భారతదేశంలో ఒప్పో Find X9s స్మార్ట్‌ఫోన్ రెండు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
Photo Credit: Oppo
Oppo Find X9s features a 32-megapixel selfie camera
Oppo : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో భారతీయ వినియోగదారుల కోసం మరో ప్రీమియం ఫోన్‌ను రంగంలోకి దించింది. తన ఫ్లాగ్‌షిప్ లైనప్‌ను విస్తరిస్తూ ఒప్పో Find X9s మోడల్‌ను గురువారం అధికారికంగా విడుదల చేసింది. గత నెల ఏప్రిల్ 21న ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో విడుదలైన సరిగ్గా నెల రోజులకు ఈ ఫోన్ ఇండియాకు చేరింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఉన్న Find X9, ఎక్స్9 ప్రో మోడల్స్ సరసన ఇప్పుడు ఈ మూడో వేరియంట్ వచ్చి చేరింది. అద్భుతమైన డిజైన్, పవర్‌ఫుల్ బ్యాటరీ, ప్రొఫెషనల్ గ్రేడ్ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ ప్రీమియం లవర్స్‌ను ఆకట్టుకోనుంది.
ఒప్పో Find X9s ధర, కలర్ ఆప్షన్లు
భారతదేశంలో ఒప్పో Find X9s స్మార్ట్‌ఫోన్ రెండు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ ధరను రూ.79,999గా నిర్ణయించారు. అలాగే 12GB రామ్, 512GB హెవీ స్టోరేజ్ ఉన్న టాప్ ఎండ్ మోడల్ ధర రూ.89,999గా ఉంది. ఈ ఫోన్‌ను కస్టమర్లు ల్యావెండర్ స్కై, మిడ్‌నైట్ గ్రే, సన్‌సెట్ ఆరెంజ్ అనే మూడు అట్రాక్టివ్ కలర్స్‌లో సొంతం చేసుకోవచ్చు.
అదిరిపోయే లాంచ్ ఆఫర్లు, సేల్ వివరాలు
ఈ ప్రీమియం ఫోన్ కొనుగోలుపై ఒప్పో భారీ డిస్కౌంట్లను ప్రకటిచింది. కస్టమర్లు బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఫ్లాట్ 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీనితో పాటు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలనుకునే వారికి రూ.5,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఎలాంటి వడ్డీ లేని 24 నెలల ఇంట్రెస్ట్-ఫ్రీ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్లలో ముందస్తు బుకింగ్‌కు అందుబాటులో ఉంది. మే 28 నుండి దీని రెగ్యులర్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.
![]()
హాసెల్‌బ్లాడ్ ట్రిపుల్ కెమెరా మ్యాజిక్
ఫోటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం ఒప్పో ఇందులో నెక్స్ట్ లెవెల్ కెమెరా సెటప్‌ను ఇచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాసెల్‌బ్లాడ్ కంపెనీతో కలిసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను డిజైన్ చేశారు. ఇందులో విశేషం ఏంటంటే.. వెనుక ఉన్న మూడు కెమెరాలు కూడా 50 మెగాపిక్సెల్ సామర్థ్యం ఉన్నవే. మెయిన్ కెమెరా 50MP (f/1.8) కాగా దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంది. దీనితో పాటు 120 డిగ్రీల వైడ్ యాంగిల్ కవర్ చేసే 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ద్వారా సినిమాటిక్ స్టైల్‌లో 4K వీడియోలను 60fps వేగంతో రికార్డ్ చేసుకోవచ్చు.
అల్ట్రా పవర్‌ఫుల్ ప్రాసెసర్, ట్రిపుల్ ఐపీ రేటింగ్ రక్షణ
ఒప్పో Find X9s స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత సరికొత్త కలర్ఓఎస్ 16 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. ఫోన్ స్పీడ్, పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్ సంస్థకు చెందిన లేటెస్ట్ ఆక్టా-కోర్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి ఇమ్మోర్టాలిస్ G925 MC12 గ్రాఫిక్స్ కార్డ్ (GPU) 12GB ఎల్డీఆర్5ఎక్స్ రామ్ జత చేశారు. అన్నిటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే.. ఈ ఫోన్‌కు IP66 + IP68 + IP69 అనే ట్రిపుల్ ఐపీ రేటింగ్స్ ఉన్నాయి. అంటే అత్యంత శక్తివంతమైన నీటి అలలు, వేడి నీటి తుంపర్లు, దుమ్ము నుంచి ఈ ఫోన్‌కు గరిష్ట రక్షణ లభిస్తుంది.
సరికొత్త అమోలెడ్ డిస్‌ప్లే, బాహుబలి బ్యాటరీ
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.59 అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (Full-HD+) అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్ రేట్, 1.07 బిలియన్ కలర్స్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని వాడారు. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. ఇందులో 7,025mAh భారీ సిలికాన్ బ్యాటరీని అమర్చారు. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఈ ఫోన్ బరువు కేవలం 202 గ్రాములు మాత్రమే ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
Meta Launches Forum App as a Reddit-Like Platform for Discussions With AI-Powered Assistant for Admins