Belkin Launching Premium 10K Power Bank: ఈ సరికొత్త బెల్కిన్ 10000mAh పవర్‌బ్యాంక్ పూర్తిగా USB-C కనెక్టివిటీపైనే పనిచేస్తుంది.
Photo Credit: m.sohu
Belkin BoostCharge Pro
Belkin launching 10K Power Banks: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బ్యాటరీ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ బెల్కిన్ మార్కెట్లోకి ఒక సరికొత్త పవర్‌బ్యాంక్‌ను లాంచ్ చేసింది. బెల్కిన్ బూస్ట్‌చార్జ్ ప్రో పవర్‌బ్యాంక్ 10K పేరుతో వచ్చిన ఈ డివైజ్ అద్భుతమైన ఫీచర్లతో టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ పవర్‌బ్యాంక్‌ను 10,000mAh భారీ బ్యాటరీ కెపాసిటీతో రూపొందించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం మొబైల్స్ చార్జ్ చేయడమే కాకుండా, ఇందులో అమర్చిన మోషన్ సెన్సార్ లైట్, డిజిటల్ డిస్‌ప్లే వంటి సరికొత్త ఫీచర్లు యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి.
45W సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్..
ఈ సరికొత్త బెల్కిన్ 10000mAh పవర్‌బ్యాంక్ పూర్తిగా USB-C కనెక్టివిటీపైనే పనిచేస్తుంది. వేరే డివైజ్‌లను చార్జ్ చేయాలన్నా లేదా ఈ పవర్‌బ్యాంక్‌ను చార్జ్ చేయాలన్నా టైప్-సి పోర్ట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. కస్టమర్ల సౌకర్యార్థం కంపెనీ ఇందులోనే ఒక ఇన్-బిల్ట్ USB-C కేబుల్‌ను కూడా అందించింది. ఈ కేబుల్ వాడనప్పుడు పవర్‌బ్యాంక్ సైడ్‌లోనే చక్కగా ఫిట్ అయిపోతుంది. ఈ కేబుల్, చార్జింగ్ పోర్ట్ రెండూ కూడా 45W హై-స్పీడ్ అవుట్‌పుట్‌ను సపోర్ట్ చేస్తాయి. దీనివల్ల మీ స్మార్ట్‌ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు చాలా వేగంగా చార్జ్ అవుతాయి.
Google Pixel 11 : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆగస్టు 12న గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్
చీకట్లో తోడుగా నిలిచే ఎమర్జెన్సీ లైట్..
ఈ పవర్‌బ్యాంక్‌లో అన్నింటికంటే హైలైట్ ఫీచర్ దానిలో ఉన్న పాపప్ ఎల్‌ఈడీ లైట్. ఇందులో అత్యాధునిక మోషన్ సెన్సార్‌ను అమర్చారు. అంటే ఈ పవర్‌బ్యాంక్ చుట్టుపక్కల ఏదైనా కదలిక లేదా హల్‌చల్ జరగ్గానే ఈ లైట్ ఆటోమేటిక్‌గా వెలుగుతుంది. చీకటి సమయంలో ఇదొక చక్కని ఎమర్జెన్సీ లైట్‌లా ఉపయోగపడుతుంది. ఈ లైటింగ్ కోసం విభిన్న మోడ్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ లైట్ బ్రైట్‌నెస్‌ను మనకు నచ్చినట్లు అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన టచ్ కంట్రోల్ ఫీచర్‌ను కూడా అందించారు.
ఒకేసారి రెండు డివైజ్‌లు చార్జ్ చేసుకునే సదుపాయం..
ఈ డివైజ్ స్టాండర్డ్ యూఎస్‌బీ పవర్ డెలివరీ, ప్రోగ్రామబుల్ పవర్ సప్లై ప్రోటోకాల్స్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో ఒకేసారి రెండు డివైజ్‌లను సులభంగా చార్జ్ చేసుకోవచ్చు. రెండు ఫోన్లను ఒకేసారి కనెక్ట్ చేసినప్పుడు, ప్రైమరీ పోర్ట్ నుంచి 30W, సెకండరీ పోర్ట్ నుంచి 15W అవుట్‌పుట్ లభిస్తుంది. పవర్‌బ్యాంక్ ముందు భాగంలో ఉన్న చిన్న డిజిటల్ డిస్‌ప్లేలో బ్యాటరీ ఎంత శాతం ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం 257 గ్రాముల బరువు, 118 x 60 x 32mm కొలతలతో చాలా స్లిమ్ అండ్ కాంపాక్ట్‌గా ఉంటుంది. అలాగే ఓవర్ హీటింగ్, ఓవర్ చార్జింగ్, ఓవర్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండేందుకు కంపెనీ ఇందులో అత్యాధునిక సేఫ్టీ స్టాండర్డ్స్ ఉపయోగించింది. ఈ ప్రీమియం పవర్‌బ్యాంక్ ధర 329 యువాన్లు (మన భారత కరెన్సీలో సుమారు రూ.4,600)గా ఉంది. ప్రస్తుతానికి ఇది బ్లూ, ఆరెంజ్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features