OnePlus confirms India Operations: అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి వన్‌ప్లస్ తప్పుకుంటుందనే వార్త తెలియగానే భారతదేశంలోని వన్‌ప్లస్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది
OnePlus
OnePlus Confirms exit form US and Europe Markets: గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన వన్‌ప్లస్ కంపెనీ తన చరిత్రలోనే అత్యంత కీలకమైన, షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది. గత కొన్ని వారాలుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఉత్తర అమెరికా, యూరప్ దేశాలలో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. దీని అర్థం రాబోయే రోజుల్లో ఆయా దేశాల్లో వన్‌ప్లస్ నుంచి ఎలాంటి కొత్త మొబైళ్లు లేదా గ్యాడ్జెట్లు విడుదల కావు. కంపెనీ తన అంతర్జాతీయ వ్యూహాత్మక మార్పులలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనితో ఆయా మార్కెట్లలో వన్‌ప్లస్ 15 సిరీస్ మోడలే చివరి ఫోన్ కానుంది.
ఇండియా వన్‌ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్..
అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి వన్‌ప్లస్ తప్పుకుంటుందనే వార్త తెలియగానే భారతదేశంలోని వన్‌ప్లస్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఎందుకంటే వన్‌ప్లస్‌కు ఇండియానే అతిపెద్ద గ్లోబల్ మార్కెట్. అయితే ఈ విషయంపై స్పందించిన కంపెనీ భారతీయ కస్టమర్లకు భారీ ఊరటనిచ్చింది. భారత్‌లో తమ వ్యాపారానికి ఎలాంటి ఢోకా లేదని, ఇక్కడి కార్యకలాపాలు ఎప్పటిలాగే చాలా పటిష్టంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇండియన్ యూజర్లకు కొత్త ప్రొడక్ట్ లాంచ్‌లు, రెగ్యులేటరీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సపోర్ట్ యథాతథంగా అందుబాటులో ఉంటాయని కంపెనీ మేనేజ్‌మెంట్ భరోసా ఇచ్చింది.
భారత్‌లో కొత్త మోడళ్ల సందడి..
భారతదేశం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన మార్కెట్ అని చెప్పడానికి వన్‌ప్లస్ తన అప్కమింగ్ ప్లాన్స్ ను కూడా బయటపెట్టింది. ఇండియాలో తమ బిజినెస్ ప్లాన్ ట్రాక్‌లోనే ఉందని, ఇటీవలే లాంచ్ అయిన డివైజ్‌లతో పాటు మరికొన్ని కొత్త ఫోన్లను కూడా త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే వన్‌ప్లస్ ఎన్6, దాని తర్వాతి మోడల్ అయిన వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ స్మార్ట్‌ఫోన్లు భారతీయ మార్కెట్ రోడ్‌మ్యాప్‌లో సిద్ధంగా ఉన్నాయని కంపెనీ స్పష్టం చేసింది. కాబట్టి భారతీయ వినియోగదారులు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఆక్సిజన్ ఓఎస్ క్లోజ్.. ఒప్పో కలర్ ఓఎస్లోకి మారనున్న వన్‌ప్లస్ ఫోన్లు..
ఈ వ్యూహాత్మక మార్పులలో భాగంగా వన్‌ప్లస్ ఫోన్ల సాఫ్ట్‌వేర్ పరంగా ఒక సంచలన మార్పు జరగబోతోంది. వన్‌ప్లస్ ఫోన్లలో ఇప్పటివరకు ఉన్న అధికారిక ఆక్సిజన్ ఓఎస్ స్థానంలో, ఇకపై దాని పేరెంట్ కంపెనీ అయిన ఒప్పోకి చెందిన కలర్ ఓఎస్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఏడాది చివర్లో రాబోయే ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్ తో ఈ మార్పు మొదలవుతుంది. అర్హత కలిగిన వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమకు నచ్చితే స్వచ్ఛందంగా కలర్ ఓఎస్‌కు అప్‌గ్రేడ్ అవ్వచ్చు. ఒప్పో మరియు వన్‌ప్లస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) విభాగాలను ఒకటి చేయడం ద్వారా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను చాలా వేగంగా కస్టమర్లకు అందించవచ్చని, దీనివల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ మరింత స్థిరంగా, భవిష్యత్ టెక్నాలజీకి తగినట్లుగా మారుతుందని కంపెనీ పేర్కొంది.
పాత కస్టమర్ల భద్రతకు ఫుల్ గ్యారంటీ..
అమెరికా, యూరప్ దేశాల్లో కొత్త ఫోన్ల లాంచ్ ఆపేసినప్పటికీ, ఇప్పటికే వన్‌ప్లస్ ఫోన్లు వాడుతున్న పాత కస్టమర్లను కంపెనీ నడిరోడ్డుపై వదిలేయడం లేదు. ప్రస్తుత వినియోగదారులందరికీ షెడ్యూల్ ప్రకారం రావాల్సిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచీలు అందుతాయి. అలాగే ఫోన్ల వారంటీ కవరేజ్, కస్టమర్ కేర్ సర్వీస్ సపోర్ట్ మరియు వినియోగదారుల రక్షణ చట్టాల నిబంధనల ప్రకారం లభించాల్సిన అన్ని సేవలు యథాతథంగా కొనసాగుతాయని వన్‌ప్లస్ హామీ ఇచ్చింది. ఇదే రకమైన పూర్తి స్థాయి సర్వీస్ మరియు వారంటీ భరోసాను భారతీయ వినియోగదారులకు కూడా వర్తింపజేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
అసలు వన్‌ప్లస్ ఎందుకు ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది?
వన్‌ప్లస్ సంస్థ ఈ సడన్ నిర్ణయానికి గల స్పష్టమైన కారణాలను అధికారికంగా పూర్తిగా బయటపెట్టలేదు. కేవలం అంతర్గత పనితీరును మెరుగుపరుచుకోవడానికి, ఒప్పో ఎకోసిస్టమ్‌లో వనరులను సరిగ్గా వాడుకోవడానికే ఈ మార్పులు చేస్తున్నట్లు పైకి చెబుతోంది. అయితే మార్కెట్ నిపుణుల విశ్లేషణల ప్రకారం.. అమెరికా, యూరప్ మరియు ఇండియా వంటి ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లలో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల వేగం తగ్గడం దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు మొబైల్ విడిభాగాలు, ముఖ్యంగా ర్యామ్, మెమరీ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, అమెరికాలోని భౌగోళిక రాజకీయ సవాళ్లు, అలాగే యాపిల్ కంపెనీతో నడుస్తున్న కొన్ని న్యాయపరమైన వివాదాలు కూడా వన్‌ప్లస్ బ్రాండ్ ను ఈ కఠిన నిర్ణయం వైపు నడిపించాయని మార్కెట్ వర్గాల సమాచారం.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
iOS 27 Update for iPhone Adds Impersonation Risk Detection Feature to Protect You Against Scams