Photo Credit: Nothing
నథింగ్ ఫోన్ 3 2023 ఫోన్ 2కి సక్సెసర్ అని చెప్పబడింది
Nothing Phone 2కి కొనసాగింపుగా రాబోయే నెలల్లో సరి కొత్త స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేయనున్నట్లు పెద్ద ఎత్తున కంపెనీ ప్రచారం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఈ UK-ఆధారిత Original Equipment Manufacturer (OEM) తన సోషల్ మీడియా పేజీ ద్వారా రాబోయే ప్రొడక్ట్‌ను మరోసారి టీజ్ చేసింది. ఇది రాబోయే తదుపరి స్మార్ట్ ఫోన్ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో ట్రాన్సపరెంట్ డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ డిజైన్ ఇటీవల కాలంలో కంపెనీ నుంచి వస్తోన్న ఫోన్‌లకు తప్పనిసరి అనేలా వస్తోందనే చెప్పాలి.
Nothing కంపెనీ X (గతంలో ట్విట్టర్) వేదికగా ఇటీవల అనేక పోస్ట్‌ల ద్వారా WIP అనే టెక్స్ట్‌తో పాటు స్మార్ట్ ఫోలా కనిపించే చాలా రకాల డిజైన్ స్కెచ్‌లను షేర్ చేస్తూ వస్తోంది. అయితే, ఇది ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో ఉన్న పదానికి సంక్షిప్త రూపం కావచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. మొదటి స్కెచ్ పాక్షికంగా ట్రాన్సపరెంట్ బ్యాక్ ప్యానెల్‌తో స్క్రూలు అమర్చబడిన ఫోన్‌ను చూపిస్తోంది. దీనిపై కూడా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
ఈ వరుసలో మరో స్కెచ్‌లో Nothing Phone 2a మోడల్‌ల కెమెరా యూనిట్ మాదిరిగానే horizontal pill-shapedలో ఉన్న నిర్మాణంలో రెండు వృత్తాలు ఉంచబడ్డాయి. అంతే కాదు, ఈ భాగం రాబోయే ఫోన్ వెనుక కెమెరాలు కావచ్చునని ఇది స్పష్టంగా సూచిస్తోంది. అయితే, ఇందులో మొత్తం ప్రొడక్ట్ వెనుక కవర్‌ను చూపించడం లేదు. కాబట్టి, రాబోయే ప్రొడక్ట్ కంపెనీకి చెందిన సిగ్నేచర్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను పొందుతుందో లేదో అనే అంశంపై స్పష్టత రాలేదు.
ఆర్కనైన్ పోకీమాన్ ఇమేజ్ ఉపయోగించి కంపెనీ రాబోయే ప్రొడక్ట్‌కు చెందిన మరొక టీజర్‌ను విడుదల చేసిన ఒక రోజు తర్వాత ఈ డెవలప్‌మెంట్ కనిపించింది. అయితే, ఇందులో ఎలాంటి వివరణ లేనప్పటికీ, ఇది Nothing Phone 3 కోసం రూపొందించబడుతోన్న టీజర్‌గా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ఆర్కనైన్ అనే కోడ్‌నేమ్‌ను కలిగి ఉండవచ్చని గత నివేదికలను ధృవీకరిస్తోంది.
Nothing కంపెనీ CEO కార్ల్ పీ పంపినట్లు ఇటీవల లీక్ అయిన ఈమెయిల్‌లో 2025 కోసం Nothing ప్రణాళికల గురించిన కీలక సమాచం ప్రస్తావించబడింది. అలాగే, ఇందులో ల్యాండ్‌మార్క్ లాంచ్ కూడా ఉంది. అంతే కాకుండా, కంపెనీ రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ మారుపేరును కూడా ఇది ధృవీకరించింది. నిజానికి, దీనిని Nothing Phone 3 అని పిలుస్తున్నట్లు వెల్లడైంది. ఈ ప్రొడక్ట్ 2025 మొదటి త్రైమాసికంలో Nothing Phone 2 కొనసాగింపుగా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ AI-ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను అందించే దిశగా తొలి అడుగు అని, యూజర్ ఇంటర్‌ఫేస్ పరంగా విప్లవాత్మక ఆవిష్కరణల ద్వారా ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు.
ప్రకటన
ప్రకటన