడింటిలో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. Moto G77 Power ఫోన్ 6.72 ఇంచుల Full HD+ LCD స్క్రీన్‌తో వస్తుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 1,050 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇక OnePlus Nord CE 6 Lite లో కూడా అదే 6.72 ఇంచుల Full HD+ LCD స్క్రీన్ ఉన్నప్పటికీ, ఇది ఏకంగా 144Hz హై-రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీని బ్రైట్‌నెస్ 680 నిట్స్ మాత్రమే. వీటన్నింటికంటే భిన్నంగా iQOO Z10R 5G లో ప్రీమియం లుక్ ఇచ్చే 6.77 ఇంచుల Full HD AMOLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, ఏకంగా 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇండోర్, అవుట్‌డోర్ లూకింగ్ పరంగా ఐకూ స్క్రీన్ మిగిలిన రెండింటికంటే చాలా ప్రకాశవంతంగా, లగ్జరీగా కనిపిస్తుంది.

చిప్‌సెట్, ఆపరేటింగ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్..

పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, Moto G77 Powerలో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అదే సమయంలో వన్‌ప్లస్ నార్డ్, ఐకూ Z10R ఫోన్లు అంతకంటే మెరుగైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. అయితే వన్‌ప్లస్ ఫోన్‌లో ఈ ప్రాసెసర్‌కు చెందిన హై-ఎండ్  అపెక్స్ వెర్షన్‌ను చేర్చడం విశేషం. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, మోటో, వన్‌ప్లస్ ఫోన్లు రెండు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఓఎస్‌తో మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఐకూ స్మార్ట్‌ఫోన్ మాత్రం కొంచెం పాతదైన ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 15తో రన్ అవుతుంది.

కెమెరా సెటప్..

ఫొటోగ్రఫీ పరంగా మూడు ఫోన్లలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరానే ఉన్నప్పటికీ సెన్సార్లలో మార్పులు ఉన్నాయి. Moto G77 Power వెనుక క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ ఉన్న 50MP మెయిన్ కెమెరా,  8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. OnePlus Nord CE 6 Lite లో ఈఐఎస్ సపోర్ట్ ఉన్న 50MP కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ కెమెరా ఇచ్చారు. అలాగే iQOO Z10R 5G లో 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP డెప్త్ కెమెరా అమర్చారు. ఇక సెల్ఫీల విషయానికి వస్తే మోటో, ఐకూ ఫోన్లు రెండు కూడా 32MP ఫ్రంట్ కెమెరాతో అద్భుతమైన క్వాలిటీ ఇస్తాయి. ఈ విషయంలో వన్‌ప్లస్ ఫోన్ కేవలం 8MP సెల్ఫీ కెమెరాతో చాలా వెనుకబడి ఉందని చెప్పాలి.

Moto G77 Power : భారత మార్కెట్లోకి మోటో కొత్త పవర్‌హౌస్.. నేటి నుంచే Moto G77 Power సేల్స్ షురూ

కనెక్టివిటీ, బాడీ డిజైన్, వాటర్ ప్రొటెక్షన్ రేటింగ్స్..

కనెక్టివిటీ ఫీచర్ల పరంగా ఈ మూడు ఫోన్లలోనూ 5G, 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి అన్ని సదుపాయాలు సమానంగా ఉన్నాయి. అయితే ఫోన్ల బరువు, మందం విషయానికొస్తే ఐకూ ఫోన్ కేవలం 7.39 mm మందం, 183.5 గ్రాముల బరువుతో చాలా స్లిమ్‌గా, లైట్‌వైట్‌గా ఉంటుంది. వన్‌ప్లస్ ఫోన్ 8.5 mm మందం, 208 గ్రాముల బరువు ఉంటుంది. భారీ బ్యాటరీ ఉన్న మోటో ఫోన్ 8.89 mm మందంతో పాటు 215 గ్రాముల బరువుతో కాస్త బరువుగా అనిపిస్తుంది. దుమ్ము, నీటి రక్షణ కోసం మోటో, వన్‌ప్లస్ ఫోన్లకు IP64 రేటింగ్ ఉండగా.. ఐకూ Z10R ఫోన్‌కు అత్యుత్తమమైన IP68/IP69 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

బ్యాటరీ పవర్, ఇండియాలో వేరియంట్ల వారీగా ధరల వివరాలు..

బ్యాటరీ లైఫ్ విషయంలో మోటో, వన్‌ప్లస్ ఫోన్లు రికార్డు సృష్టించాయి. Moto G77 Power లో 30W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 7,000mAh బ్యాటరీ (6W రివర్స్ చార్జింగ్ కూడా ఉంది) ఉండగా.. OnePlus Nord CE 6 Lite లో 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 7000mAh బ్యాటరీని ఇచ్చారు. ఐకూ ఫోన్‌లో మాత్రం కొంచెం తక్కువగా 44W చార్జింగ్ సపోర్ట్‌తో 5700mAh బ్యాటరీ వస్తుంది.

ధరల వివరాలు ఇలా ఉన్నాయి..

* Moto G77 Power: 8GB+128GB వేరియంట్ ధర రూ. 25,999.
*OnePlus Nord CE 6 Lite: 6GB+128GB ధర రూ. 25,999, 8GB+128GB ధర రూ. 27,999.
*iQOO Z10R 5G: 8GB+128GB ధర రూ. 22,999, అలాగే 8GB+256GB ధర రూ. 24,999 కాగా.. టాప్ ఎండ్ 12GB+256GB వేరియంట్ ధర రూ. 26,999 గా ఉంది.
భారీ బ్యాటరీ కావాలనుకునే వారికి మోటో, వన్‌ప్లస్ బెస్ట్ ఆప్షన్ కాగా.. మంచి డిస్‌ప్లే, తక్కువ బరువు, స్లిమ్ లుక్ కోరుకునే వారికి ఐకూ ఫోన్ మంచి ఛాయిస్ అవుతుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »