Xiaomi Smart Solar Camera 4 Pro Launched with 4G connectivity and 9900mAh battery: ప్రముఖ చైనా టెక్ దిగ్గజం షావోమీ మార్కెట్లోకి ఎంతో ఉపయోగకరమైన సెక్యూరిటీ డివైజ్‌ను పరిచయం చేసింది. షావోమీ స్మార్ట్ సోలార్ కెమెరా 4 ప్రో 4G డ్యూయల్ కెమెరా ఎడిషన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది.
Photo Credit: Xiaomi Youpin
Xiaomi
Xiaomi Smart Solar Camera 4 Pro Launched with 4G connectivity and 9900mAh battery: ప్రముఖ చైనా టెక్ దిగ్గజం షావోమీ మార్కెట్లోకి ఎంతో ఉపయోగకరమైన సెక్యూరిటీ డివైజ్‌ను పరిచయం చేసింది. బయటి ప్రదేశాల్లో నిఘా కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న షావోమీ స్మార్ట్ సోలార్ కెమెరా 4 ప్రో 4G డ్యూయల్ కెమెరా ఎడిషన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కెమెరా పనిచేయడానికి ఇంటి కరెంట్ వైర్లు కానీ, వైఫై కనెక్షన్ కానీ అస్సలు అవసరం లేకపోవడం దీని ప్రత్యేకత. వైఫై సిగ్నల్స్ అందని దూర ప్రాంతాలు, కరెంట్ సరఫరా లేని కన్స్ట్రక్షన్ సైట్లు, వ్యవసాయ తోటలు, ఫామ్‌హౌస్‌లు, అవుట్డోర్ ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటి ప్రదేశాలను దృష్టిలో ఉంచుకునే షావోమీ ఈ సోలార్ 4G కెమెరాను డిజైన్ చేసింది. విద్యుత్ సౌకర్యం లేకపోయినా ఇది నిరంతరాయంగా పనిచేస్తూ రక్షణ కల్పిస్తుంది.
7.6W సోలార్ ప్యానెల్, 9900mAh జంబో బ్యాటరీ
ఈ కెమెరాలో ఏకంగా 9,900mAh సామర్థ్యం గల పవర్ఫుల్ బ్యాటరీ అమర్చబడి ఉంది. దీనితో పాటు 7.6W సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ కూడా వస్తుంది. పగటిపూట సూర్యరశ్మి ద్వారా సోలార్ ప్యానెల్ నుంచి ఈ బ్యాటరీ నిరంతరం రీఛార్జ్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల మానవ ప్రమేయం లేకుండా, వేరే పవర్ సప్లై సహాయం లేకుండానే ఈ కెమెరా రోజంతా నిరంతరాయంగా రికార్డింగ్ చేస్తుంది.
నెట్వర్క్ దానంతట అదే స్విచ్ అయ్యే వినూత్న ఫీచర్
ఈ డివైజ్ రన్ అవ్వడానికి వైఫై రూటర్ అవసరం లేదు. ఇందులో బిల్ట్-ఇన్ డ్యూయల్ 4G సిమ్ కార్డ్ సపోర్ట్‌ను కంపెనీ అందించింది. ఒక నెట్వర్క్ సిగ్నల్ బలహీనపడితే, కెమెరా ఆటోమేటిక్‌గా మరో సిమ్ నెట్వర్క్కి స్విచ్ అయి కనెక్టివిటీ కట్ కాకుండా చూసుకుంటుంది. మి హోమ్ యాప్ ద్వారా కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ కెమెరా రికార్డ్ చేసే దృశ్యాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు.
Social Media Ban : పిల్లలకు సోషల్ మీడియా బంద్?.. 16 ఏళ్ల లోపు వారికి ఆంక్షలపై కేంద్ర ప్రభుత్వం యోచన
AI ట్రాకింగ్ అండ్ IP66 వాటర్‌ప్రూఫ్ రక్షణ
ఈ సెక్యూరిటీ డివైజ్‌లో 5 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన రెండు కెమెరా సెన్సార్లు ఉన్నాయి. ఇవి అత్యంత స్పష్టమైన 3K రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డ్ చేస్తాయి. ఇందులో అందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోషన్ ట్రాకింగ్ ఫీచర్ ద్వారా మనుషుల కదలికలను గుర్తుపట్టి అలర్ట్‌లు పంపుతుంది. వర్షం, ఎండ, దుమ్ము నుంచి కెమెరా పాడవకుండా ఉండేందుకు దీనికి IP66 డస్ట్ అండ్ వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌ను అందించారు.
యుపిన్ వెబ్సైట్లో షావోమీ కొత్త కెమెరా విక్రయాలు
షావోమీ ఈ స్మార్ట్ సోలార్ కెమెరా 4 ప్రోను ప్రస్తుతం చైనా మార్కెట్లో ప్రవేశపెట్టింది. అక్కడ దీని ధర 649 యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.9,200)గా నిర్ణయించారు. ఈ కెమెరాను కంపెనీకి చెందిన అధికారిక షాపింగ్ ప్లాట్‌ఫామ్ షావోమీ యుపిన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Cyberpunk 2077 Gets New Quests, Gameplay Features and Mod Support With Edgerunners 2 Update