Photo Credit: Vivo
Vivo T4x 5G Vivo T3x 5G విజయవంతం అవుతుందని భావిస్తున్నారు (చిత్రం)
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో Vivo T4x 5G గతంలోనే కనిపించడంతోపాటు మన దేశంలో దీని లాంఛ్ త్వరలోనే ఉంటుందని సూచించింది. తాజాగా, ఒక నివేదిక ప్రకారం.. అంచనా వేసిన లాంచ్ టైమ్‌లైన్‌తోపాటు ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పలు కీలక స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. అందుబాటు ధర రేంజ్‌తోపాటు కలర్ ఆప్షన్‌లు, డిజైన్‌కు సంబంధించిన అంశాలు కూడా వెల్లడయ్యాయి. రాబోయే Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ గత ఏడాది ఏప్రిల్‌లో స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌తో దేశంలో విడుదలైన Vivo T3x 5Gకి కొనసాగింపుగా వస్తున్నట్లు చెబుతున్నారు.
తాజాగా, MySmartPrice నివేదిక ప్రకారం.. Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ మార్చి 2025లో భారత్‌లో లాంఛ్ అయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టమైంది. అయితే, దీనికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కాలేదు. ఇది గతంలో వచ్చిన మోడల్ మాదిరిగానే రూ. 15,000 లోపల ధర ఉంటుందని నివేదికలో వెల్లడైంది. ఈ ధరలో గత మోడల్ మన దేశంలో మంచి ఆదరణ పొందిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అలాగే, Vivo T4x 5G హ్యాండ్‌సెట్ 6,500mAh భారీ బ్యాటరీని కలిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది దీని విభాగంలో ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీగా చెప్పబడింది. ప్రస్తుతం ఉన్న Vivo T3x 5G స్మార్ట్ ఫోన్ 6000mAh బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అలాగే, ఈ ఫోన్ భారతదేశంలో ప్రోంటో పర్పుల్, మెరైన్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభించనున్నట్లు నివేదిక ద్వారా స్పష్టమైంది.
రాబోయే ఈ Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ డిజైన్‌లో డైనమిక్ లైట్ ఫీచర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, ఇది వేర్వేరు నోటిఫికేషన్‌లను సూచించేందుకు భిన్నంగా వెలుగుతుందని భావిస్తున్నారు. ఈ ఫీచర్ రాబోయే Vivo T4x ఫోన్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ గురించి ఇంకా ఏ ఇతర వివరాలు వెల్లడి కాలేదు. అయితే, రాబోయే మరి కొద్ది రోజుల్లోనే మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది.
మరీ ముఖ్యంగా, ఈ ఏడాది ప్రారంభంలో Vivo T3x 5G ధర తగ్గించబడింది. ఈ మోడల్ 4GB + 128GB, 6GB + 128GB, 8GB + 128GB వేరియంట్‌లు వరుసగా రూ. 12,499, రూ. 13,999, రూ. 15,499 ధరలకు లభిస్తున్నాయి. నిజానికి, ఈ ఫోన్ 4GB, 6GB, 8GB వేరియంట్ ప్రారంభ ధరలు వరుసగా రూ. 13,499, రూ. 14,999, రూ. 16,499గా ఉండేవి. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ క్రిమ్సన్ బ్లిస్, సెలెస్టియల్ గ్రీన్, సఫైర్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఈ మోడల్‌కు మంచి ఆధరణ లభించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
ప్రకటన
ప్రకటన