గత ఏడాది వచ్చిన వివో X300 సిరీస్‌లో కేవలం రెండు మోడల్స్ మాత్రమే ప్రారంభంలో రాగా, ఈసారి మాత్రం వివో ఒకేసారి మూడు మోడల్స్‌ను మార్కెట్లోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది.
Photo Credit: Vivo
Vivo X500 series is expected to succeed last year's Vivo X300 lineup
Vivo X500 Pro Max : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు వివో కంపెనీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. తన ప్రీమియం సెగ్మెంట్‌లో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు వివో X500 సిరీస్‌ను లైన్లోకి తెస్తోంది. ఈ సిరీస్ లాంచ్‌కు ఇంకా కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది వచ్చిన వివో X300 సిరీస్‌లో కేవలం రెండు మోడల్స్ మాత్రమే ప్రారంభంలో రాగా, ఈసారి మాత్రం వివో ఒకేసారి మూడు మోడల్స్‌ను మార్కెట్లోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది. అంతేకాదు, గత సిరీస్ కంటే చాలా ముందుగానే చైనాలో ఈ ఫోన్లను గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్లు టెక్ వర్గాల సమాచారం.
ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్ వివో X500 ప్రో మాక్స్. ప్రముఖ టెక్ వెబ్‌సైట్ గిజ్మోచైనా కథనం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 8,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చబోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యాటరీకి సంబంధించిన ప్రొటోటైప్ పరీక్షల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ల చరిత్రలోనే వివో తన X సిరీస్‌లో ఇంత పెద్ద సైజు బ్యాటరీని వాడటం ఇదే మొదటిసారి కానుంది. కంపెనీ ఇప్పటివరకు తెచ్చిన మోడల్స్ చూస్తే.. వివో X300 లో 6,040mAh, ఎక్స్300 ప్రో లో 6,510mAh బ్యాటరీ ఉండగా, టాప్ ఎండ్ మోడల్ అయిన వివో X300 అల్ట్రా లో 6,600mAh బ్యాటరీ మాత్రమే ఉంది. వాటన్నింటి రికార్డులను తిరగరాస్తూ ఎక్స్500 ప్రో మాక్స్ సరికొత్త పవర్‌హౌస్‌గా నిలవనుంది.
ఈ ఫోన్ కేవలం బ్యాటరీలోనే కాకుండా పర్ఫార్మెన్స్‌లో కూడా రారాజులా నిలవబోతోంది. మీడియాటెక్ సంస్థ ఇంకా అధికారికంగా విడుదల చేయని లేటెస్ట్ ఆక్టా-కోర్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌ను ఈ ఫోన్లలో వాడబోతున్నారట. ఇది శామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్ లాగే సరికొత్త 2nm (నానోమీటర్) టెక్నాలజీతో తయారు కానుంది. ప్రాసెసర్ సైజు ఎంత చిన్నగా ఉంటే ఫోన్ పర్ఫార్మెన్స్ అంత వేగంగా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. హెవీ గేమింగ్ ఆడేవారికి, రోజంతా ఫోన్ వాడేవారికి ఈ కాంబినేషన్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.
స్క్రీన్ సైజుల విషయానికి వస్తే.. ఈ సిరీస్‌లోని మూడు ఫోన్లు వేర్వేరు సైజుల్లో రాబోతున్నాయి. బేసిక్ మోడల్ అయిన వివో X500 స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల డిస్‌ప్లేతో రానుండగా, వివో X500 ప్రో మోడల్‌ను కాస్త చేతికి ఇమిడిపోయేలా 6.31 అంగుళాల స్క్రీన్‌తో డిజైన్ చేస్తున్నారు. ఇక అందరికంటే పెద్దదైన వివో X500 ప్రో మాక్స్ మోడల్ 6.85 అంగుళాల భారీ 2K OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది పాత మోడల్స్ లో ఉన్న 1.5K అమోలెడ్ స్క్రీన్స్ కంటే చాలా ఎక్కువ కలర్ ఫుల్ గా, క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది.
కెమెరా విభాగంలో కూడా వివో ఎప్పటిలాగే తన మార్క్ చూపించబోతోంది. వివో X500 ప్రో మాక్స్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇస్తున్నారు. ఇందులో సరికొత్త LOFIC (లేటరల్ ఓవర్‌ఫ్లో ఇంటిగ్రేషన్ కెపాసిటర్) టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల ఎక్కువ ఎండ ఉన్నప్పుడు లేదా కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఫోటోలు ఓవర్ ఎక్స్‌పోజ్ అవ్వకుండా, నాచురల్ కలర్స్‌తో వస్తాయి. దీనికి తోడుగా ఏకంగా 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా జత చేస్తున్నారు. దీని ద్వారా ఎంత దూరం ఉన్న వస్తువునైనా క్వాలిటీ తగ్గకుండా జూమ్ చేసి ఫోటోలు తీసుకోవచ్చు. అయితే ఈ వివరాలన్నింటిపై వివో కంపెనీ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ప్రకటన
ప్రకటన
Meta Launches Forum App as a Reddit-Like Platform for Discussions With AI-Powered Assistant for Admins