Photo Credit: Oppo
Oppo Find N3 (చిత్రం) విప్పినప్పుడు 5.8mm మందం ఉంటుంది
చైనాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో Oppo Find N5 ఫోన్ లాంఛ్ కాబోతున్నట్లు స్పష్టమైంది. ఈ నెల మూడవ వారంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ ఈవెంట్ ఏ తేదీన జరుగుతుందనే విషయాన్ని Oppo ఇంకా ప్రకటించలేదు. బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే సన్నని ఫోల్డబుల్ ఫోన్‌గా వస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో దీనిని అందించవచ్చని భావిస్తున్నారు. Oppo Find N5 ఫోన్‌ను Oppo Find N3కి కొనసాగింపుగా Oppo వాచ్ X2 స్మార్ట్‌వాచ్‌తో పాటు కంపెనీ పరిచయం చేయనుంది.
ఇటీవల Weibo పోస్ట్‌లో Oppo Find N5 స్మార్ట్ ఫోన్ చైనాలో రెండు వారాల్లో లాంఛ్ అవుతుందని కంపెనీ తెలిపింది. అంటే, దీని అర్థం ఈ లాంఛ్ ఫిబ్రవరి మూడవ వారంలో 19వ తేదీ లేదా ఆ తర్వాత జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఖచ్చితమైన లాంఛ్ తేదీని కంపెనీ ప్రకటించకపోవడంతో, త్వరలో అధికారిక తేదీని వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు వారంతా భావిస్తున్నారు. చాలా రోజులుగా ఈ మోడల్‌పై మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. కంపెనీ తాజా ప్రకటనతో దీనిపై మార్కెట్‌లో మరింత ఆసక్తి నెలకొంది.
గతంలోనే, Oppo అధికారులు రాబోయే Find N5 స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్ అవుతుందని స్పష్టం చేశారు. అంతే కాదు, ఇది తెలుపు రంగు ఆప్షన్‌లో వస్తుందని కూడా నిర్ధారించబడింది. రాబోయే Oppo Find N5 హ్యాండ్‌సెట్ నీటి నియంత్రణ కోసం IPX9 రేటింగ్‌ను కలిగి ఉందని, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని ప్రచారంలో ఉంది. దీనికి సంబంధించి కూడా ఎలాంటి ధృవీకరణా లేదు.
సరికొత్త Oppo Find N5 ఫోన్ మడతపెట్టినప్పుడు ప్రొఫైల్ 9.2mm ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలి టీజర్‌లో ఈ హ్యాండ్‌సెట్ 5.1 mm మందం కలిగిన ఐప్యాడ్ ప్రో M4 కంటే సన్నగా ఉన్నట్లు కనిపించింది. అలాగే, రాబోయే Oppo ఫోల్డబుల్ కేవలం 4mm మందంగా ఉంటుందని అంచనా. ఈ ఫోన్ చైనా వెలుపల ఎంపిక చేసిన మార్కెట్లలో OnePlus Open 2గా లాంఛ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Oppo Find N5 స్మార్ట్ ఫోన్ 2K రిజల్యూషన్‌తో 6.85-అంగుళాల LTPO డిస్‌ప్లేతో రావచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh భారీ బ్యాటరీతో నడుస్తుందని చెబుతున్నారు. ఈ హ్యాండ్‌సెట్ శాటిలైట్ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కెమెరా విషయానికి వస్తే.. Oppo Find N5 స్మార్ట్ ఫోన్ హాసెల్‌బ్లాడ్-బ్యాక్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రావచ్చని భావిస్తున్నారు.

ప్రకటన
ప్రకటన