OnePlus exit Rumors from Indian Maket: ఈ గ్లోబల్ ఎగ్జిట్ వార్తలపై వన్‌ప్లస్ సంస్థ తాజాగా స్పందించి భారత మార్కెట్ గురించి ఒక కీలక ప్రకటన జారీ చేసింది.
OnePlus
OnePlus exit Rumors from Indian Maket: గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన ప్రీమియం బ్రాండ్ వన్‌ప్లస్ గురించి గత కొన్ని రోజులుగా ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కంపెనీ యూరప్, అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు ప్రధాన మార్కెట్ల నుంచి తన వ్యాపారాన్ని పూర్తిగా సమేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన తాజా నివేదికల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో వన్‌ప్లస్ తన ఆపరేషన్లను క్లోజ్ చేయనుందనే ప్రచారం ఇప్పుడు దాదాపు నిజమయ్యేలా కనిపిస్తోంది. మొదట్లో ఈ జాబితాలో భారతదేశం పేరు కూడా బలంగా వినిపించడంతో దేశీయ మొబైల్ ప్రియుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
భారత్‌లో వ్యాపారం బంద్ కానుందా?
ఈ గ్లోబల్ ఎగ్జిట్ వార్తలపై వన్‌ప్లస్ సంస్థ తాజాగా స్పందించి భారత మార్కెట్ గురించి ఒక కీలక ప్రకటన జారీ చేసింది. దీంతో ఈ వార్తలకు బ్రేక్ పడటమే కాకుండా కథలో పెద్ద ట్విస్ట్ వచ్చింది. ప్రముఖ మీడియా సంస్థ డెక్కన్ హెరాల్డ్‌కు ఇచ్చిన అధికారిక ఇంటర్వ్యూలో కంపెనీ స్పష్టతనిస్తూ.. తాము భారతదేశంలో వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బంద్ చేయడం లేదని స్పష్టం చేసింది. మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా, ఇండియాలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఇయర్‌బడ్స్ యథావిధిగా విక్రయించబడతాయని, కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ తేల్చి చెప్పింది.
వన్‌ప్లస్, రియల్‌మీ బ్రాండ్లపై పడనున్న భారీ ప్రభావం
అసలు వన్‌ప్లస్ గ్లోబల్ మార్కెట్ల నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వస్తుందనే విషయానికి వస్తే.. వన్‌ప్లస్ బ్రాండ్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో సబ్సిడరీగా కొనసాగుతోంది. అలాగే రియల్‌మీ కూడా దీని యాజమాన్యం పరిధిలోనే ఉంది. ప్రస్తుతం ఒప్పో సంస్థ తన గ్లోబల్ బిజినెస్‌ను రీ-స్ట్రక్చర్ చేయడానికి పెద్ద ప్లాన్ చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే చైనా వెలుపల ఉన్న పలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వన్‌ప్లస్, రియల్‌మీ బ్రాండ్లను దశలవారీగా తొలగించాలని భావిస్తోంది. ఈ ప్రణాళిక గనుక పూర్తిగా అమలైతే, వచ్చే ఏడాది నాటికి పలు విదేశాల్లో వన్‌ప్లస్ డివైజ్‌ల అమ్మకాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. కానీ భారతదేశంలో మాత్రం ఆపరేషన్లు యథాతథంగా కొనసాగుతాయి.
Social Media : టీనేజర్ల రక్షణ కోసం బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై రాత్రి వేళల్లో కర్ఫ్యూ
ఆక్సిజన్ ఓఎస్‌కు చెల్లుచీటి?
వన్‌ప్లస్ గ్లోబల్ బిజినెస్ క్లోజ్ అవుతుందనే వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి పుకార్లు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అప్పట్లో కంపెనీ ఆ వార్తలను తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లలో వన్‌ప్లస్ తన బిజినెస్ స్ట్రాటజీని పూర్తిగా మార్చబోతోందని నిపుణులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే రాబోయే రోజుల్లో గ్లోబల్ మార్కెట్లో విడుదలయ్యే వన్‌ప్లస్ మొబైల్స్‌లో కంపెనీ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆక్సిజన్ ఓఎస్ స్థానంలో ఒప్పోకు చెందిన కలర్ ఓఎస్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు కొన్ని విశ్వసనీయ నివేదికలు వెల్లడించాయి.
యూరప్ దేశాల్లో ఇప్పటికే తగ్గిన ఉనికి
యూరప్‌లోని కొన్ని ప్రధాన దేశాలలో వన్‌ప్లస్ ఉనికి ఇప్పటికే క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఉదాహరణకు జర్మనీలోని వన్‌ప్లస్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌ను గమనిస్తే.. అక్కడ ప్రస్తుతం కేవలం వన్‌ప్లస్ 15ఆర్ మోడల్ మాత్రమే లిస్టింగ్ చేయబడి ఉంది. అదే సమయంలో మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న వన్‌ప్లస్ 15 బేస్ మోడల్ గానీ, నోర్డ్ సిరీస్ మొబైల్స్ గానీ అక్కడ అందుబాటులో లేవు. జర్మనీతో పాటు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, బెల్జియం, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, స్వీడన్, నార్వే వంటి దేశాల్లో కూడా వన్‌ప్లస్ తన స్మార్ట్‌ఫోన్ల మోడల్స్ లభ్యతను భారీగా తగ్గించేసింది. దీన్ని బట్టి చూస్తే అంతర్జాతీయంగా వన్‌ప్లస్ తన వ్యాపారాన్ని తగ్గించుకుంటున్నప్పటికీ, భారత్‌లో మాత్రం దూకుడు కొనసాగించనుంది.
ప్రకటన
ప్రకటన