తాజాగా, జులై 24న మరో రెండు కొత్త మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్‌లకు సంబంధించిన ఎలాంటి వివరాలను కూడా బహిర్గతం చేయలేదు.
Photo Credit: Xiaomi
Redmi Note 14 Pro 5G (చిత్రంలో) మరియు Pro+ వేరియంట్ ఇటీవల షాంపైన్ గోల్డ్ షేడ్‌లో ప్రారంభించబడ్డాయి
మన ఇండియాలో Redmi సంస్థ తమ మొదటి స్మార్ట్ ఫోన్‌ను 2014 జులైలో పరిచయం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకూ 11 సంవత్సరాలుగా సరికొత్త మొబైల్స్‌ను ఇండియన్ మార్కెట్‌లో లాంఛ్ చేస్తూ, తమ బ్రాండ్‌కు అంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకుంది. గత నెలలో సైతం నోట్ 14 Pro 5G, నోట్ 14 Pro+ 5G ఫోన్‌లను షాంపైన్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో విడుదల చేసింది. తాజాగా, జులై 24న మరో రెండు కొత్త మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్‌లకు సంబంధించిన ఎలాంటి వివరాలను కూడా బహిర్గతం చేయలేదు.X లో ఓ పోస్ట్ ద్వారాభారత్‌లో Redmi కంపెనీ మొదటిగా Mi 3 మోడల్‌ను జులై 22, 2014న యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాదితో ఈ సంస్థ ఇండియన్ మొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టి సరిగ్గా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని కంపెనీ X లో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ సంతోషకరమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా జులై 23న ఒకటి, 24న మరొకటి రెండు కొత్త హ్యండ్‌సెట్‌లను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ బ్రాండ్ నుంచి రాబోయే హ్యాండ్‌సెట్‌లకు సంబంధించిన ఫీచర్స్ కానీ, పేర్లను కానీ కంపెనీ ప్రకటించలేదు. అయితే, టీజర్‌లో కనిపిస్తున్నదానిని బట్టీ, ఓ మోడల్ వైట్ కలర్ ఫినిషింగ్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అలాగే, మరో మోడల్ ఫోన్ dual-tone burgundy కలర్ ఆప్షన్‌లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంతే కాదు, చూసేందుకు రెండు కూడా యూజర్స్‌ను ఆకట్టకునేలానే ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
గత నెలలోనే డిసెంబర్ 2024లో విడుదలైన బేస్ నోట్ 14 జాబితాలో నోట్ 14 Pro 5G, నోట్ 14 Pro+ 5G మొబైల్స్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లు షాంపైన్ గోల్డ్ షేడ్‌లో ఫాంటమ్ పర్పుల్, టైటాన్ బ్లాక్, స్పెక్టర్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అలాగే, వీటి కలర్ ఆప్షన్స్ ఆధారంగా కొనుగోలుదారు నుంచి మంచి స్పందన వస్తుందని ఈ బ్రాండ్ గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నోట్ 14 Pro 5G, నోట్ 14 Pro+ 5G స్మార్ట్ ఫోన్‌ల ధర 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ వరుసగా రూ. 23,999, రూ. 29,999గా కంపెనీ నిర్ణయించింది. గతంలో వచ్చిన బేస్ నోట్ 14 స్మార్ట్ ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17, 999గా ఉంది. ఈ మోడల్‌కు మార్కెట్‌లో మంచి ఆదరణ లభించింది. అంతే కాదు, తాజాగా వస్తున్న హ్యాండ్‌సెట్‌లు వీటి ధర ఆధారంగా సరికొత్త ఫీచర్స్‌ను అందించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన