ఈ చిన్న స్క్రీన్ ఫోన్లు కేవలం చేతికి సౌకర్యంగా ఉండటమే కాకుండా.. ఫ్లాగ్‌షిప్ కెమెరాలు, హై-ఎండ్ ప్రాసెసర్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. భారత మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ 6.3 ఇంచుల చిన్న స్క్రీన్ ఫోన్ల పూర్తి వివరాలు, వాటి ధరల గురించి తెలుసుకుందాం.
Vivo X300 FE features a 6.31-inch AMOLED panel
Compact Smartphones : ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పెద్ద డిస్‌ప్లేలు ఉన్న ఫోన్ల హవా నడుస్తోంది. లార్జ్ స్క్రీన్లపై వీడియోలు చూడటానికి చాలా మంది ఇష్టపడుతున్నప్పటికీ.. రోజువారీ వాడకంలో అవి చాలా బరువుగా, హ్యాండిల్ చేయడానికి ఇబ్బందిగా మారుతున్నాయి. అందుకే ఇప్పటికీ చాలా మంది కస్టమర్లు ఒక్క చేత్తో సులువుగా ఆపరేట్ చేయగలిగే, జేబులో ఇట్టే ఇమిడిపోయే కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ చిన్న స్క్రీన్ ఫోన్లు కేవలం చేతికి సౌకర్యంగా ఉండటమే కాకుండా.. ఫ్లాగ్‌షిప్ కెమెరాలు, హై-ఎండ్ ప్రాసెసర్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. భారత మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ 6.3 ఇంచుల చిన్న స్క్రీన్ ఫోన్ల పూర్తి వివరాలు, వాటి ధరల గురించి తెలుసుకుందాం.
యాపిల్ లవర్స్ కోసం ఐఫోన్ 17ఇ
తక్కువ బడ్జెట్‌లో కాంపాక్ట్ ఐఫోన్ అనుభవాన్ని కోరుకునే వారి కోసం యాపిల్ సంస్థ ఐఫోన్ 17ఇ ని తీసుకొచ్చింది. ఈ ఫోన్ 6.1 ఇంచుల సూపర్ రెటినా XDR ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్, సరికొత్త ఏ19 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్‌తో వచ్చే ఈ మోడల్ సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు యాక్షన్ బటన్, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 26 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ వస్తుంది. భారతదేశంలో ఐఫోన్ 17ఇ బేస్ వేరియంట్ (256జీబీ) ధర రూ. 64,900 కాగా, 512జీబీ మోడల్ ధర రూ. 84,900 గా ఉంది. ఇది బ్లాక్, సాఫ్ట్ పింక్, వైట్ కలర్స్‌లో లభిస్తోంది.
5000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వివో X300 FE
ఆండ్రాయిడ్ ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్ చిన్న ఫోన్ కొనాలనుకుంటే వివో X300 FE బెస్ట్ ఛాయిస్. ఇది 6.31 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. దీని స్క్రీన్ బ్రైట్‌నెస్ ఏకంగా 5,000 నిట్స్ కావడం విశేషం. అంటే మండుటెండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రొసెసర్, 12జీబీ ర్యామ్‌తో రన్ అయ్యే ఈ ఫోన్‌లో జియాస్ ట్యూన్ చేసిన 50MP త్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీ ఉండటం, దానికి 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం ఒక అద్భుతం. వివో X300 FE (12జీబీ + 256జీబీ) ధర రూ. 79,999 గా ఉంది. అలాగే 512జీబీ టాప్ మోడల్ ధర రూ. 89,999 గా నిర్ణయించారు.
![]()
యాపిల్ అల్టిమేట్ పవర్‌హౌస్.. సరికొత్త ఐఫోన్ 17
ప్రీమియం లుక్, అల్టిమేట్ పవర్‌ను కోరుకునే చిన్న స్క్రీన్ ప్రియుల కోసం ఐఫోన్ 17 అందుబాటులో ఉంది. ఇది 6.3 ఇంచుల సూపర్ రెటినా XDR ప్రొమోషన్ (120Hz) డిస్‌ప్లేను కలిగి ఉంది. యాపిల్ ఏ19 చిప్‌తో పనిచేసే ఈ ఫోన్ వెనుక భాగంలో 48MP మెయిన్ కెమెరాతో పాటు 48MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఇచ్చారు. సెల్ఫీల కోసం 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది 40W వైర్డ్ చార్జింగ్, మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 17 (256జీబీ) ధర మనదేశంలో రూ. 82,900 కాగా, 512జీబీ వేరియంట్ ధర రూ. 1,02,900 గా ఉంది. ఇది లావెండర్, సేజ్, మిస్ట్ బ్లూ వంటి అట్రాక్టివ్ కలర్స్‌లో దొరుకుతుంది.
![]()
రూ. 50 వేల బడ్జెట్‌లో గూగుల్ మ్యాజిక్.. పిక్సెల్ 9a
మీ బడ్జెట్ గనుక రూ.50,000 లోపు ఉంటే, ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కోసం గూగుల్ పిక్సెల్ 9aని కళ్ళు మూసుకుని కొనేయవచ్చు. 6.3 ఇంచుల ఆక్చువా పోలెడ్ (pOLED) 120Hz డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ గూగుల్ టెన్సార్ జీ4 చిప్‌పై పనిచేస్తుంది. దీనికి ఏకంగా 7 సంవత్సరాల పాటు ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్లను గూగుల్ హామీ ఇస్తోంది. ఇందులో 48MP + 13MP బ్యాక్ కెమెరాలు, 5,100mAh బ్యాటరీ ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 9a కేవలం ఒకే ఒక్క వేరియంట్ (8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్) లో లభిస్తుంది. దీని ధర రూ. 49,999 గా ఫిక్స్ చేశారు.
Xiaomi : రెడ్‌మి ప్రియులకు డబుల్ ధమాకా.. ఆ రెండు స్మార్ట్‌ఫోన్ల వెనుక దాగున్న అసలు ట్విస్ట్ ఇదే!
కెమెరా ప్రియుల కోసం ఒప్పో రెనో 15 ప్రో మినీ 5G
చిన్న సైజులోనే అదిరిపోయే కెమెరా ఫీచర్లు కావాలనుకుంటే ఒప్పో రెనో 15 ప్రో మినీ 5G బెస్ట్ ఆప్షన్. ఇది 6.32 ఇంచుల 1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రొసెసర్, 12జీబీ ర్యామ్‌తో పాటు ఈ ఫోన్ వెనుక భాగంలో ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండటం విశేషం. ఇందులో 6,200mAh బ్యాటరీతో పాటు 80W సూపర్ ఫాస్ట్ చార్జింగ్ లభిస్తుంది. ఒప్పో రెనో 15 ప్రో మినీ (12జీబీ + 256జీబీ) ధర భారతదేశంలో రూ. 59,999 గా ఉంది. ఇది కోకో బ్రౌన్, గ్లేసియర్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
iOS 27 Update for iPhone Adds Impersonation Risk Detection Feature to Protect You Against Scams