Oppo Find X9 Ultra (12GB రామ్ + 512GB స్టోరేజ్) ధరను ఏకంగా రూ.1,69,999 గా నిర్ణయించారు.
Vivo X300 Ultra features a Zeiss-tuned triple rear camera unit
Oppo Vs Vivo : భారతదేశపు అల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త సంచలనం నమోదైంది. ప్రముఖ దిగ్గజ సంస్థ ఒప్పో తన మోస్ట్ అవేటెడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Oppo Find X9 Ultraను అధికారికంగా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌ను కంప్లీట్ ఫోటోగ్రఫీ ప్రేమికులను టార్గెట్ చేస్తూ డిజైన్ చేశారు. మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న Vivo X300 Ultraకు గట్టి పోటీ ఇచ్చేలా ఒప్పో ఈ ఫోన్‌ను సర్వాంగ సుందరంగా, అంతే పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దింది.
ఒప్పో వర్సెస్ వివో ధరల వివరాలు
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా కేవలం ఒకే ఒక హై-ఎండ్ వేరియంట్‌లో లభిస్తున్నాయి. అందువల్ల వీటి ధరలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. మార్కెట్లో Oppo Find X9 Ultra (12GB రామ్ + 512GB స్టోరేజ్) ధరను ఏకంగా రూ.1,69,999 గా నిర్ణయించారు. ఇది కాన్యన్ ఆరెంజ్, టండ్రా అంబర్ రంగుల్లో దొరుకుతుంది. మరోవైపు Vivo X300 Ultra (16GB రామ్ + 512GB స్టోరేజ్) ధర రూ.1,59,999 గా ఉంది. ఇది ఎక్లిప్స్ బ్లాక్, విక్టరీ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. వివో ఫోన్‌తో పాటు అదనంగా జైస్ టెలిఫోటో ఎక్స్‌టెండర్ లెన్స్ (రూ.27,999), ఇమేజింగ్ గ్రిప్ కిట్ (రూ.11,999) విడిగా కొనుగోలు చేయవచ్చు. ధర పరంగా చూస్తే వివో కంటే ఒప్పో పదివేలు ఎక్కువగా ఉంది.
డిస్‌ప్లే రేస్‌లో ఎవరిది పైచేయి?
రెండు ఫోన్లలోనూ కంటికి అద్దం పట్టేలాంటి అద్భుతమైన డిస్‌ప్లేలను ఉపయోగించారు. ఒప్పో Find X9 Ultra లో 6.82 అంగుళాల QHD+ అమోలెడ్ స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1,800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనికి రక్షణగా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అమర్చారు. అయితే వివో X300 Ultra ఒక అడుగు ముందుకేసి 6.82 అంగుళాల 2K అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు ఏకంగా 144Hz హై రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అలాగే దీని బ్రైట్‌నెస్ రేంజ్ కూడా ఎక్కువే. రెండు ఫోన్లలోనూ పిక్సెల్ డెన్సిటీ 510ppi గా సమానంగా ఉంది. ఒప్పో ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16 పై, వివో ఫోన్ ఆరిజిన్ ఓఎస్ 6 పై రన్ అవుతాయి.
వాటర్ రెసిస్టెన్స్‌లో ఒప్పో సరికొత్త రికార్డు
సాధారణంగా ప్రీమియం ఫోన్లకు IP68 రేటింగ్ మాత్రమే ఉంటుంది. కానీ ఒప్పో Find X9 Ultra బిల్డ్ క్వాలిటీ విషయంలో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. దీనికి ఏకంగా IP66 + IP68 + IP69 త్రిపుల్ రేటింగ్స్ ఇచ్చారు. అంటే ఎంతటి భారీ వర్షం, దుమ్ము లేదా నీటి ప్రవాహం ఉన్నా ఈ ఫోన్‌కు ఏమీ కాదు. వివో X300 Ultra కి కూడా మంచి రక్షణ ఇచ్చే IP68 + IP69 రేటింగ్ ఉంది.
ఛార్జింగ్ స్పీడ్స్
పెర్ఫార్మెన్స్ పరంగా రెండు ఫోన్లలోనూ ఒకే రకమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, అడ్రినో 840 గ్రాఫిక్స్ కార్డ్ ఉన్నాయి. కాబట్టి స్పీడ్ విషయంలో రెండూ సూపర్ ఫాస్టే. కానీ బ్యాటరీ విభాగంలో ఒప్పో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఒప్పో Find X9 Ultraలో ఏకంగా 7,050mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని ఇచ్చారు. దీనికి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కాగా, వివో X300 Ultra లో 6,600mAh బ్యాటరీ మాత్రమే ఉంది. ఇది 100W వైర్డ్ మరియు 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి ఒప్పో బెస్ట్ ఆప్షన్.
హాసెల్‌బ్లాడ్ వర్సెస్ జైస్
ఈ రెండు ఫోన్ల ప్రధాన ఆయుధం వీటి కెమెరాలే. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా లో హాసెల్‌బ్లాడ్ ట్యూన్ చేసిన క్వాడ్ (నాలుగు) కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (OIS సపోర్ట్), 50MP అల్ట్రా-వైడ్, 200MP టెలిఫోటో, మరో 50MP అల్ట్రా-టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి.
మరోవైపు వివో X300 అల్ట్రా లో జైస్ బ్రాండింగ్‌తో కూడిన ట్రిపుల్ (మూడు) కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3.7x ఆప్టికల్ జూమ్), 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ ముందు వైపు సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడం విశేషం.
ఫైనల్‌గా ఏ ఫోన్ కొంటే బెస్ట్?
మీకు ఫోన్ బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువగా ఉండాలి, ఛార్జింగ్ త్వరగా అవ్వాలి, అలాగే నాలుగు కెమెరాల ఫ్లెక్సిబిలిటీ కావాలి అనుకుంటే Oppo Find X9 Ultra వైపు వెళ్ళవచ్చు. లేదు, మీకు రూ.10,000 తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రామ్ (16GB RAM) కావాలి, 144Hz స్క్రీన్ స్మూత్‌నెస్, ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ (Zeiss లెన్స్) ముఖ్యం అనుకుంటే Vivo X300 Ultra మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది.
ప్రకటన
ప్రకటన
Meta Launches Forum App as a Reddit-Like Platform for Discussions With AI-Powered Assistant for Admins