సోనీ బ్రావియా 3II సిరీస్ స్మార్ట్ టీవీలు సరికొత్త విజువల్ టెక్నాలజీతో రూపొందాయి.
Photo Credit: Sony
Sony Bravia 3II supports Dolby Vision, Dolby Atmos, and DTS:X
Sony : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ భారతీయ కస్టమర్ల కోసం విజువల్స్ పరంగా సరికొత్త విప్లవానికి తెరలేపింది. తన పాపులర్ బ్రాండ్ బ్రావియా లైనప్‌లో భాగంగా సరికొత్త సోనీ బ్రావియా 3II స్మార్ట్ టీవీ సిరీస్‌ను దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. థియేటర్ రేంజ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే తన ప్రీమియం ఎక్స్ఆర్ ప్రాసెసర్ టెక్నాలజీని ఈసారి కాస్త అందుబాటు ధరలోనే కస్టమర్లకు అందించడం విశేషం. అల్ట్రా హై-డెఫినిషన్ 4K డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గూగుల్ జెమిని ఏఐ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఈ టీవీ సొంతం.
సోనీ బ్రావియా 3II సిరీస్ స్మార్ట్ టీవీలు సరికొత్త విజువల్ టెక్నాలజీతో రూపొందాయి. ఇందులో అమర్చిన సోనీ పవర్‌ఫుల్ ఎక్స్ఆర్ ప్రాసెసర్ ప్రతి దృశ్యాన్ని నేచురల్ గా చూపిస్తుంది. కలర్ అక్యురెసీ కోసం ఎక్స్ఆర్ ట్రిలుమినోస్ ప్రో, బ్లర్ లేకుండా క్లియర్ పిక్చర్స్ కోసం ఎక్స్ఆర్ క్లియర్ ఇమేజ్ ఫీచర్లను ఇందులో జోడించారు. హోమ్ ఆడియో, వీడియో పరంగా కస్టమర్లను మెప్పించడానికి డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, DTS:X సౌండ్ సిస్టమ్స్‌ను అందించారు. దీనివల్ల డైలాగులు చాలా స్పష్టంగా వినిపించడమే కాకుండా బేస్ రూమ్ అంతా అదిరిపోయేలా వస్తుంది.
గేమింగ్ ప్రియులకు ఈ స్మార్ట్ టీవీ ఒక అద్భుతమైన గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న నాలుగు హెచ్‌డీఎమ్‌ఐ 2.1 పోర్టుల సాయంతో 4K రెజల్యూషన్‌లో సెకనుకు 120 ఫ్రేమ్స్ (120fps) స్పీడ్‌తో గేమ్స్ ఆడుకోవచ్చు. స్క్రీన్ లాగ్స్ లేకుండా స్మూత్‌గా ఉండటానికి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR), ఆటో లో లేటెన్సీ మోడ్ (ALLM) వసతులు ఉన్నాయి. సోనీ ప్లేస్టేషన్ 5 కన్సోల్ కోసం ఈ టీవీని ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేశారు. డాల్బీ విజన్ గేమింగ్, ప్రత్యేక గేమింగ్ మెనూ, పీఎస్ రిమోట్ ప్లే వంటి ఫీచర్లు గేమ్ ఆడేటప్పుడు నెక్స్ట్ లెవెల్ కిక్ ఇస్తాయి.
ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది. దీనివల్ల నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి వేలాది యాప్‌లతో పాటు 4 లక్షలకు పైగా సినిమాలు, షోలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. గూగుల్ అసిస్టెంట్ ద్వారా చేతులు వాడకుండా కేవలం వాయిస్ కమాండ్‌తో టీవీని కంట్రోల్ చేయొచ్చు. యాపిల్ ఎయిర్‌ప్లే 2, అమెజాన్ అలెక్సా కనెక్టివిటీ కూడా ఉంది. అంతేకాకుండా, ఈ 2026 బ్రావియా మోడల్స్ అన్నింటికీ రాబోయే రోజుల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా గూగుల్ జెమిని ఏఐ సపోర్ట్‌ను కూడా అందించబోతున్నట్లు సోనీ అధికారికంగా ప్రకటించింది.
భారత్‌లో వేరియంట్లు.. ధరల పూర్తి వివరాలు
సోనీ బ్రావియా 3II సిరీస్ విభిన్న స్క్రీన్ సైజులలో లభిస్తుంది.
* 55-అంగుళాల మోడల్: దీని ప్రారంభ ధర రూ. 99,990.
* 65-అంగుళాల మోడల్: దీని ధర రూ. 1,24,990.
* 75-అంగుళాల మోడల్: దీని ధర రూ. 1,79,990.
* 85-అంగుళాల మోడల్: దీని ధర రూ. 3,05,990.
వీటిలో 55, 65, 75 ఇంచుల మోడల్స్ ఈ మే 2026 నుంచే అమ్మకానికి రాగా.. పెద్ద స్క్రీన్ అయిన 85 ఇంచుల మోడల్ ఆగస్టు 2026 లో అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది చివర్లో ఏకంగా 100 ఇంచుల జెయింట్ మోడల్‌ను కూడా తీసుకురావడానికి సోనీ ప్లాన్ చేస్తోంది.
ఈ టీవీ కొనుగోలు చేసే వారికి సోనీ పిక్చర్స్ కోర్ యాప్ ద్వారా ఐదు ప్రీమియం సినిమాలను ఒక సంవత్సరం పాటు ఉచితంగా చూసే క్రెడిట్స్ లభిస్తాయి. ఇందులో ఐమాక్స్ ఎన్‌హ్యాన్స్‌డ్ కంటెంట్‌ను 80 Mbps హై-స్పీడ్‌తో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. పవర్ ఫ్లక్చుయేషన్స్, మెరుపులు, ధూళి, తేమ నుంచి టీవీ పాడవకుండా ఉండటానికి ఇందులో ఎక్స్-ప్రొటెక్షన్ ప్రో రక్షణను కల్పించారు. అలాగే కరెంట్ బిల్లు ఆదా చేసుకోవడానికి ఇకో డ్యాష్‌బోర్డ్ 2 ఫీచర్‌ను కూడా అమర్చారు.
ప్రకటన
ప్రకటన
Realme Watch S5 Launched in India With 1.97-Inch AMOLED Display, Up to 20 Days Battery Life
Take-Two Confirms GTA 6 Launch Date Again, Says Marketing Campaign Will Begin This Summer