Oppo A7 Pro Max Features Leaked: మార్కెట్లోకి ఒప్పో A7 ప్రో మాక్స్ ఎంట్రీ.. 10,000mAh బ్యాటరీతో సరికొత్త రికార్డు

Oppo A7 Pro Max Features Leaked expected with 10,000mAh battery: ఒప్పో సంస్థకు చెందిన గ్రీన్ సిరీస్‎లో ఏకంగా 10,000 mAh సింగిల్-సెల్ భారీ బ్యాటరీతో రాబోతున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని లీకులు పేర్కొంటున్నాయి.

Oppo A7 Pro Max Features Leaked: మార్కెట్లోకి ఒప్పో A7 ప్రో మాక్స్ ఎంట్రీ.. 10,000mAh బ్యాటరీతో సరికొత్త రికార్డు

Oppo A6 Pro

ముఖ్యాంశాలు
  • మార్కెట్లోకి ఒప్పో A7 ప్రో మాక్స్ ఎంట్రీ
  • 10,000mAh బ్యాటరీతో సరికొత్త రికార్డు
  • 50MP సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో లీకైన ఫీచర్లు
ప్రకటన

Oppo A7 Pro Max Features Leaked, Expected with 10,000mAh battery: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన పాపులర్ 'A' సిరీస్‌లో మరొక పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఒప్పో A7 ప్రో మాక్స్ పేరుతో త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ కొత్త మోడల్‌కు సంబంధించి ప్రముఖ టిప్‌స్టర్  డిజిటల్ చాట్ స్టేషన్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వేబోలో కొన్ని కీలక ఫీచర్లను లీక్ చేశారు. ఈ ఫోన్ ప్రధానంగా భారీ బ్యాటరీ, ఆకట్టుకునే డిస్ప్లే, మెరుగైన ప్రాసెసర్‌తో రాబోతున్నట్లు సమాచారం.

10,000mAh భారీ బ్యాటరీ.. మైండ్ బ్లోయింగ్ డిస్ప్లే..

ఒప్పో సంస్థకు చెందిన గ్రీన్ సిరీస్‎లో ఏకంగా 10,000 mAh సింగిల్-సెల్ భారీ బ్యాటరీతో రాబోతున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని లీకులు పేర్కొంటున్నాయి. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించనున్నారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.78 ఇంచుల ఫ్లాట్ OLED డిస్ప్లేను అందించనున్నారు. ఇది 1.5K రెసొల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. దీనివల్ల వీడియోలు చూడటంతో పాటు గేమింగ్ అనుభవం కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది.

Motorola : జూలై 31న భారత్‌లోకి మోటో ప్యాడ్ 70 గ్రూవ్ ఎంట్రీ.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

ప్రాసెసర్ పవర్, కెమెరా విశేషాలు..

ఒప్పో A7 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో ప్రాసెసర్ పరంగా సరికొత్త స్నాప్‌డ్రాగన్ 4 Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ఒప్పో ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండనుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందరి వైపు ఏకంగా 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చడం విశేషం.

మునుపటి మోడల్ ఒప్పో A6 ప్రో ఫీచర్లు..

గత ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో విడుదలైన ఒప్పో A6 ప్రో ఫీచర్లను ఒకసారి పరిశీలిస్తే.. ఆ ఫోన్‌లో 6.57 ఇంచుల ఫుల్ HD+ LCD డిస్ప్లే (120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌) అందించారు. అందులో 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కెమెరా పరంగా 50MP ప్రైమరీ కెమెరా (10x డిజిటల్ జూమ్), 2MP మోనోక్రోమ్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అంతేకాకుండా ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 4300 sq mm థర్మల్ ఛాంబర్‌తో పాటు 7,000 mAh బ్యాటరీ (80W ఛార్జింగ్) వంటి ఫీచర్లు ఉండేవి. ఇప్పుడు దానికి అప్‌గ్రేడ్‌గా రాబోతున్న A7 ప్రో మాక్స్‌లో ఏకంగా 10,000 mAh బ్యాటరీని పరిచయం చేస్తుండటం విశేషం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »