Photo Credit: Motorola
ఇటీవలే Motorola నుంచి Razr 50 పేరుతో సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా కంపెనీ Motorola Razr 50s ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో కనిపించాయి. దీని ప్రాసెసర్, RAMతోపాటు మరిన్ని వివరాలు బయటకొస్తున్నాయి. అలాంటి నివేదికల ఆధారంగా 8GB RAM వేరియంట్ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ని కలిగి ఉన్నట్లు సూచిస్తున్నాయి. ముఖ్యంగా, Motorola Razr 50s కూడా ఇటీవల HDR10+ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ సరికొత్త మోడల్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..
91Mobiles నివేదిక ప్రకారం.. Motorola Razr 50s గీక్‌బెంచ్ 6 క్రాస్-ప్లాట్‌ఫాం బెంచ్‌మార్క్ సైట్‌లో గుర్తించబడింది. ఇది ARMv8 ఆర్కిటెక్చర్‌తో aito గా పిలువబడే మదర్‌బోర్డ్‌తో జత చేయబడి ఉంది. అంతేకాదు, పరిశీలన ఆధారంగా దీని ప్రాసెసర్ ఎనిమిది కోర్‌లను కలిగి ఉంటుందని నిర్థారించారు. అందులో నాలుగు పర్ఫామెన్స్ కోర్‌లు 2.50GHz వద్ద, మరో నాలుగు ఎఫిసెన్సీ కోర్‌లు 2.0GHz వద్ద రూపొందించబడ్డాయి. అయితే, దీని ప్రాసెసర్ బహిర్గతం కానప్పటికీ, ఇది MediaTek డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ అని అంచనా వేస్తున్నారు. Razr 50కి కూడా దీనినే వినియోగించడం ద్వారా ఈ ప్రాసెసర్‌పైనే అందరి దృష్టి ఉంది.
ఇది ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతూ ఉంటుంది. అలాగే, 7.28GB RAMతో వస్తుంది. నివేదిక ప్రకారం, Motorola Razr 50s గీక్‌బెంచ్ సింగిల్-కోర్, మల్టీ-కోర్ పరీక్షలలో వరుసగా 1,040, 3,003 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, Gadgets 360 ద్వారా నిర్వహించబడిన పరీక్షలలో 1,926, 4,950 పాయింట్‌లను స్కోర్ చేసిన Razr 50 Ultra యొక్క Geekbench స్కోర్‌లను తాజా సంఖ్యలు తక్కువగా చూపిస్తున్నాయి. అయినప్పటికీ, గీక్‌బెంచ్‌లో అదే విధంగా స్కోర్ చేసిన స్టాండర్డ్ Razr 50తో పోల్చితే అది పెద్ద విషయం కాదు. ఈ పరీక్షల ఫలితాలు సైతం దానినే నిర్థారిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
అయితే, Gadgets 360 సిబ్బంది గీక్‌బెంచ్ 6.3.0 స్కోర్‌లను ధృవీకరించలేకపోయినప్పటికీ, వారు హ్యాండ్‌సెట్ యొక్క గీక్‌బెంచ్ AI స్కోర్‌లను నిర్థారించగలిగారు. ఈ పరీక్షలో Motorola Razr 50s సింగిల్ ప్రిసిషన్ టెస్ట్‌లో 889 స్కోర్‌ను కలిగి ఉంది. అంతేకాదు, ఖచ్చితత్వం కోసం పలుమార్లు చేసిన పరీక్షలలో దీని పరిమాణాత్మక స్కోర్లు వరుసగా 887, 1,895 పాయింట్లుగా ఉన్నాయి. అయితే, ఈ మోడల్ లాంచింగ్ సమయానికి Motorola Razr 50, Razr 50 Ultraల మాదిరిగానే కంపెనీ ప్రధాన లైనప్ క్లామ్‌షెల్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో చేరవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో మొబైల్ మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న Motorola తాజా మోడల్‌ను లాంచ్ చేస్తే మాత్రం.. కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.
ప్రకటన
ప్రకటన