ఒప్పో ఫైండ్ X9s బేస్ వేరియంట్ (12GB రామ్ + 256GB స్టోరేజ్) ధర రూ.79,999గా ఉంది.
Oppo Find X9s vs Vivo X300 FE vs OnePlus 15
Smartphone Comparison : భారతదేశంలోని ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లవర్స్ కోసం మార్కెట్లోకి మూడు సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్స్ వచ్చేసాయి. ఒప్పో సంస్థ కాంపాక్ట్ డిజైన్, హ్యాసెల్‌బ్లాడ్ కెమెరాతో ఒప్పో ఫైండ్ X9s మోడల్‌ను లాంచ్ చేయగా.. దానికి గట్టి పోటీ ఇస్తూ జైస్ కెమెరాల కాంబినేషన్‌తో వివో X300 FE మార్కెట్లోకి దిగింది. ఇదే సమయంలో ఎప్పటిలాగే పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, సూపర్ ఫాస్ట్ చార్జింగ్, సరికొత్త ఏఐ ఫీచర్ల అస్త్రాలతో వన్‌ప్లస్ 15 కూడా రేసులోకి వచ్చేసింది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు దాదాపు ఒకే ధరల శ్రేణిలో లభిస్తుండటంతో, అసలు ఏ ఫోన్ కొంటే లాభం అని కస్టమర్లు తెగ ఆలోచిస్తున్నారు. అందుకే ఈ మూడు ఫోన్ల ప్రత్యేకతలు, కెమెరాలు, బ్యాటరీల పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
ధరల విషయానికొస్తే ఏది బడ్జెట్ ఫ్రెండ్లీ?
మొదటగా ధరల వివరాలు చూస్తే.. ఒప్పో ఫైండ్ X9s బేస్ వేరియంట్ (12GB రామ్ + 256GB స్టోరేజ్) ధర రూ.79,999గా ఉంది. దీని టాప్ ఎండ్ వెర్షన్ (12GB రామ్ + 512GB స్టోరేజ్) ధర రూ.89,999లు. అలాగే వివో X300 FE ఫోన్ ధరలు కూడా సరిగ్గా ఒప్పో లాగే ఉన్నాయి. దీని 12GB+256GB మోడల్ రూ.79,999లకు, 12GB+512GB మోడల్ రూ.89,999లకు లభిస్తోంది. అయితే ఈ మూడింటిలో వన్‌ప్లస్ 15 ధర కాస్త తక్కువగా ఉండి కస్టమర్లను ఆకర్షిస్తోంది. వన్‌ప్లస్ 15 బేస్ మోడల్ (12GB+256GB) ధర రూ.72,999లకే లభిస్తుండగా.. దీని భారీ స్టోరేజ్, ఎక్కువ రామ్ ఉన్న టాప్ వెర్షన్ (16GB+512GB) ధర రూ.79,999గా ఉంది. అంటే ఒప్పో, వివోల బేస్ మోడల్ ధరకే వన్‌ప్లస్‌లో ఎక్కువ రామ్ ఉన్న టాప్ మోడల్ వచ్చేస్తుందన్నమాట.
స్క్రీన్ క్వాలిటీ, సాఫ్ట్‌వేర్ పవర్
డిస్‌ప్లే విషయానికి వస్తే ముగ్గురిదీ విభిన్నమైన శైలి. ఒప్పో ఫైండ్ X9s ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.59 ఇంచుల అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఉంది. ఇక వివో X300 FE స్క్రీన్ కాస్త చిన్నదిగా 6.31 ఇంచులు ఉన్నప్పటికీ, దీని బ్రైట్‌నెస్ రేంజ్ ఏకంగా 5,000 నిట్స్. అంటే ఎండలో నిలబడి చూసినా కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వన్‌ప్లస్ 15 అందరికంటే పెద్దదైన 6.78 ఇంచుల క్యూహెచ్‌డీ ప్లస్ (QHD+) అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది గేమ్స్ ఆడేటప్పుడు సూపర్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ కోసం 165Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా మూడు ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగానే పనిచేస్తాయి. అయితే వివో కంపెనీ తమ ఫోన్‌కు 5 సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్స్, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తోంది. మూడు ఫోన్లకు కూడా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 (IP68), ఐపీ69 (IP69) రేటింగ్స్ ఉన్నాయి.
ప్రొసెసర్ స్పీడ్, బ్యాటరీ సామర్థ్యం!
పర్ఫార్మెన్స్ మరియు బ్యాటరీ విషయంలో ఈసారి కంపెనీలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఒప్పో ఫైండ్ X9s మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రొసెసర్‌తో పాటు ఏకంగా 7,025mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనికి 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇక వివో X300 FE ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 6,500mAh బ్యాటరీ, 90W ఫ్లాష్ చార్జ్ మరియు 40W వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. అయితే పర్ఫార్మెన్స్ బాస్ అయిన వన్‌ప్లస్ 15 లో క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రొసెసర్‌ను వాడారు. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. దీనితో పాటు గూగుల్ జెమిని ఏఐ ఇంటిగ్రేషన్, ప్లస్ మైండ్, ఏఐ స్క్యాన్ లాంటి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వన్‌ప్లస్ 15 లో 7,300mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చారు. ఇది ముగ్గురిలో కెల్లా అతిపెద్ద బ్యాటరీ. అంతేకాకుండా దీనికి 120W సూపర్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం.
లెన్స్‌ల పవర్ ఎలా ఉందంటే?
కెమెరాల విషయానికి వస్తే మూడు ఫోన్లలోనూ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఒప్పో ఫైండ్ X9s ప్రసిద్ధ హ్యాసెల్‌బ్లాడ్ ట్యూనింగ్‌తో వస్తుంది. దీని వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. వివో X300 FE ఫోన్ ప్రసిద్ధ జైస్ బ్రాండింగ్‌తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 ప్రధాన కెమెరా, 100x డిజిటల్ జూమ్ చేయగల 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 టెలిఫోటో కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం దీని ముందు భాగంలో ఏకంగా 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరాను ఇచ్చారు. వన్‌ప్లస్ 15 ఫోన్ డీటెయిల్‌మాక్స్ ఇమేజ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీని వెనుక 50 మెగాపిక్సెల్ సోనీ IMX906 మెయిన్ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్ చేయగల 50 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. వన్‌ప్లస్ వెనుక కెమెరాతో 8K వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
iOS 27 Update for iPhone Adds Impersonation Risk Detection Feature to Protect You Against Scams