Vivo X Fold 6 Could Bring These Upgrades Over the Current Model

ఒక టిప్‌స్టర్ వెల్లడించిన విషయాలని గమనిస్తే.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 మరియు షియోమీ మిక్స్ ఫోల్డ్ 6 మోడల్స్ గా వివో మరియు షియోమీలు ఫోల్డబుల్ ఫోన్‌లను లాంచ్ చేయనుందని తెలుస్తుంది.

Vivo X Fold 6 Could Bring These Upgrades Over the Current Model

Vivo X Fold 5 (చిత్రంలో ఉన్నది) అడ్వాన్స్ వెర్షన్ Vivo X Fold 6

ముఖ్యాంశాలు
  • Vivo X Fold 6లో 7,000mAh బ్యాటరీ ఉండనుందని సమాచారం
  • ఈ హ్యాండ్‌సెట్‌లో 200-మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంటుందని అంచనా.
  • Xiaomi Mix Fold 6 లో Xring O3 ప్రొప్రైటరీ ప్రాసెసర్ ఉండవచ్చని అంచానా
ప్రకటన

2026 లో Honor Magic V6 మరియు Oppo Find N6 విడుదలతో చైనాలో ఫోల్డబుల్ ఫోన్ల శకం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఏడాది చివర్లో శాంసంగ్ తన తాజా  బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌ తో పాటు , ఒక వైడ్-ఫోల్డింగ్ మోడల్ ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయనుందని అందరు భావిస్తున్నారు. ఒక టిప్‌స్టర్ వెల్లడించిన విషయాలని గమనిస్తే.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 మరియు షియోమీ మిక్స్ ఫోల్డ్ 6 మోడల్స్ గా వివో మరియు షియోమీలు ఫోల్డబుల్ ఫోన్‌లను లాంచ్ చేయనుందని తెలుస్తుంది. 

Vivo X Fold 6 స్పెసిఫికేషన్లు ఇలా ఉండవచ్చు 

ఒక వీబో టిప్‌స్టర్ బాల్డ్ పాండా చేసిన పోస్ట్ ప్రకారం.. వివో నుండి రాబోయే తరువాత ఫోల్డబుల్ ఫోన్, బహుశా వివో ఎక్స్ ఫోల్డ్ 6 అయి ఉండవచ్చని.. ఈ ఫోన్ లో బ్యాటరీ మరియు కెమెరా అప్‌గ్రేడ్‌లపై ఎక్కువ ఫోకస్ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ ఫోన్ లో ఇప్పటి వరకి మారే ఇతర ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో చూడని అతిపెద్ద బ్యాటరీ తో పాటు ప్రైమరీ రియర్ కెమెరా  200-మెగాపిక్సెల్ గా ఉండవచ్చని తెలిపారు.

ఇటీవల లీకైన సంచారంతో పోలిస్తే టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది కూడా సరిపోవటంతో ఇది నిజమే అని అందరు అనుకుంటున్నారు. అంతేకాకుండా.. ఈ టిప్‌స్టర్ వివో ఎక్స్ ఫోల్డ్ 6 లో 7,000mAh బ్యాటరీని అమర్చనున్నారని తెలిపారు. ఈ కెపాసిటీ బ్యాటరీ ఉపయోగించినప్పటికీ, ఈ హ్యాండ్‌సెట్ సన్నగా మరియు సింపుల్ డిజైన్ లో ఉండనుందని భావిస్తున్నారు. 

వివో X ఫోల్డ్ 6 ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పని చేయనుందని.. మరియు ఇది ప్రస్తుతం మార్కెట్‌లోని అనేక సబ్-ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు మించి పని చేస్తుందని పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఇదివరకు నివేదికల ఆధారంగా చూస్తే..  IMEI డేటాబేస్‌లలో కనిపించడంతో X ఫోల్డ్ 6 అభివృద్ధి దశలో ఉందన్న వాదనకు బలం చేకూరుతుంది.వివో ఎక్స్ ఫోల్డ్ 6 జూన్ లో  విడుదలయ్యే అవకాశం ఉందని.. సరిగ్గా వివో X ఫోల్డ్ 5 విడుదల సమయానికి సరిపోలుతుందని భావిస్తున్నారు. 

మరోవైపు చూస్తే.. షియోమి తీసుకు రాబోయే ఫోల్డబుల్ ఫోన్ పేరు షియోమి మిక్స్ ఫోల్డ్ 5గా పిలవబడుతోంది. ఇది చిప్‌సెట్ స్థాయిలో మార్పులను తీసుకువస్తుందని.. ఈ ఫోల్డబుల్‌లో Xring O3 అని పిలువబడే ఒక కొత్త ప్రొప్రైటరీ ప్రాసెసర్ ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది గత సంవత్సరం Xring O1 చిప్ స్థానంలో వస్తుందని అంచనా వేస్తున్నారు.

టిప్‌స్టర్ బాల్డ్ పాండా చేసిన పోస్ట్ కామెంట్స్ లో చెక్ చేస్తే.. షియోమి తన ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌ను మూడో త్రైమాసికంలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తుంది. 
 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »